News


ఝున్‌ఝున్‌వాలా, రాజివ్‌ ఖన్నా, ఆశీష్‌ కచోలియా భారీగా విక్రయించిన షేర్లివే!

Monday 14th October 2019
Markets_main1571045563.png-28872

ఆర్థిక మందగమనంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు సెప్టెంబర్‌ క్యార్టర్‌లో నష్టపోయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ భారీ ర్యాలీని మినహాయిస్తే దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు జులై, అగష్టు నెలలో నష్టాలలోనే ముగిశాయి. ఫలితంగా రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా, ఆశిష్‌ కచోలియా, రాజీవ్‌ ఖన్నా వంటి సీనియర్‌ ఇన్వెస్టర్లు వివిధ కంపెనీలలోని తమ వాటాలను విక్రయించారు.  
రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా విక్రయించిన షేర్లు..
   సీనియర్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా  సెప్టెంబర్‌ త్రైమాసికంలో నాలుగు కంపెనీలలో తన వాటాలను తగ్గించుకున్నారు. ఆయన భార్య రేఖతో కలిపి  టైటాన్‌ కంపెనీలో 7.05 శాతం(జూన్‌ క్వార్టర్‌ నాటికి) వాటాను ఆయన కలిగివుండగా, సెప్టెంబర్‌ త్రైమాసికం చివరినాటికి ఈ వాటా 6.51 శాతానికి తగ్గింది. అలాగే లుపిన్‌లో జూన్‌ క్వార్టర్‌లో 1.71 శాతం ఉన్న ఆయన వాటా సెప్టెంబర్‌ త్రైమాసికం చివరినాటికి 1.56 శాతానికి తగ్గింది. కాగా ఈ కంపెనీలో ఝున్‌ఝున్‌వాలా వాలా వాటా మార్చి త్రైమాసికంలో 1.93 శాతం ఉండడం గమనార్హం. ఇదే విధంగా  అయాన్‌ ఎక్సెంజ్‌లోని తన వాటాను 5.46 శాతం నుంచి 5.29 శాతానికి తగ్గించుకున్నారు. వీటితో పాటు ఫస్ట్‌సోర్స్‌ సొల్యుషన్స్‌లో ఆయన వాటా 15 బేసిస్‌ పాయింట్లు తగ్గి, 3.25 శాతం నుంచి 3.10 శాతానికి పడిపోయింది. కాగా బిల్‌కేర్‌, క్రిసిల్‌, ఫోర్టీస్‌ హేల్త్‌కేర్‌, ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీలలో ఝున్‌ఝున్‌వాలాకున్న వాటాలలో ఎటువంటి మార్పులేదు. సెప్టెంబర్‌ త్రైమాసికం చివరినాటికి ఝున్‌ఝున్‌వాలాకు ఇతర కంపెనీలలో ఉన్న వాటాల వివరాలు ఇంకా వెలువడలేదు. మొత్తంగా సెప్టెంబర్‌ త్రైమాసికంలో జులై నెలలో సెన్సెక్స్‌ 4.9 శాతం పతనమవ్వగా, అగష్టులో 0.8 శాతం పడిపోయింది. కానీ ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో సెప్టెంబర్‌ నెలలో సెన్సెక్స్‌ 3.57 శాతం లాభపడడం గమనార్హం.  ‘మార్కెట్‌లు ఏవిధంగా ప్రతిస్పందిస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. మార్కెట్‌ కదలికలను అంచనావేసినా.. పరిస్థితులు, మార్కెట్‌​రిస్క్‌లు వంటి అంశాలు దేవుడికి మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే ఆయన మాత్రమే రేపటిని చూడగలడు కాబట్టి’ అని రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా అన్నారు.
రాజీవ్‌ ఖన్నా  విక్రయించిన షేర్లు..
    డాలీ ఖన్నా మల్టీబాగర్‌ పోర్టుఫోలియోను ఆమె భర్త రాజీవ్‌ ఖన్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీనియర్‌ ఇన్వెస్టర్‌ కూడా సెప్టెంబర్‌ త్రైమాసికంలో వివిధ కంపెనీలలో తమ వాటాను తగ్గించుకున్నారు. డాలీ ఖన్నా పోర్టుపోలియోలోని రెయిన్‌ ఇండస్ట్రీస్‌, ఎన్‌ఓసీఎల్‌ ఆమె వాటాలు తగ్గాయి. అంతేకాకుండా ముతుట్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌లో ఆమె వాటా 1 శాతం కంటే దిగువకు పడిపోవడం గమనార్హం. రెయిన్‌ ఇండస్ట్రీస్‌లో ఆమె వాటా 10 బేసిస్‌ పాయింట్లను తగ్గి, సెప్టెంబర్‌ త్రైమాసికం చివరినాటికి 1.81 శాతానికి పడిపోయిం‍ది. కాగా ఈ వాటా జూన్‌ త్రైమాసికంలో 1.91 శాతంగా ఉండడం​గమనార్హం. ఎన్‌ఓసీఐఎల్‌లో జూన్‌ క్వార్టర్‌ చివరినాటికి  2 శాతం ఉన్న ఆమె వాటా, ప్రస్తుతం 1.93 శాతానికి తగ్గింది.  ప్రస్తుతం వ్యవస్థలోని ఆర్థిక మందగమనం తగ్గేంతవరకు మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి వేచి చూసే ధోరణినే అనుసరిస్తానని రాజీవ్‌ఖన్నా అన్నారు. ‘మొదట వినియోగం పెరగని, ఆ తర్వాత నేను ఇన్వెస్ట్‌ చేయడం మొదలు పెడతా. ప్రస్తుతం వ్యవస్థలో ఆర్థిక మందగమనం ఉందనే విషయం వాస్తవం. స్థూల ఆర్థిక సంఖ్యలు పెరుగుతాయని వేచి చూస్తున్నా. ప్రస్తుతం నన్ను ఏది ఆకర్షించడం లేదు. ఇది ఇప్పటికి కూడా వేచి చూసే మార్కెటే’ అని ఆయన అన్నారు. 
ఆశీష్‌ కచోలియా విక్రయించిన షేర్లు..
   వీరిరువురితో పాటు మరోక సీనియర్‌ ఇన్వెస్టర్‌ ఆశిష్‌ కచోలియా కూడా బిర్లాసాఫ్ట్‌, జీటీపీఎల్‌ హత్‌వే కంపెనీలలో తన వాటాను 1 శాతం తగ్గించుకున్నారు. వీ2 రియల్టీలోని ఆయన వాటా 2.56 శాతం నుంచి 2.48 తగ్గింది. కానీ అపోలో పైప్స్‌లో 2.01 వాటాను ఆయన కొనుగోలు చేశారు. అంతేకాకుండా డీసీఎం పుడ్స్‌ లో ఆయన వాటా 2.23 శాతం నుంచి 2.85 శాతానికి పెరగడం గమనార్హం.



You may be interested

ఏడాది గరిష్ఠానికి భారతీ ఎయిర్‌టెల్‌

Monday 14th October 2019

టెలికాం రంగంలో ప్రధాన కంపెనీగా ఉన్న రిలయన్స్‌ జియో, ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ (ఐయూసీ) కాల్స్‌పై 6 పై./ని. చార్జ్‌ చేయడం ప్రారంభించింది. ఈ నిర్ణయం ఇదే రంగంలో ఉన్న పెద్ద కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌కు లాభం చేకూర్చే అవకాశం ఉందన్న అంచనాలు ఎయిర్టెల్ షేరుపై పాజిటివ్ ప్రభావం చూపాయి. భవిష్యత్ లో ఈ నిర్ణయం వలన ధరలను పెంచడంతో ఎయిర్‌టెల్‌కు ఒత్తిడి తగ్గవచ్చని, అందువల్ల కంపెనీ లాభాలు భారీగా

ఐఆర్‌సీటీసీ బంపర్‌ లిస్టింగ్‌: ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి..?

Monday 14th October 2019

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) బంపర్‌ లిస్టింగ్‌ సాధించింది. ఇష్యూ ధర రూ. 320కాగా లిస్టింగ్‌ 101.25 శాతం ప్రీమియంతో రూ. 644వద్ద జరిగింది.  ఇంట్రాడేలో మరింత దూసుకెళ్లి (132 శాతం) రూ.743.80 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. దీంతోఐఆర్‌సీటీసీ సంస్థ మార్కెట్ విలువ రూ. 5 వేల కోట్ల నుంచి రూ. 10,972 కోట్లకు చేరుకుంది. ఐపీఓ చివరి నాటికి ఏకంగా

Most from this category