News


అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!

Monday 9th December 2019
news_main1575859290.png-30115

  • అమెరికా–చైనాల వాణిజ్య ఒప్పందంపై పెరిగిన ఆశావాదం
  • మంగళ, బుధవారాల్లో అమెరికా ఎఫ్‌ఓఎంసీ సమావేశం
  • గురువారం యూకేలో సాధారణ ఎన్నికలు
  • ఐఐసీ, ద్రవ్యోల్బణం డేటా ఈవారంలోనే..

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం 4.5 శాతం వృద్ధి రేటుకే పరిమితంకావడం, ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో గతవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఒక శాతం నష్టాలను నమోదుచేసింది. నిఫ్టీ 12,000 పాయింట్ల సైకలాజికల్‌ మార్కును కోల్పోయింది. ఇక ఈ వారంలో మార్కెట్‌ ట్రెండ్‌ ఏ విధంగా ఉండనుందనే అంశానికి వస్తే.. ఒడిదుడుకులకే ఆస్కారం ఉందని, మరింత కరెక్షన్‌కు ఆస్కారం ఉందని అధిక శాతం విశ్లేషకులు అంచనావేస్తున్నారు. బలహీనమైన వృద్ధి, క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ప్రస్తుత ప్రీమియం వాల్యుయేషన్ నిలబెట్టుకునే అవకాశం లేదని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా సులభమైన ద్రవ్య విధానాన్ని అనుసరిస్తే మాత్రం మన మార్కెట్లలో పతనానికి అడ్డుకట్ట పడుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టీ 11,750–12,100 స్థాయిలో ఉండేందుకు అవకాశం ఉందని అంచనావేశారు. 

ట్రేడ్‌ డీల్‌పై ఆశలు...
నవంబర్‌లో అమెరికాలోని నిరుద్యోగుల రేటు 3.5 శాతానికి తగ్గడం, వాణిజ్య ఒప్పందంపై పెరిగిన ఆశావాదం కారణంగా శుక్రవారం అక్కడి స్టాక్‌ సూచీలు ఒక శాతం లాభాలను నమోదుచేశాయి. అమెరికా అనేక విడతల్లో చైనా వస్తువులపై సుంకాలు విధించిన విషయం తెలిసిందే కాగా, ఈ నెల 15 నుంచి 156 బిలియన్ డాలర్ల కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. ఈ గడువుతేదీ కంటే ముందుగానే అమెరికా–చైనాల మధ్య తొలి విడత వాణిజ్య ఒప్పందాలు పూర్తయ్యే సూచనలు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే మన మార్కెట్‌ కూడా సానుకూలంగా స్పందించనుందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

ఫెడ్‌ సమావేశంపై దృష్టి...
వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) మంగళ, బుధవారాల్లో సమావేశం కానుంది. ఈ ఏడాదిలో చివరిసారిగా జరిగే ఈ సమావేశం నుంచి వెలువడే నిర్ణయాలు భారత మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ అన్నారు. ఇక గురువారం యూకేలో జరిగే సాధారణ ఎన్నికలు బ్రెగ్జిట్‌కు ఒక దిశను ఇవ్వనున్న నేపథ్యంలో ఈ అంశాపై కూడా మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి. మరోవైపు పెరిగిన ముడిచమురు ధరలు ఈవారం మార్కెట్‌ గమనానికి మరో కీలక అంశంగా మారాయి.

ఆర్థికాంశాల ప్రభావం...
అక్టోబర్‌ నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ), నవంబర్‌ నెల వినియోగ వస్తువుల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం డేటా గురువారం వెల్లడికానున్నాయి. శుక్రవారం డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం డేటా విడుదలకానుంది. 

ఎఫ్‌ఐఐల నికర విక్రయాలు...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈనెల్లో ఇప్పటివరకు రూ. 244 కోట్లను భారత మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. డిపాజిటరీల సమాచారం మేరకు.. గడిచిన వారంలో వీరు రూ. 1,669 కోట్లను ఈక్విటీ మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకున్నారు. అయితే, డెట్‌ మార్కెట్‌లో రూ.1,424 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా వీరి నికర ఉపసంహరణ రూ. 244 కోట్లుగా నిలిచింది. You may be interested

40,250 దిగువన సెన్సెక్స్‌ మరింత బలహీనం

Monday 9th December 2019

సెప్టెంబర్‌ క్వార్టర్లో జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టస్థాయి 4.5 శాతానికి దిగజారినప్పటికీ, ఆ ప్రతికూలాంశాన్ని ఇప్పటికే డిస్కౌంట్‌ చేసుకున్నందున, గతవారం తొలిరోజున స్టాక్‌ మార్కెట్‌ స్థిరంగానే ముగిసింది. ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబాలుగా ఇన్వెస్టర్లు పరిగణిస్తున్న కొన్ని ప్రధాన బ్యాంకింగ్‌ షేర్లు కొత్త రికార్డుస్థాయికి చేరవయ్యాయి కూడా. ఇంతలో రిజర్వుబ్యాంక్‌ నిర్ణయం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ఒక్కసారిగా మార్చివేసింది. వృద్ధి రేటును వేగవంతం చేసేదిశగా వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయన్న నిపుణుల

11,800పైన స్థిరీకరణకు అవకాశం..

Sunday 8th December 2019

ఈక్విటీ మార్కెట్లు నూతన గరిష్ట స్థాయిల వద్ద నిరోధాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా 12,000 పై స్థాయిలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. 12,103 నిరోధాన్ని అధిగమించి పై స్థాయికి వెళితే తప్ప ర్యాలీకి అవకాశం లేదంటున్నారు జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు మిలాన్‌ వైష్ణవ్‌. రానున్న రోజుల్లో మార్కెట్లపై ఆయన విశ్లేషణ ఇలా ఉంది.   ‘‘ఈక్విటీ మార్కెట్లు డబుల్‌ టాప్‌ నిరోధం 12,103ను అధిగమించే ప్రయత్నంలో మరోసారి

Most from this category