News


సెన్సెక్స్‌ తక్షణ అవరోధం 41,810

Monday 30th December 2019
Markets_main1577675544.png-30504

మార్కెట్‌ ట్రాకింగ్‌ కోసం విదేశీ ఇన్వెస్టర్లు, దేశీయ ఫండ్స్‌...అధికంగా అనుసరించే నిఫ్టీ–50 సూచి ఈ ఏడాది పలు సందర్భాల్లో 11,700–12,160 పాయింట్ల మధ్య కొత్త రికార్డుల్ని నెలకొల్పినా,  రికార్డుస్థాయి దాటిన ప్రతీ సందర్భంలోనూ మరింత ముందడుగువేయలేక, పెద్ద కరెక్షన్‌కు లోనవుతూ వచ్చింది. తాజాగా డిసెంబర్‌ చివరివారంలో 12,158 గరిష్టస్థాయిని దాటిన తర్వాత 1 శాతం వరకూ నిఫ్టీ పైకి ఎగరగలిగింది. మళ్లీ యథాప్రకారం వెనువెంటనే దిద్దుబాటు బాటలో పడిపోయింది. సాంకేతికంగా ఈ తరహా ర్యాలీలు నిలదొక్కుకోలేవు. కొత్త రికార్డును నెలకొల్పినంతనే, కనీసం 4–5 శాతం వేగంగా పరుగులు తీస్తేనే....విస్త్రత ర్యాలీ సాధ్యపడుతుంది. లేకపోతే కొత్త ఏడాదిలో కూడా 10 శాతం కదలికలకే సూచి పరిమితమవుతుంది. తద్వారా ఈ ఏడాదిలానే కొద్ది షేర్లే లబ్దిపొందుతాయి. అధికశాతం షేర్లు నష్టాలకు లోనవుతాయి.  ఇక స్టాక్‌ సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి......

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
డిసెంబర్‌ 27తో ముగిసిన నాలుగు రోజుల ట్రేడింగ్‌వారంలో తొలుత 41,132 పాయింట్ల వరకూ కరెక్షన్‌కు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌..ఆ కనిషస్థాయి నుంచి వేగంగా కోలుకుని 41,575 పాయింట్ల వద్ద ముగిసింది.  చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 107 పాయింట్ల  స్వల్పనష్టాన్ని చవిచూసింది. ఈ వారం మార్కెట్‌ పెరిగితే తొలుత 41,810 పాయింట్ల వద్ద అవరోధం కలగవచ్చు.  ఈ స్థాయిని దాటితే 41,980 పాయింట్ల వరకూ పెరగవచ్చు.  ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ  42,200 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు.  ఈ వారం మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనైతే సెన్సెక్స్‌ 41,265 పాయింట్ల వద్ద తొలి మద్దతును పొందవచ్చు. ఈ లోపున వేగంగా 41,130 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 41,000 పాయింట్ల వరకూ తగ్గుదల కొనసాగవచ్చు. 

నిఫ్టీ తక్షణ నిరోధం 12,295...
గత కాలమ్‌లో ప్రస్తావించిన రీతిలో తొలి నిరోధాన్ని అధిగమించలేక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,118 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. అటుతర్వాత వేగంగా కోలుకుని 12,246 పాయింట్ల వద్ద ముగిసింది. అంతక్రితం వారంతో పోలిస్తే 26 పాయింట్ల స్వల్పనష్టాన్ని చవిచూసింది. ఈ వారం నిఫ్టీ పెరిగితే 12,295 పాయింట్ల స్థాయి తొలుత నిరోధించవచ్చు. ఈ స్థాయిని దాటితే 12,360 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపై 12,425 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే ఛాన్స్‌ వుంటుంది. ఈ వారం తొలి నిరోధస్థాయిని దాటలేకపోతే 12,160 పాయింట్ల స్థాయికి వేగంగా తగ్గవచ్చు. ఈ లోపున 12,115 పాయింట్ల వద్దకు క్షీణింవచ్చు. ఈ స్థాయి దిగువన  12,070 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. 
 



You may be interested

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 30th December 2019

టాటా కెమికల్స్‌:-        కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ:- ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర:- రూ.668 టార్గెట్‌ ధర:- రూ.811 ఎందుకంటే:- ఉత్తర అమెరికాలో ఉన్న జాయింట్‌ వెంచర్‌ కంపెనీ(టాటా కెమికల్స్‌ సోడా యాష్‌ పార్ట్‌నర్స్‌ హోల్డింగ్స్‌-టీసీసాప్‌)లో 25 శాతం వాటాను టాటా కెమికల్స్‌ కొనుగోలు చేసింది. దీంతో టీసీసాప్‌లో వంద శాతం వాటా టాటా కెమికల్స్‌ పరమైంది. ఈ వాటా కొనుగోలు కోసం టాటా కెమికల్స్‌ కంపెనీ 19.5 కోట్ల డాలర్లు వెచ్చించింది. దీంట్లో 17.5

ఆర్థికాంశాలే దిక్సూచి..!

Monday 30th December 2019

ఈ వారంలోనే మార్కిట్ తయారీ పీఎంఐ,  ఆటో రంగ విక్రయాల డేటా వెల్లడి నేడే ఆర్‌బీఐ ఆపరేషన్‌ ట్విస్ట్‌ 2.0 తక్కువ వాల్యూమ్స్‌తో కన్సాలిడేషన్‌కు అవకాశం ముంబై: స్థూల ఆర్థిక గణాంకాలు, ఆటో రంగ పరిశ్రమ అమ్మకాలు వంటి అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. నవంబర్‌ నెలకు సంబంధించి.. ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి, మార్కిట్ తయారీ పీఎంఐ వంటి అంశాలు మార్కెట్‌

Most from this category