News


ఇదొక ‘విలువల ఉచ్చు’..యాంకర్‌ బ్యాంకులకు దూరం!

Wednesday 4th September 2019
Markets_main1567590423.png-28189

-సురేష్‌ గణపతి, మాక్వేరీ
   ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ‍ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రతిపాదనలో వున్న యాంకర్‌బ్యాంకులకు ఇన్వెస్టర్లు దూరంగా ఉండాలని మాక్వేరీ క్యాపిటల్‌ సెక్యురిటీస్‌ విశ్లేషకుడు సురేష్‌ గణపతి ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో సూచించారు. ఈ బ్యాంకులకు విలువను పెంచే సామర్ధ్యం లేదని, ఇవి ఇన్వెస్టర్లకు ఎటువంటి అవకాశాలను అందించలేవని వివరించారు. ‘చౌకగా ఉన్నాయని ఎవరైనా ఈ బ్యాంకుల షేర్లను కొనుగోలు చేస్తే వాళ్లు ఉచ్చులో చిక్కుకున్నట్టే’ అని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. అంతేకాకుండా ట్రేడ్‌వార్‌ ఆందోళనల వలన వచ్చే 12 నెలలో ఈ విలీన ప్రక్రియ తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డారు. 
  కాగా అగష్టు 30 వ తేదిన, 21 ప్రభుత్వ రంగ బ్యాంకులను 12 బ్యాంకులుగా మార్చనున్నామని, ప్రస్తుతం ఉన్న మొత్తం ప్రభుత్వ బ్యాంకులలో 10 బ్యాంకులను అతిపెద్ద 4 బ్యాంకులుగా చేయనున్నామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పథకం ప్రకారం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఆధినంలోకి ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యూనైటెడ్‌ బ్యాంక్‌లు రానుండగా, కెనరా బ్యాంక్‌ ఆధినంలోకి సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆధినంలోకి ఆంధ్రా బ్యాంక్‌, కార్పోరేషన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ ఆధినంలోకి అలహాబాద్‌ బ్యాంకులు రానున్నాయి. 

బ్యాంక్‌ల విలీనం... సంఖ్యను తగ్గించడానికే..
గతంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా విలీనం వలన షేర్‌హోల్డర్ల సంపద ఆవిరయ్యిందని సురేష్‌ గణపతి అన్నారు. ఈ విలీనం తర్వాత ఏడాది కాలంలోనే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు 30 శాతం పతనమయ్యిందని, ఇటువంటి పరిస్థితినే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ), కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ల షేర్ల విషయంలో చూడనున్నామని వివరించారు. ‘అధిక సంఖ్యలో ఉన్న బ్యాంకులకు టాప్‌ మేనేజ్‌మెంట్‌ను ఏర్పాటు చేయడం సవాళ్లుతో కూడుకున్నది. ప్రభుత్వం ఈ బ్యాంకుల సంఖ్యను తగ్గించడం సరియైన నిర్ణయమే. 20 బ్యాంకులను నిర్వహించడం కంటే ఏడెనిమిది బ్యాంకులను నిర్వహించడం చాలా తేలిక. కానీ పది బలహీన బ్యాంకులను కలిపి నాలుగు అతిపెద్ద బలహీన బ్యాంకులను ఏర్పాటు చేయడం కేవలం బ్యాంకుల సంఖ్యను తగ్గించడానికి తప్ప వేరే ఆలోచన కనిపించడం లేదు. ఈ బ్యాంకుల సామర్ధ్యం పెరగడానికి పన్నుదారుల నగదును ప్రభుత్వం వృధా చేయకూడదు’ అని ఆయన సూచించారు.

ఈ బ్యాంకుల పరిస్థితి ఒకేలా ఉంది..
  ఈ బ్యాంకుల నేపథ్యాలు ఒకేలా ఉండడంతో ఈ విలీనానికి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి థీమ్ ఉన్నట్లు కనిపించడం లేదని, ఈ బ్యాంకుల సాంకేతిక పరిజ్ఞానం ఒకే విధంగా ఉందని మాక్వేరీ విశ్లేషకుడు సురేష్‌ గణపతి అన్నారు. ‘ప్రాంతీయంగా బ్యాంకులను బలోపేతం చేస్తున్నారని అనుకోవడం లేదు. ఒక వేళ అదే నిజమయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్, సింధ్ బ్యాంక్ వంటి రెండు బలహీనమైన బ్యాంకులను స్వతంత్రంగా ఉంచవలసిన అవసరం లేదు. ఈ రెండు బ్యాంకులు స్వతంత్రంగా ఉండడానికి ఎటువంటి కారణం కనిపించడంలేదు. కాబట్టి, బ్యాంకుల సంఖ్యను తగ్గించి, వాటిని మరింత నిర్వహించదగినవిగా మార్చడం మినహా ఇందులో ఏ థీమ్ లేదు’ అని తెలిపారు.


రుణ వృద్ధి ఆగిపోతుంది...
 ‘ మూలధనాన్ని ప్రభుత్వం అందించిన తర్వాత ఈ బ్యాంకుల సగటు సీఈటీ 1(కామన్‌ ఈక్విటీ టైర్‌ 1) 10.3-10.4 శాతం వద్ద ఉంటుంది. ఇది బ్యాంకులకు మంచిదే. కానీ విలీనం వలన బ్యాంకుల మేనేజ్‌మెంట్‌ విలీన పక్రియలో బిజీగా ఉంటారు. ఫలితంగా ఈ బ్యాంకుల రుణ వృద్ధి మందగిస్తుంది’ అని​ఆయన అన్నారు. ‘బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా విషయానికొస్తే..విలీన సమయంలో ఈ బ్యాంక్‌లో రుణాలకు సంబంధించి నిర్ణయాలను తీసుకోవడం పూర్తిగా ఆగిపోయింది. ఫలితంగా ఏం జరిగిందంటే రుణాలను ఇచ్చే సామర్ధ్యం ఉన్నప్పటికి రుణాలను ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి వ్యవస్థలో రుణ సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది’ అని వివరించారు. ‘పుస్తకం విలువకు 0.7 రెట్లు వద్ద బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు చౌకగా ఉండేది. విలీనం జరిగిన తర్వాత ఇది 0.4 రెట్లు లేదా 0.3 రెట్లకు పడిపోయింది. ఇది ఒక ‘వాల్యుషన్‌ మోసం’. ప్రస్తుతం విలీనం అవ్వబోతున్న బ్యాంక్‌ షేర్లు చౌకగా కనిపిస్తున్నప్పటికి వీటిని కొనుగోలు చేయకుండా ఉండడమే చాలా మంచిది. వచ్చే ఏడాది కాలం పాటు ఈ బ్యాంకులు తీవ్ర అనిశ్చితిలో ఉంటాయి. వచ్చే ఏడాది కాలం పాటు అనిశ్చితిలో ఉండే స్టాకులకి  మైనార్టీ ఇన్వెస్టర్లు దూరంగా ఉండడమే మంచిది’ అని తెలిపారు.You may be interested

లాభాల ముగింపు

Wednesday 4th September 2019

జాతీయ, అంతర్జాతీయంగా అందిన సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్‌ బుధవారం లాభంతో ముగిసింది. ముఖ్యంగా మిడ్‌సెషన్‌ అనంతరం జరిగిన కొనుగోళ్లతో సెనెక్స్‌ 162 పాయింట్లు పెరిగి 36,724 వద్ద, నిఫ్టీ 46.75 పాయింట్ల లాభంతో 10,844.65 వద్ద స్థిరపడింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 9నెలల కనిష్టం నుంచి రికవరి, నిన్న సూచీల భారీ పతనం నేపథ్యంలో వ్యాల్యూ షేర్లకు కనిష్టస్థాయి వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడటంతో అవి పెరిగాయి. హాంకాంగ్‌లో కొద్దిరోజులుగా

ఆగని టాటామోటర్స్‌ షేర్ల పతనం

Wednesday 4th September 2019

టాటా మోటర్స్‌ షేర్ల పతనం ఆగడం లేదు. బీఎస్‌ఈలో బుధవారం మరో 6శాతం క్షీణించింది. నిన్న అటోషేర్ల పతనంలో భాగంగా 3శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ నెలలో ఈ వాహన విక్రయాలు 58శాతం క్షీణించడంతో పాటు, అంతర్జాతీయంగా జేఎల్‌ఆర్‌ అమ్మకాలు తగ్గముఖం పట్టడం లాంటి కారణాలతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఒకదశలో 6శాతం క్షీణించి రూ.106.00

Most from this category