News


ఐసీఐసీఐ టార్గెట్‌ రూ.775: మోర్గాన్‌ స్టాన్లీ

Wednesday 27th November 2019
Markets_main1574837280.png-29896

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ ఐసీఐసీఐ బ్యాంక్‌  షేరు టార్గెట్‌ ధరను పెంచింది. ఈ మేరకు బ్రోకరేజ్‌ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో షేరుకు తాము కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అలాగే షేరు టార్గెట్‌ ధరను రూ.665ల నుంచి రూ.775లకు పెంచుతున్నట్లు తెలిపింది. గత మూడేళ్లలో ఈ షేరు ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేసింది. ఈ బ్యాంకులో ఒక సూపర్‌ నార్మల్‌ ప్రాఫిట్‌ సైకిల్‌ తయారుకానుంది. ఫలితంగా వచ్చే రెండేళ్లలో షేరు ధర గణనీయంగా పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేసింది.  డిపాజిట్ వృద్ధి దశాబ్దపు గరిష్ట స్థాయిలో ఉంది. బ్యాంక్‌ రుణవ్యాప్తి, నికర వడ్డీ మార్జిన్లు బలంగా ఉన్నాయి. ఫలితంగా వచ్చే మూడేళ్లో సీఏజీఆర్‌ 22శాతం వుండేందుకు తోడ్పడుతాయని బ్రోకరేజ్‌ సంస్థ అంటుంది. ఇటీవల​ఎస్సార్‌ స్టీల్‌ కేసులో సుప్రీం కోర్టు తీర్పు బ్యాంకుకు కలిసొచ్చే అంశం. ఎస్సార్‌ స్టీల్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌కు అతిపెద్ద ఎక్స్‌పోజర్‌గా ఉంది. ఇంకా తన నివేదికలో...

1. పెద్ద రుణదాతలు (భారీ బ్యాంకులు) పెద్ద లాభాల్ని ఆర్జించే సైకిల్‌ ప్రారంభంలో ఉన్నారు.
2. స్థూల గణాంకాలు కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఈ బ్యాంకు ప్రణాళిక బద్దమైన పనితీరు ఆందోళలను దూరం చేయడంతో పాటు బ్యాంకుకు లాభాలను తెచ్చిపెడతాయి
3.    ఈపీఎస్‌, ఆర్‌ఓఈ మెరుగుపడే దిశగా ఈ బ్యాంకు యాజమాన్యం ప్రణాళిక రూపొంచింది. 
4. మెరుగైన ఎర్నింగ్‌ అప్‌సైడ్‌, ఆకర్షణీయమైన వాల్యూవేషన్లతో కొనుగోలుదారుల ఎంపికలో సుముచిత స్థానం కలిగి ఉంటుంది. 

మోర్గాన్‌ స్టాన్లీ రేటింగ్‌ పెంపుతో ఐసీఐసీఐ బ్యాంకు వరుసగా మూడో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభపడింది. ఒక దశలో 1శాతం లాభంతో రూ.515.85 వద్ద స్థిరపడింది. అయితే మధ్యాహ్నం గం.11:45ని.లకు లాభాల స్వీకరణ కారణంగా షేరు కిత్రం ముగింపు(రూ.510.70)తో పోలిస్తే 1శాతం నష్టపోయి రూ.505 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నటి ట్రేడింగ్‌లో షేరు 4శాతానికి పైగా పెరిగి రూ.517.50 వద్ద కొత్త ఆల్‌టైం హైని తాకిన సంగతి తెలిసిందే. You may be interested

టాప్‌ 500 షేర్లలో మనవి పదమూడే!

Wednesday 27th November 2019

అంతర్జాతీయంగా మంచి ప్రదర్శన చూపిన టాప్‌ 500 షేర్ల జాబితాలో ఇండియాకు చెందిన 13 షేర్లకు మాత్రమే చోటు దక్కింది. దేశీయ సూచీల్లో బ్లూచిప్స్‌ ప్రదర్శన కారణంగా ఆల్‌టైమ్‌ హై సాధ్యమైనా, గ్లోబల్‌ షేర్లతో పోలిస్తే మనవాటి ప్రదర్శన అంతంతమాత్రమేనని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్త లిస్టెడ్‌ కంపెనీల్లో టాప్‌ 500 కంపెనీలను బ్లూమ్‌బర్గ్‌ సంస్థ ప్రకటించింది. ఈ లిస్టులోని 13 భారతీయ కంపెనీల షేర్లలో 8 షేర్లు కనీసం టాప్‌ 200లోకి

హెచ్‌డీఎఫ్‌సీ టార్గెట్‌ ధరను పెంచిన మోర్గాన్‌ స్టాన్లీ

Wednesday 27th November 2019

అం‍తర్జాతీయ బ్రోకరేజి సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌, ఫైనాన్స్‌ కార్పోరేషన్‌(హెచ్‌డీఎఫ్‌సీ) షేరుపై ఓవర్‌వెయిట్‌ను కొనసాగించడంతో పాటు, షేరు టార్గెట్‌ ధరను రూ. 2,600 స్థాయి నుంచి రూ. 2,900 స్థాయికి పెంచింది. ఫలితంగా ఈ కంపెనీ షేరు విలువ బుధవారం సెషన్లో 1 శాతానికి పైగా లాభపడి ట్రేడవుతోంది. ‘ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు) సెక్టార్‌లో వ్యవస్తీకృతంగా బలంగా ఉండడంతో, కంపెనీ ఆర్‌ఓఈ(రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ), ఈపీఎస్‌(షేరుపై లాభం)

Most from this category