News


వచ్చే 3-5వారాల్లో 11శాతం రాబడులిచ్చే షేర్లివే...!

Saturday 14th December 2019
Markets_main1576319675.png-30232

హిందాల్కో, ఎన్‌ఎండీసీ షేర్లు బ్రేక్‌ అవుట్‌కు సిద్ధంగా ఉన్నాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ సాంకేతిక నిపుణుడు నాగరాజ్ శెట్టి అభిప్రాయపడ్డారు. ఒక ఆంగ్లఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ రాబోయే 3-5వారాల్లో 11శాతం రాబడుల్ని ఇన్వెస్టర్లకు పంచే సత్తా ఈ రెండు షేర్లకు ఉందని తెలిపారు. 
షేరు:- ఎన్‌ఎండీసీ
రేటింగ్‌:- బై
టార్గెట్‌ ధర: రూ.127
స్టాప్‌ లాస్‌: రూ.103
అప్‌సైడ్‌:- 11శాతం 
విశ్లేషణ:- గత కొన్నివారాలుగా ఎన్‌ఎండీసీ డైలీ, వీక్లీ టైమ్‌ఫ్రైస్‌ చార్టులు అప్‌ ట్రెండ్‌ను కనబరుస్తున్నాయి. వీక్లీ టైమ్‌ఫ్రేమ్‌ ప్రకారం స్టాక్ ధర ఇప్పుడు రూ.115-117 కీలకమైన ఓవర్‌హెడ్ నిరోధ స్థాయి నుండి అప్‌ట్రెండ్‌ బ్రేక్అవుట్ అంచున ఉంది. ఈ స్థాయి చాలా నెలలుగా స్టాక్ ధరకి కొన్ని నెలల నిరోధంగా ఉంది. ప్రస్తుత షేరు ధర (రూ.114.25) కొనుగోలుకు అనుకూలంగా ఉంది. రూ.103లను స్టాప్‌లాస్‌గా, రూ.127లను టార్గెట్‌ ధరగా నిర్ణయించుకుని పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయడం అనే వ్యూహాన్ని అమలు చేస్తే వచ్చే 3-5వారాల్లో 11శాతం ఆదాయాన్ని పొందవచ్చు.

షేరు: హిందాల్కో ఇండస్ట్రీస్‌
రేటింగ్‌: బై
టార్గెట్‌ ధర: రూ.232
స్టాప్‌ లాస్‌: రూ.191
అప్‌సైడ్‌: 11శాతం
విశ్లేషణ:- ఈ షేరు గతకొన్ని నెలలుగా భారీ కన్షాలిడేషన్‌ ప్యాట్రన్‌లో కదలాడుతోంది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ. 206-207 పరిధిలో కీలమైన ఓవర్‌హెడ్‌ నిరోధాన్ని ఎదుర్కోంటున్నది. ఈ స్థాయిపై నిలబడటంలో విఫలమవుతోంది. ఇటీవల కీలక నిరోధాన్ని అధిగమించే ప్రయత్నం చేసింది. రూ.290-210 స్థాయిపైన స్థిరపడితే స్వల్పకాలంలో కొనుగోళ్లు పెరగవచ్చు. రూ.191లను స్టాప్‌లాస్‌గా, రూ.232లను టార్గెట్‌స్థాయిగా నిర్ణయించుకుని పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయడం అనే వ్యూహాన్ని అమలు చేస్తే వచ్చే 3-5వారాల్లో 11శాతం ఆదాయాన్ని పొందవచ్చు.



You may be interested

అన్ని మంచి శకునాలే..!

Monday 16th December 2019

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పంద చర్చల్లో పురోగతి బ్రిటన్ ఈయూ నుంచి బయటకు వచ్చేందుకు మార్గం సుగమం  అంతర్జాతీయ అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయంటున్న నిపుణులు 12,200 - 12,250 స్థాయిలో నిఫ్టీకి ప్రధాన నిరోధం: ఎపిక్‌ రీసెర్చ్‌ బుధవారం జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం, ఆర్‌బీఐ మినిట్స్‌ వెల్లడి న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరంగా మారిన రెండు కీలక అంశాలకు సంబంధించి గతవారంలో ఒకే సారి సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి

ఎస్సార్‌ స్టీల్‌ రికవరీ డబ్బులు వచ్చేస్తున్నాయ్‌!

Saturday 14th December 2019

ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు సంబంధించి రూ. 42వేల కోట్ల మొత్తాన్ని చెల్లించే ప్రక్రియను ఆర్సెలార్‌ మిట్టల్‌ ఆరంభించినట్లు తెలిసింది. నవంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సార్‌స్టీల్‌ కొనుగోలుపై ఉన్న సందేహాలు తొలగిపోయాయి. దీంతో మిట్టల్‌ కంపెనీ చెల్లింపుల ప్రక్రియ షురూ చేసిందని, ఒకటి రెండు రోజుల్లో మొత్తం సొమ్ము చెల్లించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌ 16 నాటికి ఎస్‌బీఐకి ఈ నిధుల బదిలీ జరగవచ్చని తెలిపాయి. ఎస్సార్‌ స్టీ్‌ల్‌ రుణదాతల

Most from this category