STOCKS

News


ఈ షేర్లు కొనొచ్చు....బ్రోకరేజ్‌ల సిఫార్సులు

Tuesday 6th August 2019
Markets_main1565071670.png-27564

భారతీయ స్టాక్ మార్కెట్లు ఆగస్టు 5 ట్రేడింగ్‌లో భారీగా పడిపోయాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు వాటి కీలకమైన మద్దతు స్థాయిల కంటే దిగువకు పడిపోయాయి. ఎస్ అండ్ పి బీఎస్ఈ సెన్సెక్స్ 37,000 దిగువకు పడిపోగా, నిఫ్టీ 50 10,900 స్థాయిను కోల్పోయింది. జులై 5 నుంచి అగష్టు2 వరకు స్టాక్‌ మార్కెట్‌(బిఎస్‌ఈ)లో 11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల సగటు మార్కెట్ క్యాపిటలైజేషన్ జూలై 5 న రూ .151.35 లక్షల కోట్లుగా నమోదవ్వగా, 2019 ఆగస్టు 2 నాటికి 139.98 లక్షల కోట్లకు పడిపోవడం గమనర్హం. దేశీయంగా,  విదేశీ పెట్టుబడిదారులపై పన్ను సర్‌చార్జిల పెంపు, మందగించిన కార్పొరేట్ ఆదాయాలు, రుతుపవనాలు సాధరణం కన్నా తక్కువగా నమోదవుతుండడం, ఆర్థిక వృద్ధిలో మందగమనం, కార్పొరేట్ పాలన సమస్యలు స్టాక్‌మార్కెట్లను ప్రభావితం చేశాయి. వీటితో పాటు అంతర్జాతీయంగా, యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం, మేజర్‌ కరెన్సీలు బలహీనపడటం వంటివి ఇండియా మార్కెట్లపై విపరీతంగా ప్రభావం చూపాయి. 
  దేశియ మార్కెట్లు తాజాగా 5 నెలల కనిష్టానికి సమీపంలో ప్రస్తుతం ట్రేడవుతున్నాయి. ఈ సమయంలో ఇన్వెస్టర్లు వారి పోర్టుపోలియోలను తిరిగి పరిశీలించుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అనేక బ్లూచిప్ షేర్లు డబుల్ డిజిట్లలో దిద్దుబాటుకు గురయ్యాయి. ఇవి మంచి విలువ దగ్గర లభిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత స్థాయిలలో ఇన్వెస్ట్‌ చేసే వాళ్లు ఏడాది నుంచి ఐదేళ్ల కాలానికి గాను పెట్టుబడులు పెట్టుకోవాలని వివరించారు. ‘ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకోడానికి ఇది అనువైన సమయం. ఈ సమీక్ష వలన ఏ స్టాకులను పోర్టుపోలియోలో ఉంచాలి, వేటిని వదిలించుకోవాలనే అంశాలు తెలుస్తాయి. పోర్ట్‌ఫోలియో కోసం కొత్త స్టాక్‌లను గుర్తించడం ముఖ్యం’ అని ఎమ్‌కే వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ జోసెఫ్ థామస్ అన్నారు.

కొన్ని బ్రోకరేజి సంస్థలు ఇన్వెస్టర్ల పోర్టుపోలియో కోసం కొన్ని సిఫార్సులు చేశాయి అవి:
ఎమ్‌కే వెల్త్ మేనేజ్‌మెంట్ సిఫార్సులు:
 సిప్లా, దివీస్‌ ల్యాబ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐసీఐసీఐ ప్రూడెన్సియల్‌, ఎల్‌ అండ్‌ టీ, మారికో, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, యునైటెడ్‌ బెవరేజస్‌ 

కోటక్‌ సెక్యూరిటీస్‌: ఇంజినీర్స్‌ ఇండియా, ఈక్విటస్‌ హొల్డర్స్‌, ఐటిసీ, ఓఎన్‌జీసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, వెల్సపన్‌ కార్ప్‌.

ఫిలిప్‌ క్యాపిటల్‌: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హిందుస్తాన్‌ యూనిలీవర్‌, మారికో, ఏసియన్‌ పెయింట్స్‌, జుబిలియంట్‌ పుడ్‌ వర్క్స్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, సొమెనీ సిరమిక్స్‌, ఎల్‌ అండ్‌ టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, జేకే సిమెంట్‌, కంటైనర్‌ కార్ప్‌, ఎన్‌సీసీ, పీఎన్‌సీ ఇన్ఫ్రా, దివీస్‌ ల్యాబోరెటరీస్‌, బయోకాన్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌ 
 You may be interested

ఇండియన్‌ బ్యాంకు ఆకర్షణీయ ఫలితాలు

Tuesday 6th August 2019

చెన్నై: ప్రభుత్వరంగ ఇండియన్‌బ్యాంకు జూన్‌ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. బ్యాంకు లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.209 కోట్లతో పోలిస్తే 75 శాతం పెరిగి రూ.366 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం కూడా రూ.5,132 కోట్ల నుంచి రూ.5,832 కోట్లకు వృద్ధి చెందింది. జూన్‌ త్రైమాసికంలో తాజాగా రూ.1,035 కోట్లు మొండి బకాయిలుగా మారాయి. అన్ని విభాగాల్లోనూ మెరుగైన వృద్ధి నమోదు చేసినట్టు ఇండియన్‌ బ్యాంకు

కియా కొత్తకారు ‘సెల్టోస్‌ విడుదల ఈ నెల 8న

Tuesday 6th August 2019

ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానించిన కియా కంపెనీ ప్రతినిధులు అనంతపురం ప్లాంట్‌లో కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం సాక్షి, అమరావతి: దక్షిణకొరియా కార్ల దిగ్గజం కియా కంపెనీ తన కొత్తకారు ‘సెల్టోస్‌’ను ఈ నెల 8న మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. కియా కంపెనీ ఎండీ కూక్‌ హున్‌ షిమ్‌, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ థామస్‌ కిమ్‌ సోమవారం ముఖ్యమంత్రిని ఆయన

Most from this category