News


ఇండియాలో పెట్టుబడులకు ఇదే మంచి సమయం

Saturday 31st August 2019
Markets_main1567248784.png-28132

-మార్క్‌ మొబియస్‌
దీర్ఘకాలంలో ఇండియా వృద్ధి చెందుతుందని, కానీ పన్నుల పరంగా ఇక్కడ చాలా గందరళగోళం ఉందని మొబియస్ క్యాపిటల్ పార్టనర్స్ ఎల్ఎల్‌పీ వ్యవస్థాపకుడు మార్క్ మొబియస్ అన్నారు. ఎఫ్‌పీఐలపై విధించిన అదనపు సర్‌చార్జీని ప్రభుత్వం ఉపసంహరిం‍చుకోవడం చాలా మంచి చర్యని అన్నారు. దీర్ఘకాలానికి గాను భారతదేశంలో  పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయమని, తన పెట్టుబడుల జాబితాలో ఇండియా అగ్రస్థానంలో ఉంటుందని తెలిపారు. ‘భారతదేశ ఆర్థిక మందగమనానికి అంతర్గత, బాహ్య కారకాలు కారణంగా ఉన్నాయి. ఇండియా ఎదుర్కొంటున్న సమస్యలలో 50 శాతం సమస్యలు దేశియంగా ఉన్నవే. ఇక్కడ తక్కువ పన్నుల కోసం ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగం‍లో విదేశి ఇన్వెస్టర్లను ఆహ్వానించడం కీలకమైన చర్య’ అని ఆయన వివరించారు. 
   ఇండియా, నీటి వనరుల సంరక్షణపై దృష్టి సారించడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. కాగా వచ్చే కొన్నేళ్లలో ఇండియా త్రాగునీటి సామర్థ్యం తగ్గిపోతుందని నివేదికలు వెలువడడంతో ప్రభుత్వం నీటి సంరక్షణపై దృష్ఠిసారించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆగస్టు 30 న ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్రభుత్వరంగ బ్యాంక్‌ల విలీనం దీర్ఘకాలంలో ఫలితాన్ని ఇస్తుందని మొబియస్ అభిప్రాయపడ్డారు. ‘పీఎస్‌యూ(పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్స్‌)లను  ప్రైవేటీకరించడంపై ప్రభుత్వం దృష్ఠి పెడుతుందని ఆశిస్తున్నా. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్‌ ఇండియా మంచి పథకం’ అని మొబియస్‌ అన్నారు.
ఈఎస్‌జీ ఇన్వెస్టింగ్‌పై ఆదరణ..
 భారతదేశానికి వెలుపల..యూరప్, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలలో ఈఎస్‌జీ ఇన్వెస్టింగ్‌  ప్రసిద్ధి చెందింది. ఇండియాలో కూడా 2018 నుంచి ఈఎస్‌జీ ఇన్వెస్టింగ్‌పై ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే అనేక ఫండ్ హౌస్‌లు పర్యావరణ, సామాజిక, పాలన-కేంద్రీకృత(ఈఎస్‌జీ) ఫండ్‌లను ప్రారంభించాయి. కాగా ఒక సంస్థ లేదా వ్యాపారంలో పెట్టుబడి స్థిరత్వం, నైతిక ప్రభావాన్ని కొలిచే మూడు కేంద్ర కారకాలను ఈఎస్‌జీ సూచిస్తుంది. ఈ ప్రమాణాలు కంపెనీల భవిష్యత్తు ఆర్థిక పనితీరును గుర్తించడంలో సహాయపడతాయని విశ్లేషకులు తెలిపారు. 
   ‘ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇండెక్స్‌) ఇప్పుడు ఈఎస్‌జీ(ఎన్విరాన్‌మెంట్‌, సోషియల్‌, గవర్నెన్స్‌) ఫండ్లను ట్రాక్ చేసి, ర్యాంకింగ్‌నిస్తుంది. ఈఎస్‌జీ ఫండ్లలో ఇన్వెస్ట్‌చేయాడానికి అనేక అవకాశాలున్నాయి. కానీ అండర్‌ పెర్ఫార్మ్‌ చేస్తాయని ఈఎస్‌జీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారు’ అని మొబియస్‌ అన్నారు. కాగా ఈఎస్‌జీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టే ముందు అధికంగా పరిశోధన చేయవలసి ఉంటుందని, ఈఎస్‌జీ ఇన్వెస్ట్‌ంగ్‌లో సాధారణ ప్రమాణాలు ఉండకూడదని తెలిపారు. ‘ప్రస్తుతం చాలా వరకు భారతీయ కంపెనీలు ఈఎస్‌జీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం, అనేక భారతీయ కంపెనీలు ఈఎస్‌జీ గురించి తెలుసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను’  అని అన్నారు.

 



You may be interested

ఆశించిన స్థాయిలో ఎఫ్‌ఎంసీజీ వృద్ధి ఉండకపోవచ్చు!

Saturday 31st August 2019

గౌరవ్ గార్గ్ రానున్న రోజుల్లో ఫాస్ట్ మూవింగ్ కన్జుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) ఆశించిన స్థాయిలో వృద్ధిని సాధించకవపోవచ్చని ప్రముఖ అనలిస్టు గౌరవ్ గార్గ్ అంచనా వేస్తున్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఎఫ్‌ఎంజీసీ నాలుగో అతిపెద్ద రంగం. వచ్చే ఏడాది నాటికి ఈ రంగం 27.86 శాతం సీఏజీఆర్‌ వృద్ధి రేటుతో 103.7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఐబీఈఎఫ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ రంగం 2019 లో 11-12 శాతం వృద్ధి చెందుతుందని

ఈ బ్యాంకుల షేర్లలో ఇన్వెస్టింగా?.. జాగ్రత్త!

Saturday 31st August 2019

కేంద్ర ఆర్థిక మంత్రి నాలుగు ప్రధాన బ్యాంకుల విలీనాలను గురించి శుక్రవారం ప్రకటించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునిటెడ్‌ బ్యాంక్‌లను విలీనం చేసి, ఈ బ్యాంక్‌ను రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా మార్చనుండగా, కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌లను విలీనం చేసి నాలుగవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు యూనియన్‌ బ్యాంక్‌, ఆంధ్రాబ్యాంక్‌, కార్పోరేషన్‌ బ్యాంక్‌లను విలీనం చేసి

Most from this category