స్టాక్స్ వ్యూ
By Sakshi

బజాజ్ ఫైనాన్స్ కొనచ్చు హిందుస్తాన్ యూనిలీవర్ కొనచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఇండియాబుల్స్ వెంచర్స్
ప్రస్తుత ధర: రూ.3,520
టార్గెట్ ధర: రూ.4,000
ఎందుకంటే:- బజాజ్ గ్రూప్‌నకు చెందిన బజాజ్ ఫిన్సర్వ్కు ఇది అనుబంధ సంస్థ. బజాజ్ ఫిన్‌సర్వ్‌లో బజాజ్ ఫైనాన్స్‌కు 55 శాతం మేర వాటా ఉంది. బజాజ్ ఆటో కంపెనీ వాహన కొనుగోళ్లకు రుణాలిచ్చే కంపెనీ నుంచి విభిన్న వినియోగ రుణాలిచ్చే డైవర్సిఫైడ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీగా) బజాజ్ ఫైనాన్స్ ఎదిగింది. ప్రస్తుతం కన్సూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉంది. మొత్తం 3.44 కోట్ల మంది వినియోగదారులతో అత్యధిక వినియోగదారులున్న ఎన్బీఎఫ్సీ కంపెనీ ఇదే. గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో వినియోగం పరంగా మందగమనం చోటు చేసుకున్నా, ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర వడ్డీ ఆదాయం 50 శాతం ఎగసి రూ.3,395 కోట్లకు, మొత్తం ఆదాయం 52 శాతం వృద్ధితో రూ.5,308 కోట్లకు పెరిగాయి. నికర లాభం 50 శాతం ఎగసి రూ.1,176 కోట్లకు పెరిగింది. వినియోగం మందగమనంగా ఉన్నప్పటకీ ఈ కంపెనీ రుణనాణ్యత నిలకడగానే ఉంది. మొండి బకాయిలు చాలా స్వల్పంగానే పెరిగాయి. స్థూల మొండి బకాయిలు 1.54 శాతం, నికర మొండి బకాయలు 0.63 శాతంగా ఉన్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఇచ్చిన రుణాలను పరిగణనలోకి తీసుకోకుంటే మొండి బకాయిలు వాస్తవానికి తగ్గాయి. సమస్యాత్మక సమయాల్లోనూ ఈ కంపెనీ తన మార్కెట్ వాటాను పెంచుకుంటోంది. రాబడి నిష్పత్తులు పటిష్టంగా ఉన్నాయి. రెండేళ్లలో నికర లాభం 40 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. ఆరు నెలల్లోనే ఈ షేర్ రూ.4,000 చేరగలదని అంచనా వేస్తున్నాం.
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.1,825
టార్గెట్ ధర: రూ.2,070
ఎందుకంటే: ఈ కంపెనీ డిటర్జెంట్ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ సెగ్మెంట్లో ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ (పీ అండ్ జీ) కంపెనీ నుంచి తీవ్రమైన పోటీనే ఎదురవుతోంది. గత కొన్నేళ్లుగా అంతంతమాత్రంగానే ఉన్న సబ్బుల విక్రయాలు గత ఆర్థిక సంవత్సరంలో పుంజుకున్నాయి. అలాగే కాస్మోటిక్స్ అండ్ టాయిలటరీస్ (సీ అండ్ టీ) సెగ్మెంట్ అమ్మకాలు కూడా మెరుగుపడ్డాయి. ఇటీవల కాలంలో ఈ కంపెనీ ఆయుర్వేద ఉత్పత్తుల కంపెనీ ఇందులేఖను, ఆదిత్య ఐస్‌క్రీమ్‌ను, గ్లాక్సోస్మిత్ లైన్ కన్సూమర్ అండ్ హెల్త్(జీఎస్‌కేసీహెచ్)లను కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్లు కంపెనీకి ప్రయోజనం చేకూర్చాయి. ఈ వ్యాపారాల్లో తర్వాతి స్థాయి వృద్ధిని అందుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా వేగంగా స్పందిస్తూ, తగిన ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తోంది. భారత మార్కెట్లో పెరుగుతున్న ప్రీమియమ్ ఉత్పత్తుల వినియోగాన్ని అందిపుచ్చుకోవడానికి ఖరీదైన ఉత్పత్తులను కూడా అందిస్తోంది. వస్తువులు తయారీ, మార్కెటింగ్, ప్రమోషన్లలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకుంటోంది. ఈ కంపెనీ షేర్ విలువ అధికంగా ఉన్నప్పటికీ, నికర లాభ వృద్ధి ఆరోగ్యకరంగా ఉండటం, రాబడి నిష్పత్తులు కూడా అధికంగా ఉండటం సానుకూలాంశాలు. ఈ షేర్ ఏడాది కాలంలో రూ.2,070కు చేరుతుందని భావిస్తున్నాం.
You may be interested
ఈ ఏడాది క్యాపెక్స్ రూ.1,400 కోట్లు:అరబిందో
Monday 17th June 2019హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం సుమారు రూ.1,400 కోట్లు ఉంటుందని ఔషధ సంస్థ అరబిందో ఫార్మా వెల్లడించింది. అలాగే టర్నోవర్‌లో పరిశోధన, అభివృద్ధికి చేసే వ్యయం 5-6 శాతం ఉండొచ్చని కంపెనీ ఎండీ ఎన్.గోవిందరాజన్ తెలిపారు. మూలధన వ్యయంలో ఎక్కువ మొత్తం ఫినిష్డ్ డోసేజెస్, ఏపీఐల తయారీ సామర్థ్యం పెంపు కోసం వినియోగిస్తామన్నారు. బయోసిమిలర్లకు సంబంధించి రెండు మూడింటికి ఫేజ్-1, ఒకదానికి ఫేజ్-3 ప్రారంభిస్తామని చెప్పారు. అరబిందో
రిలయన్స్ వైదొలగడం.. ఫండ్స్‌పై ప్రభావం చూపుతుందా?
Monday 17th June 2019ప్ర: నేను, నా భార్య సీనియర్ సిటిజన్లం. మేం గత కొన్నేళ్లుగా నాలుగు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. అవి యాక్సిస్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్షీల్డ్, ఐసీఐసీఐ ప్రు ఈక్విటీ అండ్ డెట్, సుందరమ్ మిడ్‌క్యాప్ ఫండ్. ఈ ఫండ్స్ ప్రస్తుతం మంచి పనితీరే కనబరుస్తున్నాయి. ఈ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా ? వేరే ఫండ్స్‌ల్లోకి మళ్లించమంటారా ? పన్ను ప్రయోజనాల కోసం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం