News


తక్షణ మద్దతుశ్రేణి 40,820-40.690

Monday 10th February 2020
Markets_main1581305007.png-31636

  • తక్షణ మద్దతుశ్రేణి 40,820-40.690

కరోనా వైరస్‌ ప్రభావం, బడ్జెట్‌పై అంచనాలు నెరవేరకపోవడంతో భారత్‌ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూసినప్పటికీ.... గతవారం ప్రపంచ మార్కెట్ల వేగవంతమైన  ర్యాలీని ఇక్కడి ఈక్విటీలు కూడా అనుసరించాయి. ఈ మధ్యలో అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌, భారత రిజర్వ్‌బ్యాంక్‌ పాలసీ నిర్ణయాలు యథాతథంగా వుండటంతో  మార్కెట్లపై పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు.  పటిష్టమైన బుల్‌ మార్కెట్లో హఠాత్‌ పతనం సంభవించినపుడు, సాంకేతికంగా రిట్రేస్‌మెంట్‌ ర్యాలీలు కూడా బలంగానే  వస్తుంటాయి. అటువంటిదే గతవారం జరిగిన ర్యాలీగా ప్రస్తుతానికి పరిగణించాల్సివుంటుంది. రానున్న వారాల్లో సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పితేనే, బుల్‌ట్రెండ్‌  కొనసాగుతున్నదని భావించాల్సివుంటుంది. అది జరగకపోతే, బలమైన డౌన్‌ట్రెండ్‌లోకి భారత్‌ మార్కెట్‌ మళ్లవచ్చు. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా  వున్నాయి.....

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
ఫిబ్రవరి 7తో ముగిసినవారం ప్రధమార్థంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నిలువునా 39,563 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది. ద్వితీయార్థంలో వేగంగా  కోలుకుని 41,394 పాయింట్ల వద్దకు పెరిగింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 1167 పాయింట్ల  భారీలాభంతో  40,906 పాయింట్ల వద్ద  ముగిసింది. ఈ వారం మార్కెట్‌ క్షీణిస్తే 40,820-40,690 పాయింట్ల శ్రేణి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ శ్రేణిని పరిరక్షించుకుంటే గతవారం జరిగిన  రికవరీ కొనసాగే అవకాశం వుంటుంది. ఆ సందర్భంలో తొలుత 41,390 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపై 41,520 పాయింట్ల వద్దకు, ఆపైన 41,700  పాయింట్ల స్థాయికి చేరవచ్చు. ఈ వారం తొలి మద్దతుశ్రేణిని కోల్పోతే 40,475 పాయింట్ల స్థాయికి వేగంగా తగ్గవచ్చు. ఈ లోపున 40,015 పాయింట్ల వరకూ క్షీణత  కొనసాగవచ్చు. 

నిఫ్టీ తక్షణ మద్దతుశ్రేణి 11.985-11.950...

గతవారం ప్రారంభంలో 11,614 పాయింట్ల కనిష్టస్థాయివరకూ తగ్గిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, అటుతర్వాత జోరుగా 12,160 పాయింట్ల వరకూ ర్యాలీ సాగించింది.   చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 426 పాయింట్ల లాభంతో 12,098 పాయింట్ల వద్ద ముగిసింది. కీలకమైన 200 డీఎంఏ స్థాయి సమీపంలో మద్దతు  పొందిన నిఫ్టీ జనవరి రికార్డుస్థాయి 12,430 పాయింట్ల నుంచి కోల్పోయిన 800 పాయింట్లకుపైగా నష్టాల్లో 61.8 శాతం రికవరీ చేసుకోగలిగింది. ఈ  ఫిబోనకి స్థాయి అయిన 12,120 పాయింట్లు రానున్న రోజుల్లో నిఫ్టీకి కీలకం.  ఈ స్థాయి దిగువన ఈ సోమవారం నిఫ్టీ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 11,985 -11,950 పాయింట్ల శ్రేణి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ శ్రేణిని పరిరక్షించుకుంటూ 12,120 పాయింట్లపైన నిఫ్టీ స్థిరపడితే తొలుత 12,160 పాయింట్ల స్థాయిని  అందుకోవొచ్చు. అటుపైన 12,215 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే 12,270 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. పైన ప్రస్తావించిన  తొలి మద్దతుశ్రేణిని ఈ వారం కోల్పోతే వేగంగా 11.885 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 11,750 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. 



You may be interested

సెయిల్‌లో 5 శాతం వాటా విక్రయం !

Monday 10th February 2020

ఓఎఫ్‌ఎస్‌ మార్గంలో విక్రయించనున్న కేంద్రం  రూ.1,000 కోట్లు సమీకరణ  న్యూఢిల్లీ: సెయిల్‌(స్టీల్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా)లో 5 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ఈ వాటా షేర్లను విక్రయించాలనేది ప్రభుత్వ భావన. ఈ వాటా విక్రయం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1,000 కోట్లు సమకూరుతాయని అంచనా. ఈ వాటా విక్రయానికి సంబంధించిన రోడ్‌షోలను సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌ల్లో నిర్వహించాలని దీపమ్‌, ఉక్కు శాఖలు ప్రణాళికలు

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

Monday 10th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 2 పాయింట్లు మైనస్‌ శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు డీలా నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో నామమాత్రంగా 2 పాయింట్లు క్షీణించి 12,081 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,083 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా.. జనవరిలో

Most from this category