News


ఆర్థికాంశాలే దిక్సూచి..!

Monday 30th December 2019
Markets_main1577675249.png-30503

  • ఈ వారంలోనే మార్కిట్ తయారీ పీఎంఐ, 
  • ఆటో రంగ విక్రయాల డేటా వెల్లడి
  • నేడే ఆర్‌బీఐ ఆపరేషన్‌ ట్విస్ట్‌ 2.0
  • తక్కువ వాల్యూమ్స్‌తో కన్సాలిడేషన్‌కు అవకాశం

ముంబై: స్థూల ఆర్థిక గణాంకాలు, ఆటో రంగ పరిశ్రమ అమ్మకాలు వంటి అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. నవంబర్‌ నెలకు సంబంధించి.. ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి, మార్కిట్ తయారీ పీఎంఐ వంటి అంశాలు మార్కెట్‌ కదలికలను ప్రభావితం చేయనున్నాయని ఎడెల్వీజ్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ విశ్లేషించారు. ఈ వారంలో తక్కువ వాల్యూమ్స్‌తో కన్సాలిడేషన్‌కు అవకాశం ఉన్నట్లు భావిస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా చూస్తే మార్కెట్‌ బ్రెడ్త్‌ పాజిటివ్‌గా ఉందని, అప్‌ ట్రెండ్‌కు సంకేతాలు కనిపిస్తున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది ద్వితీయర్థం చివరినాటికి నిఫ్టీ 13,500 పాయింట్లకు చేరే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇక అమెరికా-చైనాల వాణిజ్య ఒప్పందం అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతను నింపిందని, తద్వారా భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌కు ద్రవ్యలభ్యత సమస్య తీరనుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ విశ్లేషించారు. 

ఆటో సేల్స్, ఆర్థికాంశాల ప్రభావం...
నవంబర్‌ నెల మౌలిక సదుపాయాల ఉత్పత్తి గణాంకాలు (30న) సోమవారం విడుదలకానున్నాయి. మార్కిట్ తయారీ పీఎంఐ (జనవరి 2న) గురువారం వెల్లడికానుండగా.. డిసెంబర్ 27తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు, డిసెంబర్ 20 నాటికి నమోదైన పక్షం రోజుల డిపాజిట్, బ్యాంక్ రుణ వృద్ధి (జనవరి 3న) శుక్రవారం వెల్లడికానున్నాయి. ఇక ఈ అంశాలతో పాటు జనవరి ఒకటి నుంచి వెల్లడికానున్న ఆటో రంగ అమ్మకాల డేటా మార్కెట్‌ దిశను నిర్థేశించనుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని అన్నారు. ఆపరేషన్‌ ట్విస్ట్‌ 2.0లో భాగంగా ఆర్‌బీఐ సోమవారం రూ.10,000 కోట్ల విలువైన బాండ్ల క్రయ, విక్రయాలు జరపనుంది. దీనితో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్లకు అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

72 డాలర్లకు క్రూడ్‌..!
బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ శుక్రవారం 66.87 డాలర్లకు చేరుకుంది. అక్టోబర్‌ నెలలో నమోదుచేసిన 56 డాలర్ల కనిష్టస్థాయి నుంచి చూస్తే 12 డాలర్ల మేర పెరిగింది. ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే ఈ ధర 72 డాలర్లకు చేరనుందని ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్ హెడ్ ఫారెక్స్ అండ్ రేట్స్ సజల్ గుప్తా అన్నారు. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ గతవారంలో 71.36 వద్దకు చేరింది. You may be interested

సెన్సెక్స్‌ తక్షణ అవరోధం 41,810

Monday 30th December 2019

మార్కెట్‌ ట్రాకింగ్‌ కోసం విదేశీ ఇన్వెస్టర్లు, దేశీయ ఫండ్స్‌...అధికంగా అనుసరించే నిఫ్టీ–50 సూచి ఈ ఏడాది పలు సందర్భాల్లో 11,700–12,160 పాయింట్ల మధ్య కొత్త రికార్డుల్ని నెలకొల్పినా,  రికార్డుస్థాయి దాటిన ప్రతీ సందర్భంలోనూ మరింత ముందడుగువేయలేక, పెద్ద కరెక్షన్‌కు లోనవుతూ వచ్చింది. తాజాగా డిసెంబర్‌ చివరివారంలో 12,158 గరిష్టస్థాయిని దాటిన తర్వాత 1 శాతం వరకూ నిఫ్టీ పైకి ఎగరగలిగింది. మళ్లీ యథాప్రకారం వెనువెంటనే దిద్దుబాటు బాటలో పడిపోయింది. సాంకేతికంగా

భారతీయ రైల్వే పట్టాలపై ప్రైవేటు రైళ్ల పరుగులు

Monday 30th December 2019

భారతీయ రైల్వే పట్టాలపై ప్రైవేటు రైళ్లు అతి త్వరలోనే విస్తృతంగా కనిపించనున్నాయి. ఇప్పటికే భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఢిల్లీ-లక్నో మార్గంలో తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ప్రైవేటు రైలు సర్వీసు నడుపుతోంది. మరో తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును అహ్మదాబాద్‌-ముంబై మధ్య జనవరి 16 నుంచి ఐఆర్‌సీటీసీ ప్రారంభించనుంది. ఈ రెండు సర్వీసులను ప్రయోగాత్మకంగా ఐఆర్‌సీటీసికి అప్పగించగా, ఢిల్లీ-లక్నో మధ్య సర్వీస్‌ విజయవంతం అయింది. దీంతో 150 ‍ప్రైవేటు రైలు

Most from this category