News


ఈ విడత ర్యాలీలో లీడర్లు మారారు!

Wednesday 20th March 2019
Markets_main1553105693.png-24720

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 38,989 (2018 ఆగస్ట్‌లో నమోదైన)కు 603 పాయింట్ల (1.6 శాతం) దూరంలోనే ఉంది. మరి ఈ విడత మార్కెట్‌ పరుగుకు ప్రధాన గుర్రాలు ఏవనుకుంటున్నారు... ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఇన్ఫోసిస్‌గా విశ్లేషకులు పేర్కొంటున్నారు. సూచీలు ఆల్‌టైమ్‌ గరిష్టాలను టచ్‌ చేస్తాయని, అదే సమయంలో ఇండెక్స్‌లోని చాలా స్టాక్స్‌ గత గరిష్ట స్థాయిలను చేరుకోకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇండెక్స్‌లోని సగం స్టాక్స్‌ ప్రస్తుత స్థాయిల నుంచి కనీసం 18 శాతం పెరిగితేనే గత రికార్డు గరిష్టాలను హిట్‌ చేయగలవు. ఇండెక్స్‌లోని సుమారు 10 స్టాక్స్‌ అయితే 50 శాతం నుంచి 200 శాతం పెరిగితే తప్ప పాత గత గరిష్ట స్థాయిలను అధిగమించలేవు. 

 

‘‘సెన్సెక్స్‌ ప్యాక్‌ పనితీరు కేంద్రీకృతంగా ఉంది. కొన్ని స్టాక్స్‌ చివరి నిమిషంలో జోరందుకున్నాయి. కానీ, ఈ స్థాయిల్లో లేక ఈ స్థాయి కంటే కొంత గరిష్టాలకు కొన్ని స్టాక్స్‌ చేరుకోగలవు. అంతేకానీ, ఇండెక్స్‌లో మెజారిటీ స్టాక్స్‌ రికార్డు గరిష్ట స్థాయిలకు చేరతాయని ఆశించొద్దు’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసానీ పేర్కొన్నారు. సెన్సెక్స్‌లో ఐదు స్టాక్స్‌ 2019లో ఇప్పటికే జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. 25 స్టాక్స్‌ తమ మొత్తం మార్కెట్‌ విలువలో ఏడు శాతాన్ని కోల్పోయాయి. దీంతో కేవలం కొన్ని స్టాక్సే ఇటీవలి వారాల్లో ఇండెక్స్‌ను నడిపించినట్టుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, కోటక్‌ ‍బ్యాంకు, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మరో 10 శాతం పెరిగితే గానీ నూతన గరిష్టాలను చేరుకోలేవు.

 

ఫిబ్రవరి 19న సెన్సెక్స్‌ 35,300లోపు కనిష్ట స్థాయిల నుంచి... కొన్ని అండ్‌పెర్‌ఫార్మింగ్‌ స్టాక్స్‌ పెరగడాన్ని గమనించొచ్చు. ఎన్‌టీపీసీ ఇదే కాలంలో 18 శాతం ర్యాలీ చేసింది. కానీ, ఇదే స్టాక్‌ 2008 జనవరిలో నమోదు చేసిన గరిష్ట ధరకు చేరుకోవాలంటే ఇంకా 84 శాతం ర్యాలీ చేయాల్సి ఉంటుంది. యస్‌ బ్యాంకు ఫిబ్రవరి కనిష్ట స్థాయిల నుంచి 15 శాతం పెరిగింది. కానీ, 2018 ఆగస్ట్‌ గరిష్ట స్థాయి నుంచి ఇంకా 33 శాతం దిగువనే ఉంది. ఇక 2018 ఆగస్ట్‌ 20న నమోదు చేసిన ఆల్‌టైమ్‌ గరిష్టం రూ.404 చేరుకునేందుకు యస్‌ బ్యాంకు మరో 65 శాతం ర్యాలీ చేయాల్సి ఉంది. వేదాంత, కోల్‌ ఇండియా, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ స్టాక్స్‌ 10-15 శాతం మధ్య పెరిగాయి. కానీ, ఇవి కూడా వాటి జీవితకాల గరిష్ట స్థాయిలను చేరుకోవాలంటే ప్రస్తుత ధరల నుంచి మరో 80-180 శాతం మధ్య పెరగాల్సి ఉంటుంది.  

 

సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌ను గతేడాది ఆగస్ట్‌ నాటి ధరలతో గమనిస్తే... ఆటోమొబైల్‌ రంగంలో టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్‌ 31 శాతం నుంచి 15 శాతం మధ్య గతేడాది ఆగస్ట్‌ నుంచి తగ్గిపోయాయి. వాటి గరిష్ట స్థాయిల నుంచి చూస్తే ఇవి 30-70 శాతం తక్కువలో ట్రేడ్‌ అవుతున్నాయి. మెటల్స్‌,  మైనింగ్‌ స్టాక్స్‌ వేదాంత, కోల్‌ఇండియా 23 శాతం, 14 శాతం చొప్పున క్షీణించాయి. ఐటీసీ, హెచ్‌యూఎల్‌ కూడా రికవరీలో విఫలమయ్యాయి. ఇక సెన్సెక్స్‌లో దారుణ పనితీరు చూపించింది యస్‌ బ్యాంకు. ఫండమెంటల్‌గా బ్యాంకింగ్‌ విభాగం ఆర్షణీయంగా ఉందని ఎన్‌సీఎల్‌టీ పరిష్కారాలతో ప్రైవేటు బ్యాంకులు ఎక్కువగా లాభపడతాయని ఐడీబీఐ క్యాపిటల్‌కు చెందిన ఏకే ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు.You may be interested

నేడు మార్కెట్‌కు సెలవు

Thursday 21st March 2019

హోళి సందర్భంగా నేడు(గురువారం) స్టాక్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ట్రేడింగ్‌ జరగదు. బాండ్స్‌, కరెన్సీ మార్కెట్లు కూడా పనిచేయవు. మార్కెట్‌ తిరిగి శుక్రవారం ప్రారంభం కానుంది. బుధవారం సెన్సెక్స్‌ 23 పాయింట్లు లాభపడి 38,386 వద్ద ముగిసింది. నిఫ్టీ 11 పాయింట్ల తగ్గుదలతో 11,521 వద్ద స్థిరపడింది. డాలర్‌ మారకంలో రూపాయి 13 పైసలు బలపడి 68.83 వద్ద ముగియగా, పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 7.36 వద్ద

ఆటో స్టాక్స్‌ కొనుగోళ్లకు ఇది అనువైన సమయమా?

Wednesday 20th March 2019

ఆటో స్టాక్స్‌ ఎర్నింగ్స్‌ పట్ల ఆశావహ అంచనాలు లేకపోయినప్పటికీ సమీప కాలంలో ఆకర్షణీయంగా మారొచ్చన‍్న అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కరెక్షన్‌ నేపథ్యంలో స్టాక్స్‌ చౌకగా మారాయని, దీర్ఘకాలం కోసం వీటిని ఎంచుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఏడాది బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇప్పటి వరకు 5.7 శాతం మేర ర్యాలీ చేయగా, ఇదే కాలంలో ఆటో ఇండెక్స్‌ 5.52 శాతం పడిపోయింది. కారణం అమ్మకాలు బలహీనంగా ఉండడం వల్లే.

Most from this category