News


స్మాల్‌ క్యాప్స్‌ ర్యాలీ..!

Sunday 3rd November 2019
Markets_main1572805162.png-29310

గత వారం మార్కెట్లకు మంచి సానుకూలం. సెన్సెక్స్‌ 40,392.22 పాయింట్ల ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. దీపావళి నుంచి మార్కెట్లలో లాభాలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కెట్లపై బుల్స్‌ పట్టు బలంగా ఉంది. కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు అంచనాలకు కొంచెం ఎగువనే ఉండడం, కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో రానున్న త్రైమాసికాల్లో మరింత మెరుగైన ఫలితాలకు అవకాశం ఉండడం, ఆర్థిక రంగ రికవరీతో కంపెనీలు మరింత ప్రయోజనం పొందగలవన్న అంచనాలు తాజా బుల్‌ర్యాలీని నడిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ తీవ్ర నష్టాలపాలైన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలోని స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. దాంతో ఎంపిక చేసిన స్టాక్స్‌లో ర్యాలీ కొనసాగుతోంది. 

 

బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగాలు గత వారంలో 2-3 శాతం మేర ర్యాలీ చేశాయి. బీఎస్‌ఈ 500 సూచీ 2.4 శాతం పెరిగింది. ప్రతీ ఐదు షేర్లు లాభపడగా, ఒక షేరు నష్టాల పాలవడం కూడా సానుకూలతను తెలియజేస్తోంది. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లో 700 స్టాక్స్‌కు గాను 594 గ్రీన్‌లోనే క్లోజయ్యాయి. వీటిల్లో 148 స్టాక్స్‌ డబుల్‌ డిజిట్‌ స్థాయిలో రాబడులను ఇచ్చాయి. వీటిల్లో 25 స్టాక్స్‌ 26-48 శాతం మేర పెరిగాయి. వీటిల్లో ఉత్తమ్‌ గాల్వా స్టీల్స్‌, ఐటీడీ సిమెంటేషన్‌, బీఎఫ్‌ యుటిలిటీలు, మంగళం డ్రగ్స్‌, డిష్‌టీవీ, శ్రేయి ఇన్‌ఫ్రా, యునైటెడ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఆర్‌పీజీ లైఫ్‌ సైన్సెస్‌, హిందుస్తాన్‌ మీడియా వెంచర్స్‌, ఎల్‌జీ బాలకృష్ణన్‌, 8కే మైల్స్‌ ఉన్నాయి. ఇక సెంట్రల్‌ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, జిందాల్‌ స్టీల్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హడ్కో, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌, రిలయన్స్‌ నిప్పన్‌, ఎన్‌బీసీసీ, బీహెచ్‌ఈఎల్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, ఐడీబీఐ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు స్టాక్స్‌ 10-37 శాతం మధ్య పెరిగాయి. 

 

‘‘ఈ వారం ఎటువంటి ప్రధాన ఈవెంట్లు లేనందున, మార్కెట్లు తదుపరి కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలపై దృస్టి సారించొచ్చు. విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు), మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి పెట్టుబడుల రాక మెరుగ్గా ఉండడం, దేశీయ మార్కెట్‌పై సానుకూల సెంటిమెంట్‌తో ఉన్నాం. తదుపరి సంస్కరణలు, ఆర్థిక వృద్ధి పునరుద్ధరణపై మార్కెట్లు దృష్టి సారించొచ్చు’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. అయితే, అధిక స్థాయిల్లో లాభాల స్వీకరణతో మార్కెట్లు రానున్న రోజుల్లో ఆటుపోట్లను ఎదుర్కోవచ్చని, లార్జ్‌క్యాప్‌ నుంచి పెట్టుబడులు ఎంపిక చేసిన మిడ్‌క్యాప్స్‌లోకి వెళ్లొచ్చని శామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌మోదీ అంచనా వేశారు. You may be interested

2019లో తగ్గిన ఎన్‌ఎఫ్‌వోలు

Sunday 3rd November 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు/ఏఎంసీలు) ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి 125 మ్యూచువల్‌ ఫండ్‌ నూతన పథకాల ఆవిష్కరణ కోసం (ఎన్‌ఎఫ్‌వో) సెబీ వద్ద దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో కొన్నింటికి సెబీ అనుమతివ్వడంతో అవి నిధుల సమీకరణ కూడా చేపట్టాయి. కానీ, క్రితం ఏడాది 2018లో 211 నూతన పథకాల కోసం దరఖాస్తులు రాగా, వాటితో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మార్కెట్లో

మిశ్రమంగా ముగిసిన ఏడీఆర్‌లు

Saturday 2nd November 2019

అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే భారత కంపెనీల ఏడీఆర్‌లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. అక్టోబర్‌లో అమెరికా ఉపాధి కల్పన మార్కెట్‌ అంచనాలకు మించి నమోదు కావడం, వాణిజ్య చర్చలు సఫలం దిశగా సాగుతున్నాయని వైట్‌హౌస్‌ అధికారుల ప్రకటించిన నేపథ్యంలో నిన్న అక్కడి సూచీలు రికార్డు స్థాయిలో ర్యాలీ చేశాయి. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ తీవ్ర ఒడిదుడుకులకు లోనై 97.23 స్థాయి వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ

Most from this category