STOCKS

News


మార్కెట్‌ ర్యాలీ..?

Monday 26th August 2019
Markets_main1566791659.png-28002

  • ఎఫ్‌పీఐ సర్‌చార్జ్‌ ఉపసంహరణతో మార్కెట్‌కు జోష్‌..
  • సోమవారం గ్యాప్‌ అప్‌ ఓపినింగ్‌కు అవకాశం..
  • క్యూ2 జీడీపీ గణాంకాలు శుక్రవారం వెల్లడి
  • ఈవారంలోనే ఆగస్టు సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు
  • వాణిజ్య యుద్ధంపై ఇన్వెస్టర్ల దృష్టి

ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత వారాంతాన పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత.. భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపే పలు చర్యలను మంత్రి ప్రకటించారు. తాజా ప్రభుత్వ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో మార్కెట్‌కు జోష్‌ వచ్చే అవకాశం ఉందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై బడ్జెట్‌లో ప్రతిపాదించిన సర్‌చార్జీని ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం సానుకూల అంశంగా ఉందని చెబుతున్నాయి. సర్‌చార్జ్‌ అంశం ఇటీవల దేశ స్టాక్‌ మార్కెట్లను తీవ్రంగా నష్టపరచగా.. ఈ కీలక అంశంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టంచేయడంతో మళ్లీ ఎఫ్‌పీఐల పెట్టుబడి భారత క్యాపిటల్‌ మార్కెట్‌కు వచ్చి చేరే అవకాశం ఉందని కోటక్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ ఫండమెంటల్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ రస్మిక్‌ ఓజా విశ్లేషించారు. డాలరుతో రూపాయి మారక విలువ బలపడేందుకు కూడా ప్రభుత్వ తాజా నిర్ణయం దోహదపడనుందని అభిప్రాయపడ్డారు. ‘ఎఫ్‌పీఐల అమ్మకాల ప్రవాహం ఆగిపోయి.. కొనుగోళ్లు జరిగేందుకు అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్‌ పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నాం. అయితే, ఈ ర్యాలీ కొనసాగాలంటే.. కంపెనీల ఆదాయ వృద్ధి పుంజుకుని, ఆర్థిక వ్యవస్థలో మందగమనం తొలగిపోవాలి’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వి.కె.విజయ్‌ కుమార్‌ అన్నారు. భారత జీడీపీలో వృద్ధి వేగంగా కొనసాగుతుందని ఆర్థిక మంత్రి భరసానివ్వడం, ఎఫ్‌పీఐ సర్‌చార్జ్‌ ఉపసంహరణ వంటి కీలక అంశాల నేపథ్యంలో సోమవారం మార్కెట్‌ గ్యాప్‌ అప్‌ ఓపినింగ్‌కు అవకాశం ఉందని ట్రేడింగ్‌ బెల్స్‌ కో-ఫౌండర్‌, సీఈఓ అమిత్ గుప్తా విశ్లేషించారు. 

పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లకు కొనుగోలు మద్దతు..!
ఆర్థిక వ్యవస్థలో రుణ మంజూరీని పెంచేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లను మూలధన సాయంగా అందించనున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. మరోవైపు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీలు)కు అదనంగా రూ.20,000 కోట్ల నిధులను ఎన్‌హెచ్‌బీ ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిదని చెప్పారు. ఈ తాజా అంశాల నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకుల షేర్లకు కొనుగోలు మద్దతు లభించే అవకాశం ఉందని ఎలారా క్యాపిటల్‌ విశ్లేషకులు గరిమా కపూర్ అన్నారు. ఇక ఆటో రంగానికి ఊతమిస్తూ.. ప్రభుత్వ శాఖలు, విభాగాలు పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు సవరణను 2020 జూన్‌ వరకు వాయిదా వేయడం వంటి పలు ప్రోత్సాహక నిర్ణయాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ అంశానికి తోడుగా.. వస్తు, సేవల పన్ను ఊరట లభిస్తే ఆటో రంగ షేర్లలో పతనం ఆగుతుందని దలాల్‌ స్ట్రీట్‌ పండుతులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక (జూలై-సెప్టెంబర్) జీడీపీ అంచనాల గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించనుంది. 

అంతర్జాతీయ అంశాల ప్రభావం..
అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు ధీటుగా చైనా సవాలు విసురుతోంది. ఇటీవల చైనా దిగుమతులపై 10 శాతం సుంకం విధించాలని అమెరికా తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంగా.. మొత్తం 75 బిలియన్ డాలర్ల విలువగల యూఎస్‌ వస్తువులపై అదనంగా 10 శాతం టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు చైనా శుక్రవారం ప్రకటించింది. దీంతో ట్రంప్ అదేరోజున మరోసారి తీవ్రంగా స్పందించారు. చైనా దిగుమతులపై అదనపు సుంకాలను విధించడంతో పాటు ఆదేశం నుంచి అమెరికన్‌ కంపెనీలు బయటకు వచ్చేయలని కోరారు. దీంతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఆరోజున భారీ నష్టాలను చవిచూశాయి. నాస్‌డాక్‌ ఏకంగా 3 శాతం నష్టపోయింది. ఈ ప్రభావం మార్కెట్‌పై ఉండేందుకు ఆస్కారం ఉండనుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

ఆగస్టులో రూ.3,014 కోట్లు ఉపసంహరణ...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆగస్టు 1-23 కాలానికి ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.12,105 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే, డెట్‌ మార్కెట్‌లో రూ.9,091 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా క్యాపిటల్‌ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ ఈనెల్లో ఇప్పటివరకు రూ.3,014 కోట్లకు పరిమితమైంది. ఎఫ్‌పీఐ సర్‌చార్జ్‌ ఉపసంహరణతో వీరి పెట్టుబడులు మళ్లీ పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీ ఎండీ, సీఈఓ విజయ్ చందోక్ అన్నారు. ఆర్థిక మంత్రి ఇచ్చిన భరోసాతో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని వి.కే విజయ్‌కుమార్‌ విశ్లేషించారు.You may be interested

సెన్సెక్స్‌ 37,050 స్థాయిని అధిగమిస్తే..

Monday 26th August 2019

శుక్రవారం మన మార్కెట్‌ ముగిసిన తర్వాత దేశీయంగా ఇన్వెస్టర్లు ఆశిస్తున్న సానుకూల ప్రకటన ఆర్థిక మంత్రి నుంచి వెలువడగా, అంతర్జాతీయంగా అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ మహోధృతరూపం దాల్చింది. బడ్జెట్లో ప్రతిపాదించిన ఆదాయపు పన్ను సర్‌ఛార్జ్‌ ఉపసంహరణ, వ్యవస్థలో లిక్విడిటీ పెంపు, రుణాల్ని చౌకగా లభింపచేయడం, ఆటోమొబైల్‌ రంగానికి రాయితీలు వంటి చర్యలన్నీ ఇన్వెస్టర్లకు రుచించేవే. అయితే అమెరికా ఉత్పత్తులపై చైనా టారీఫ్‌లు వేయడం, వెనువెంటనే చైనా నుంచి అమెరికా కంపెనీల్ని

భారీ గ్యాప్‌అప్‌...సెన్సెక్స్‌ 660 పాయింట్లు, నిఫ్టీ 170 పాయింట్లు జంప్‌

Monday 26th August 2019

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఫలితంగా సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు భారీ గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 663 పాయింట్ల లాభంతో 37,364 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 171 పాయింట్ల లాభంతో 11,000 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి.

Most from this category