News


భారీ పతనం తర్వాత గమనం ఎటువైపు..?

Tuesday 24th March 2020
Markets_main1584989846.png-32641

ఇండెక్స్‌లు 13 శాతం మేర సోమవారం పతనమయ్యాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పెద్ద ఎత్తున ఆర్థిక మాంద్యం తప్పదన్న భయాలే భారీ నష్టాలకు దారితీశాయి. సెబీ ఎఫ్‌అండ్‌వో విభాగంలో అస్థిరతలను నియంత్రించేందుకు గత శుక్రవారం ప్రకటించిన చర్యలు కూడా ఫలితమేమీ ఇవ్వలేదు. తాజా పతనాన్ని అడ్డుకునేందుకు అవి చాలవని తేలిపోయిందని అనలిస్టులు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కేసులు మన దేశంలో తగ్గడం ఒక్కటే మన మార్కెట్ల పతనాన్ని అడ్డుకోగలదని అభిప్రాయపడుతున్నారు. 

 

‘‘కోవిడ్‌-19 విస్తరణ తగ్గనంత వరకు మార్కెట్లలో వోలటాలిటీ కొనసాగుతుంది. వ్యాల్యూషన్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. స్వల్పకాలానికి మార్కెట్ల గమనం అస్పష్టంగానే ఉంది. పతనం కొనసాగొచ్చు. ఓపిక పట్టాల్సిన సమయం ఇది. భయాందోళనకు లోనై ఈక్విటీలకు దూరంగా వెళ్లిపోయే సమయం కాదు. బోటమ్‌ ఎక్కడని ఊహించడం కష్టం. సంక్షోభం సద్దుమణిగితే తిరిగి రాబడులు ఖాయమని చరిత్ర గతంలో నిరూపించింది’’ అని కోటక్‌ మహీంద్రా ఏఎంసీ సీఐవో హర్ష ఉపాధ్యాయ అన్నారు. మరోవైపు అమెరికాలో వైరస్‌ వ్యాప్తి వేగాన్ని అందుకోవడంతో మరిన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌లోకి వెళుతున్నాయి. దీంతో ఫెడ్‌ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గానీ మార్కెట్ల పతనాన్ని నిలువరించలేకున్నాయి. సోమవారం డౌజోన్స్‌ నష్టాలతోనే ఆరంభమైంది. మూడు శాతం వరకు క్షీణించింది. యూరోప్‌ మార్కెట్లు కూడా నష్టాల్లోనే కొనసాగాయి. యూరోస్టాక్స్‌ 3 శాతం, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌ మార్కెట్లు కూడా 4 శాతం వరకు పతనమయ్యాయి.

 

ప్రస్తుత తరుణంలో మార్కెట్లలో ఇది కనిష్టం అని ఊహించడం అసాధ్యమని, తక్షణ మద్దతు 7,500, 7,350 వద్ద రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఇటీవలి కనిష్ట స్థాయి 7,832 స్థాయిని నిఫ్టీ కోల్పోయింది. 2011 కనిష్ట స్థాయి నుంచి జరిగిన ర్యాలీలో 61.8 శాతం రీట్రేస్‌మెంట్‌ స్థాయి 7,550కు మార్కెట్‌ సమీపించింది. మార్కెట్లు వెనక్కి వస్తే 7,850, 8000 స్థాయిల్లో తాజా షార్ట్స్‌కు అవకాశం’’ అని షేర్‌ఖాన్‌కు చెందిన తర్నపార్కి తెలిపారు. ప్రస్తుత మార్కెట్లలో సూచీలు ఏ మాత్రం వెనక్కి వచ్చినా అవి నిలబడలేవని, కొన్ని రోజుల పాటు వేచి చూసి, కన్సాలిడేషన్‌ అయ్యే వరకు ఆగడం మంచిదని ట్రేడర్లకు చార్ట్‌వ్యూకు చెందిన మజర్‌ మహమ్మద్‌ సూచించారు. అన్ని కీలక మద్దతు స్థాయిలను మార్కెట్‌ కోల్పోయిందని, ఈ దశలో మార్కెట్లు తొలిదశలో 7,341 వరకు పడిపోవచ్చని తెలిపారు.You may be interested

ఈ తప్పులకు దూరంగా ఉండండి..

Tuesday 24th March 2020

మార్చి నెలలో సూచీలు, స్టాక్స్‌ పేకమేడల్లా పతనమయ్యాయి. కరోనా వైరస్‌ ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చేస్తుందన్న భయాలతో విదేశీ ఫండ్‌ మేనేజర్లు నాన్‌స్టాప్‌గా అమ్మేస్తున్నారు. 2020లో అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం తప్పదని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ అంచనా వ్యక్తం చేసింది. ఇన్వెస్టర్లు ఇప్పటికే 24 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. సూచీలు ఇప్పటికే 35 శాతానికి పైగా క్షీణించాయి. ఈ పరిస్థితుల్లో షేర్లు పాతాళానికి పడిపోతుంటే భయంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు ఈ దశలో

4000 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ ముగింపు

Monday 23rd March 2020

పతనంలో సరికొత్త రికార్డ్‌ 1135 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ బ్యాంక్‌ నిఫ్టీ 16 శాతం పతనం నాలుగేళ్ల కనిష్టానికి నిఫ్టీ ప్రపంచ దేశాలను పీడిస్తున్న కరోనా వైరస్‌ దేశీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తుండటంతో ఇన్వెస్టర్లు మళ్లీ భయాందోళలకు లోనయ్యారు. ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే మూకుమ్మడిగా అమ్మకాలకు ఎగబడ్డారు. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీ స్టాక్‌ మార్కెట్లు 10 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో గత రెండు వారాలలో రెండోసారి ట్రేడింగ్ నిలిచిపోయింది. తదుపరి తిరిగి మార్కెట్లు

Most from this category