తగ్గిన జీడీపీ...పెట్టుబడులకు ఇది మంచి అవకాశం
By Sakshi

-విశ్లేషకులు
ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికానికి సంబంధించి దేశ జీడీపి 5 శాతంగా నమోదైంది. కాగా ఇది ఆరేళ్ల కనిష్టం కావడం గమనార్హం. మార్కెట్ సెంటిమెంట్ దేశ జీడీపీతో ముడిపడి ఉండడం వలన మార్కెట్ మరింత పతనమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. అయినప్పటికి ఈ పరిస్థితిని ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగించుకోవాలని సలహాయిస్తున్నారు. ‘జూన్ త్రైమాసికపు జీడీజీ వృద్ధి రేటు మా అంచనా కంటే తక్కువగా ఉంది. దీని ఫలితంగా పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి అంచనాలను 6.1 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. వృద్ధి రేటు పరంగా, జూన్ త్రైమాసిక వృద్ధి రేటు అద్వాన్నంగా ఉంది. వచ్చే ఇతర త్రైమాసికాలలో వృద్ధి రేటు మెరుగుదలను చూడవచ్చు’ అని నార్నోలియా చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ శైలేంద్ర కుమార్ అన్నారు. జూన్ త్రైమాసికంలో అతి తక్కువ జీడీపీ వృద్ది రేటు నమోదవుతుందని మార్కెట్ అంచనా వేసిందని, అందువలన ఈ సంఖ్య ఆశ్యర్యాన్ని కలిగించలేదని ఆయన వివరించారు. ‘తగ్గిన జీడీపీ వృద్ధి రేటు మార్కెట్లను మరింత పతనం వైపు లాగుతుంది. ఆర్థిక సంవత్సరం 2019 చివరి త్రైమాసికంలో 5.8 శాతంగా నమోదైన జీడీపీ వృద్ధిరేటు జూన్ త్రైమాసికంలో 5 శాతంగా నమోదైంది. ఇది అంచనాల కంటే తక్కువగా ఉంది’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు.
You may be interested
మంగళవారం వార్తల్లోని షేర్లు
Tuesday 3rd September 2019వస్తు తయారీ రంగం పనితీరు ఆగస్టులో 15నెలల కనిష్టానికి పడిపోయింది. భారత జీడీపీ క్యూ1లో వృద్ధిరేటు వరుసగా ఆరో త్రైమాసికంలో పతనమైంది. జీఎస్టీ వసూళ్లు ఆగస్ట్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యల్పంగా రూ.98, 202 కోట్లు వసూళ్లయ్యాయి. ఆగస్టులో వాహన విక్రయాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. రియలన్స్ కమ్యూనికేషన్స్:- డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్‌కు వ్యతిరేకంగా ధాఖలు చేసిన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంది. బయోకాన్:- యూఎస్ఎఫ్డీఏ ఇన్సులిన్ గ్లార్జిన్ ఔషధానికి సీఆర్ఎల్(కంప్లీట రెస్పాన్స్ లెటర్)ను కేటాయించింది. ఎస్పీఎంల్ ఇన్ఫ్రా:- ప్రపంచ
సెన్సెక్స్‌ను బీట్ చేస్తున్న షేర్లివే
Monday 2nd September 2019మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూలతను ఎదుర్కొని పుంజుకునేందుకు అనేక దేశియ స్టాకులు ప్రయత్నిస్తున్నాయి. కానీ కొన్ని స్టాకులు మాత్రమే అద్భుత ప్రదర్శనను చేస్తున్నాయి. బీఎస్ఈ 500 స్టాకులలో 26 స్టాకులు మాత్రమే గత మూడేళ్ల నుంచి సెన్సెక్స్ కంటే మంచి ప్రదర్శనను చేశాయి. పీ అండ్ జీ, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, వినాటి ఆర్గానిక్స్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, బాటా ఇండియా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హనీవెల్ ఆటోమేషన్ వంటి స్టాక్స్