News


ఆర్‌బీఐ పాలసీ, ఆర్థికాంశాలే దిక్సూచి..!

Monday 30th September 2019
Markets_main1569814515.png-28608

  • ఆర్‌బీఐ పాలసీ, ఆర్థికాంశాలే దిక్సూచి..!
  • ఆర్‌బీఐ పరపతి విధాన నిర్ణయం శుక్రవారం వెల్లడి
  • మంగళవారం వెల్లడికానున్న సెప్టెంబర్‌ నెల వాహన అమ్మకాల డేటా
  • గాంధీ జయంతి సందర్భంగా బుధవారం మార్కెట్‌కు సెలవు

న్యూఢిల్లీ: కీలక వడ్డీ రేట్లకు సంబంధించిన ఆర్‌బీఐ ప్రకటన, దేశీ స్థూల ఆర్థిక అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. శుక్రవారం (అక్టోబర్‌ 4న) ఆర్‌బీఐ నాలుగో ద్వైమాసిక సమీక్ష జరగనుండగా.. ఈ సమావేశంలో ద్రవ్య విధాన సమీక్ష కమిటీ (ఎంపీసీ) మరోసారి కీలక వడ్డీ రేట్లలో కోత విధించేందుకు ఆస్కారం ఉందనే అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెపోరేటును 110 బేసిస్‌ పాయింట్లు తగ్గించడం ద్వారా ఈ రేటును 5.4 శాతానికి తీసుకువచ్చిన కమిటీ.. ఈసారి కనీసం మరో పావు శాతం వరకు కోత విధించే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. అనుకున్న విధంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తే ఇది మార్కెట్‌కు సానుకూలంగా ఉంటుందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అజిత్‌ మిశ్రా చెప్పారు. ఈ అంశం తరువాత మార్కెట్‌ వర్గాల దృష్టి అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వైపునకు మారుతుందని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే అన్నారు. ఫలితాల సీజన్‌లోకి ప్రవేశిస్తున్నందున ఈ అంశం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపనుందని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ వివరించారు. దిగువ స్థాయిలో వినియోగం మెరుగుపడకపోతే ఫలితాల ప్రభావం తాత్కాలికంగానే ఉండనుందని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ అన్నారు.

ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులే..
గాంధీ జయంతి సందర్భంగా బుధవారం (అక్టోబర్‌ 2న) దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైంది. గురువారం (3న) ఉదయం మార్కెట్‌ యథావిధిగా ప్రారంభంకానుంది.

ఆటో అమ్మకాల డేటా ఈవారంలోనే..
సెప్టెంబర్‌ నెల ఆటో కంపెనీల అమ్మకాల డేటా సోమవారం విడుదలకానుంది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు తరువాత నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ ఒక్కసారిగా 9.2 శాతం మేర పెరిగి ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది మొత్తంగా భారీగా పడిపోయిన ఈ రంగ షేర్లకు తాజా అమ్మకాల డేటా కీలకంగా ఉండనుందని మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషించింది. ఇక ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) మంగళవారం వెల్లడికానుండగా, సర్వీసెస్‌ పీఎంఐ శుక్రవారం వెల్లడికానుంది. 

విదేశీ నిధుల వెల్లువ...
భారత్‌ క్యాపిటల్‌ మార్కెట్లో గత రెండు నెలలుగా అమ్మకాలకు దిగుతూ వచ్చిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ).. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు వంటి సానుకూల అంశాల నేపథ్యంలో మళ్లీ కొనుగోళ్ల బాట పట్టారు. సెప్టెంబర్‌ 3–27 మధ్య కాలంలో ఈక్విటీ మార్కెట్లో రూ. 7,850 కోట్లు పెట్టుబడి పెట్టగా.. డెట్‌ మార్కెట్లో రూ.135 కోట్లను వెనక్కు తీసుకున్నారు. మొత్తంగా ఈ నెలలో నికరంగా రూ. 7,714 కోట్లను వీరు పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. You may be interested

సెన్సెక్స్‌ కీలక మద్దతు 38,380

Monday 30th September 2019

పది శాతం ర్యాలీ జరపడం ద్వారా మార్కెట్‌ కార్పొరేట్‌ పన్ను తగ్గింపు అంశాన్ని దాదాపు డిస్కౌంట్‌ చేసుకున్నట్లే. పన్ను లబ్ధి కలగకుండా పెరిగిన షేర్లు తగ్గడం, పన్ను ప్రయోజనాన్ని పూర్తిగా డిస్కౌంట్‌ చేసుకోని షేర్లు మరింత పెరగడమే ఇక మిగిలింది. ఫలితంగా ఆయా షేర్ల హెచ్చుతగ్గులకు తగినట్లు కొద్దిరోజులపాటు మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనుకావొచ్చు. అటుతర్వాత సెప్టెంబర్‌ క్వార్టర్లో ఆర్థిక పలితాలే భవిష్యత్‌ మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశించగలవు. మరోవైపు అమెరికా-చైనాల వాణిజ్య

మార్కెట్లపై అనలిస్టులు ఎంతో బుల్లిష్‌!

Monday 30th September 2019

కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ పది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మన మార్కెట్లను బేరిష్‌ దశ నుంచి బుల్లిష్‌ దిశగా పరుగులు పెట్టించింది. దీనికి అదనంగా పలు చర్యలను కూడా ప్రకటించింది. దీంతో మన మార్కెట్లు మెరుగైన స్థాయిలో ఉన్నాయని అనలిస్టులు భావిస్తున్నారు. ఆసియాలోని ఇతర మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు అధిక పెట్టుబడులను ఆకర్షించగలవని నమ్ముతున్నారు. ఇంతకుముందెన్నడూ లేనంత

Most from this category