గణాంకాలే దిక్సూచి..!
By Sakshi

ముంబై: స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారంలో దేశీ స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. జూలై నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి, ఆగస్టు నెల రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు గురువారం వెల్లడికానుండగా.. ఈ ప్రధాన అంశాలపైనే మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ఈ డేటా ఆశించిన స్థాయి కంటే అధికంగా ఉన్నట్లయితే సూచీలకు ఇది సానుకూలంగా ఉండనుందని విశ్లేషించారయన. ప్రభుత్వం విధాన పరమైన చర్యలు తీసుకుంటుందనే అంచనాల నేపథ్యంలో స్వల్పకాలానికి మార్కెట్ పాజిటీవ్‌గా ఉండేందుకు అవకాశం ఉందని అంచనావేస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ వెల్లడించారు. అయితే, ఈవారంలో వెల్లడికానున్న ద్రవ్యోల్బణం, ఐఐపీ డేటాలు కీలకంగా ఉండనున్నాయని విశ్లేషించారు. సుంకాల పెంపు యుద్ధానికి తెర దించేందుకు అమెరికా, చైనాల మధ్య మరోమారు చర్చలు జరగనున్నాయనే అంశంతో ప్రధాన సూచీలు పాజిటీవ్‌గానే ట్రేడయ్యేందుకు ఆస్కారం ఉందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోడీ అన్నారు. ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే.. సెప్టెంబర్‌లో రూ.1,263 కోట్లు ఉపసంహరణ...
మొహర్రం సందర్భంగా మంగళవారం (10న) దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది.
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈనెల 3 - 6 తేదీల మధ్య ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.4,264 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే, డెట్ మార్కెట్లో రూ.3,001 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ సెప్టెంబర్‌లో ఇప్పటివరకు రూ.1,262.93 కోట్లకు పరిమితమైంది.
You may be interested
సెన్సెక్స్ 37,190 స్థాయిని అధిగమిస్తే...
Monday 9th September 2019ఎఫ్‌పీఐలపై బడ్జెట్లో పెంచిన ఆదాయపు పన్ను సర్ఛార్జ్ ఉపసంహరణ, ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనపు మూలధన కల్పన, ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల లభ్యత వంటి సానుకూల ప్రకటనలు కేంద్రం నుంచి వెలువడినప్పటికీ, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడంతో భారత్ మార్కెట్...అంతర్జాతీయ ట్రెండ్‌కు భిన్నంగా గతవారం నష్టాలతో ముగిసింది. మరోవైపు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు పునర్ప్రారంభంకానున్నట్లు వెలువడిన వార్తలు, వచ్చే ఫెడ్ మీటింగ్‌లో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లన్నీ
సోమవారం వార్తల్లో షేర్లు
Monday 9th September 2019వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు అవెన్యూ సూపర్మార్స్:- రూ.150 కోట్ల విలువైన కమర్షియల్ పేపర్ల ఇష్యూను జారీ చేసింది. పీసీ జ్యూవెలర్స్:- సెప్టెంబర్ 30న కంపెనీ వార్షిక సాధారణ సమావేశం జరగనుంది. పీటీసీ ఇండస్ట్రీస్:- ప్రిఫరెన్షియల్ ఇష్యూ కోసం కంపెనీ సభ్యుల అనుమతి కోరే ప్రతిపాదనను వాయిదా వేయాలని నిర్ణయించుకుంటుంది ఎన్బీసీసీ:- ఆగస్ట్‌లో రూ.400 కోట్ల విలువైన కోట్ల ఆర్డర్లను దక్కించుకున్నట్లు ఎక్సే్ఛంజీలకు సమాచారం ఇచ్చింది. రాణే హోల్డింగ్స్:- రూ.50 కోట్ల విలువైన