News


ఈ వారం స్టాక్‌ రికమెండేషన్‌ షేర్లివే..!

Monday 26th August 2019
Markets_main1566793537.png-28012


రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌         కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
ప్రస్తుత ధర: రూ.307
టార్గెట్‌ ధర: రూ.460

ఎందుకంటే:- తమిళనాడు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ హౌసింగ్‌ ఫైనాన్స్‌  కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో అంచనాలను మించిన ఫలితాలను ప్రకటించింది. ఆదాయం, నికర వడ్డీ మార్జిన్‌లు  మెరుగ్గా ఉండటం, పటిష్టమైన వ్యయ నియంత్రణ చర్యల కారణంగా రూ.62 కోట్ల నికర లాభం సాధించింది. రుణ మంజూరీలు 5 శాతం తగ్గి రూ.670 కోట్లకు చేరాయి. ఫలితంగా నిర్వహణ ఆస్తులు 13 శాతమే పెరిగాయి. సీజనల్‌ ట్రెండ్‌కు అనుగుణంగానే స్థూల మొండి బకాయిలు పెరిగాయి. గత ఆర్తిక సంవత్సరంలో 3 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 4.2 శాతానికి పెరిగాయి. తమిళనాడు మార్కెట్‌ 8 శాతమే వృద్ధి సాధించగా, మహారాష్ట్ర 26 శాతం, గుజరా™Œత్‌ 46 శాతం చొప్పున వృద్ది చెందాయి. రుణ నాణ్యతలో ఒడిదుడుకులు, వృద్ధి మందగమనం తదితర అంచనాల కారణంగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ షేర్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాం. సమీప భవిష్యత్తులో షేర్‌ క్షీణత పరిమితంగానే ఉంటుందనే అంచనాలతో ఈ షేర్‌ రేటింగ్‌ను ‘కొనచ్చు’కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం.  రుణ రివకరీలకు ›ప్రాధాన్యం ఇస్తున్న ఈ కంపెనీ పెద్ద మొత్తం రుణాలకు దూరంగా ఉంటోంది. స్వయం ఉపాధి రంగం సెగ్మెంట్‌పై పట్టు ఉండటం, ఇతర సంస్థలు పట్టించుకోని సెగ్మెంట్లకు రుణాలివ్వడం సానుకూలాంశాలు. 12 రాష్ట్రాల్లో 147 బ్రాంచ్‌లు, 27 శాటిలైట్‌ సెంటర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. లోన్‌ క్యాంప్స్‌ నిర్వహణ ద్వారా రుణాలందిస్తోంది. ఫలితంగా మార్కెటింగ్‌ వ్యయాలు పెద్దగా ఉండకపోవడం కూడా కలసివచ్చే అంశమే. 

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌         కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.43
టార్గెట్‌ ధర: రూ.54

ఎందుకంటే:- ఐడీఎఫ్‌సీ బ్యాంక్, క్యాపిటల్‌ ఫస్ట్‌ సంస్థలు 2018, డిసెంబర్‌లో విలీనమై ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ ఏర్పడింది. రూ.1,12,558 కోట్ల ఆస్తులతో ఎనిమిదవ అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌గా అవతరించింది. క్యాపిటల్‌ ఫస్ట్‌ సంస్థను విజయపథంలో నడిపించిన వి. వైద్యనాధన్‌ నేతృత్వంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ 279 బ్రాంచ్‌లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కార్పొరేట్‌ రుణాల కంటే మార్జిన్లు అధికంగా ఉండే రిటైల్‌ రుణాలకు ప్రాధాన్యత ఇస్తోంది. రిటైల్‌ రుణాలు 27 శాతం చక్రగతి వృద్ధితో 2022–23 కల్లా రూ.1,06,850 కోట్లకు పెరుగుతాయని అంచనా. ఫలితంగా స్థూల రుణాలు 10 శాతం చక్రగతి వృద్దితో రూ.1,62,880 కోట్లకు చేరగలవని భావిస్తున్నాం. ప్రస్తుతం మొత్తం రుణాల్లో 35 శాతంగా ఉన్న రిటైల్‌ రుణాలు నాలుగేళ్లలో 66 శాతానికి పెరుగుతాయని అంచనా. ఫలితంగా ఈల్డ్స్‌ 13.1 శాతానికి చేరతాయి. నాలుగేళ్లలో కాసా డిపాజిట్లు నాలుగు రెట్లు పెరుగుతాయని అంచనా. ఫలితంగా కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ 1 శాతం మేర తగ్గుతుంది. మార్జిన్లు అధికంగా ఉండే రిటైల్‌ రుణాలు పెరగడం, కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ తగ్గడంతో రాబడి నిష్పత్తులు పెరుగుతాయి. నాలుగేళ్లలో రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ (ఆర్‌ఓఈ)11 శాతానికి ఎగుస్తుంది. ఈ బ్యాంక్‌ నికర వడ్డీ మార్జిన్‌ 4 శాతానికి పెరగనున్నది. ఈ విషయంలో హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్, కోటక్‌ బ్యాంక్‌ల సరసన నిలవగలుగుతుంది. ప్రస్తుతం 43గా ఉన్న ఈ షేర్‌ ఏడాది కాలంలో రూ.54కు పెరగగలదని భావిస్తున్నాం.You may be interested

72 మార్కును దాటిని రూపీ

Monday 26th August 2019

ట్రేడ్‌ వార్‌ తీవ్రమవ్వడంతో రూపీ డాలర్‌ మారకంలో సోమవారం 32 పైసలు బలహీనపడి 71.98 వద్ద  ప్రారంభమైంది. కొద్ది నిముషాల్లోనే రూపీ డాలర్‌ మారకంలో 72 మార్కును దాటడం గమనార్హం. ఎఫ్‌పీఐలపై సర్‌చార్జీని ఉపసంహరించడం వంటి చర్యలను ఆర్థిక మంత్రి శుక్రవారం ప్రకటించడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 15 పైసలు బలపడి 71.66 వద్ద ముగిసింది.  ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధుల ఔట్‌ఫ్లో నిరంతరం కొనసాగడంతో రూపీ

మీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ భద్రమేనా...?

Monday 26th August 2019

గరిష్టంగా రూ.లక్షకే ఒక బ్యాంకులో బీమా వివిధ బ్యాంకుల్లో రూ.లక్ష చొప్పున డిపాజిట్‌ ఒకే బ్యాంకులో చేసుకోదలిస్తే కుటుంబ సభ్యుల పేర్లతో చిన్న డిపాజిట్లుగా విడగొట్టడం వల్ల పలు ప్రయోజనాలు అవసరమైన సందర్భంలో ఒక డిపాజిట్‌ రద్దు చేసుకోవచ్చు వడ్డీ రేట్లు తగ్గుతున్నందున వివిధ కాలావధులకు డిపాజిట్లు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అన్నది రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఎంతో విశ్వసనీయమైన, సౌకర్యమైన ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనం. ఎన్నో దశాబ్దాలుగా ఎక్కువ మంది అనుసరించే సాధనాల్లో ఇది కూడా ఒకటి. ఎన్నో కాల

Most from this category