News


ట్యాక్స్‌ కట్‌తో భారీగా లాభపడే కంపెనీలివే!

Saturday 21st September 2019
Markets_main1569050018.png-28469

కేంద్ర ప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 22 శాతానికి (సెస్‌, సర్‌చార్జీలు కలిపి 25.17) తగ్గించి మార్కెట్‌ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ చర్యకు ముందు, రూ. 400 కోట్ల వార్షిక టర్నోవర్‌ కలిగిన కంపెనీలు 30 శాతం( సెస్‌, సర్‌చార్జీలతో కలిపి 34.944 శాతం) కార్పోరేట్‌ ట్యాక్స్‌ను, టర్నొవర్‌ రూ. 400 కోట్లు లోపు ఉన్న దేశీయ కంపెనీలు 25 శాతం(సెస్‌, సర్‌చార్జీలతో కలిపి 29.12 శాతం) కార్పోరేట్‌ ట్యాక్స్‌ను చెల్లించేవి.
లాభపడనున్న టాప్‌ కంపెనీలు...   
‘నిఫ్టీలో కేవలం 20 కంపెనీలు మాత్రమే 30 శాతానికిపైగా ‍ప్రభావిత పన్నును చెల్లిస్తున్నాయి.  ఆర్థిక సంవత్సరం 2019లో ఈ కంపెనీలు నిఫ్టీలో 43 శాతం నికర లాభానికి కారణమయ్యాయి’ అని కోటక్‌ సెక్యురిటీస్‌ ఒక నివేదికలో పేర్కొంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిండాల్కో ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, గెయిల్ ఇండియా, జెఎస్‌డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు 30 శాతం కంటే అధికంగా పన్నును చెల్లిస్తున్నాయి. ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో ఈ కంపెనీల ఈపీఎస్‌(షేరుపై ఆదాయం) రెండంకెల వృద్ధి చెందే అవకాశం ఉంది. 
నిఫ్టీ 11,500-11,600 స్థాయిని అందుకుంటుం‍ది...
   గత 12-18 నెలలుగా ఆదాయాలు మందగమనంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ చర్యలు సానుకూలమైనవని విశ్లేషకులు తెలిపారు. అధికంగా ట్యాక్స్‌ను చెల్లించే కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారని, వినియోగ రంగం, ఫైనాన్సియల్‌, టెక్నాలజీ సర్వీసెస్‌ రంగాలు ట్యాక్స్‌ తగ్గింపు వలన లాభపడే అవకాశం ఉందని ఎన్విసన్‌ క్యాపిటల్‌, ఎండీ, సీఈఓ నిలేష్‌ షా అన్నారు. 
‘ప్రభావిత ట్యాక్స్‌ను 26 శాతం కంటే తగ్గించడంతో 33 శాతం ట్యాక్స్‌ను చెల్లిస్తున్న కంపెనీల ఆదాయాలు 12 శాతం పెరగనున్నాయి. అదేవిధంగా ఆర్థిక సంవత్సరం 2020కి గాను నిఫ్టీ ఆదాయం 5-6 శాతం వృద్ధి చెందుతుంది’ అని కోటక్ సెక్యూరిటీస్, ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ రుస్మిక్ ఓజా అన్నారు. అంతేకాకుండా ఈ చర్య వలన మార్కెట్‌ సెంటిమెంట్‌ మారిందని, నిఫ్టీ 11,500-11,600 స్థాయిని సునాయాసంగా అధిగమించగలదని అభిప్రాయపడ్డారు. కాగా 30 శాతం ఉన్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 22 శాతానికి తగ్గించడంతో ప్రభుత్వం, ఏడాదికి రూ. 1.45 లక్షల కోట్ల ఆదాయాన్ని కొల్పోనుంది. 


 
 You may be interested

రేట్‌ కట్‌తో భారత్‌ పెట్టుబడులకు గమ్యస్థానం- ఫిచ్‌ రేటింగ్స్‌

Saturday 21st September 2019

కార్పోరేట్‌ తగ్గింపు చర్య ప్రత్యక్షంగానే ప్రభుత్వ ద్రవ్యలోటు లక్ష్యంపై ప్రభావం చూపుతుందని, కానీ పన్నుల సేకరణ పెరిగే అవకాశం ఉండడంతో ద్రవ్యలోటు ఒత్తిళ్లను అధిగమించవచ్చని ఫిచ్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్, స్నేహదీప్ బోహ్రా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్థికవ్యవస్థపై పాజిటివ్‌ సైన్‌.. కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడం, చాలా సానుకూలమైన చర్య. దీని వలన అధిక మొత్తంలో నగదు కార్పోరేట్‌లకు అందుబాటులో ఉంటుంది. ఫలితంగా కార్పోరేట్‌

లాభంతో ముగిసిన ఎస్ఎజీఎక్స్‌ నిఫ్టీ

Saturday 21st September 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం రాత్రి లాభంతో ముగిసింది.  ఇది 11,327.00 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11295.50 పాయింట్లతో పోలిస్తే 31పాయింట్ల లాభంతో ఉంది. నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ లాభంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మందగమన భయాలతో ఇటీవల భారీ పతనాన్ని చవిచూస్తున్న మార్కెట్లో జోష్‌ పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ప్రకటించిన

Most from this category