News


వీటిల్లో గత వైభవం సాధ్యమేనా...?

Thursday 21st November 2019
Markets_main1574276397.png-29738

పెట్టుబడులపై అధిక రాబడుల కోసం ఈక్విటీల వైపు అడుగు వేసే ఇన్వెస్టర్ల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. పది పదిహేనేళ్ల క్రితంతో పోలిస్తే నేడు స్టాక్‌ ట్రేడింగ్‌ ఎంతో సులభంగా మారింది. డేటా దిగి రావడం, టెక్నాలజీ ఆధునికత రూపును సంతరించుకోవడం వంటి ఎన్నో కారణాలున్నాయి. అయితే, భారీ రాబడుల ఆకాంక్షలతో ఈక్విటీ మార్కెట్ల వైపు చూసే వారు ముందుగా పెట్టుబడులను ఎటువంటి కంపెనీల్లో పెట్టాలన్నది పరిపూర్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతే అడుగు వేయాలి. లేదంటే వారి కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరులా మారుతుంది. ఎందుకంటే బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌ పరిధిలో 58 స్టాక్స్‌ వాటి ఏడాది గరిష్ట ధరలను అందుకోవాలంటే కనీసం 100 శాతం నుంచి 3000 శాతం వరకు పెరగాలి. ఇవి ఏ స్థాయిలో పతనమయ్యాయో తెలుస్తూనే ఉంది. 

 

ఈ స్టాక్స్‌లో నుంచి ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు తప్పుకున్నారు. కానీ, ఏ రోజుకైనా తిరిగి నూతన శిఖరాలకు ర్యాలీ చేయకపోతాయా అన్న ఆశలతో రిటైల్‌ ఇన్వెస్టర్లు వీటిల్లో కొనసాగడం, వాటాలు కొనడం చేస్తున్నట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. వీటిల్లో ఆర్‌కామ్‌ ప్రస్తుత ధర రూ.0.56. ఏడాది గరిష్ట ధర రూ.18.60ను చేరుకోవాలంటే 3,052 శాతం ర్యాలీ చేయాల్సి ఉంటుంది. ఇక 2008 జనవరిలో ఆర్‌కామ్‌ గరిష్ట ధర రూ.844కు చేరుకోవాలంటే మాత్రం 1,42,950 శాతం పెరగాలి. ఇక్కడ పెరగడం కంటే 2008లో గరిష్ట ధరలో కొనుగోలు చేసి అలాగే కొనసాగి ఉంటే మొత్తం పెట్టుబడి కరిగిపోయి ఉండేది. సెప్టెంబర్‌ ఆఖరునాటికి వాటాదారుల గణాంకాలను పరిశీలిస్తే ఆర్‌కామ్‌లో రూ.2లక్షల వరకు వాటాలు కలిగిన వారి శాతం 33.80. హెచ్‌ఎన్‌ఐలకు ఈ కంపెనీలో 24.22 శాతం వాటాలున్నాయి. ఇక అడాగ్‌ గ్రూపు (అనిల్‌అంబానీ) స్టాక్స్‌ రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ పవర్‌ 780 శాతం నుంచి 1100 శాతం మధ్య వాటి ఏడాది గరిష్టాలను అధిగమించేందుకు పెరగాల్సి ఉంటుంది. 

 

ఇక డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు తన 52 వారాల గరిష్ట ధర రూ.252.90ను చేరుకోవాలంటే మాత్రం ప్రస్తుత ధర రూ.21 నుంచి 987 శాతం ర్యాలీ చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీలో చిన్న ఇన్వెస్టర్లకు 31.69 శాతం వాటాలున్నాయి. హెచ్‌ఎన్‌ఐలకు 4.62 శాతం వాటాలు ఉండడం గమనార్హం. కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ అయితే ఏడాది గరిష్ట ధరను చేరుకునేందుకు 600 శాతం పెరగాలి. పీసీ జ్యుయలర్‌, జైన్‌ ఇరిగేషన్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంకు, ఎవర్‌గ్రీన్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌ఈజీ షేర్లు 320 నుంచి 420 శాతం వరకు ఏడాది గరిష్ట ధరను చేరుకునేందుకు ర్యాలీ చేయాల్సి ఉంటుంది. ‘‘అధిక రుణ భారం, ప్రమోటర్ల విషయంలో ఆందోళనలు ఉన్నచోట ఎంతో నష్టం జరగడం చూశాం. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో రిస్క్‌ ఇప్పటికీ అధిగంగానే ఉంది. ఈ తరహా కంపెనీలకు దూరంగా ఉండడం మంచిది’’ అని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ సీఐవో మహేష్‌పాటిల్‌ సూచించారు. You may be interested

టెల్కోలకు ఊరట..

Thursday 21st November 2019

ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం కంపెనీలకు ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించింది. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దీంతో భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో సంస్థలకు సుమారు రూ. 42,000 కోట్ల మేర ఊరట లభించనుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన

టెలికం షేర్లు ఇక రేసు గుర్రాలేనా?

Thursday 21st November 2019

వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ గత మూడు రోజుల్లో మంచి ర్యాలీ చేశాయి. ఒకవైపు ఏజీఆర్‌ (సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం)పై సుప్రీంకోర్టు తీర్పుతో ఈ రెండు కంపెనీకు కేంద్రానికి సుమారు రూ.90వేల కోట్ల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ, ఈ తరహా ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో వ్యాపార నిర్వహణ కష్టమంటూ వచ్చే నెల నుంచి మొబైల్‌ టారిఫ్‌ ధరలను పెంచనున్నట్టు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ప్రకటించడంతో వాటి

Most from this category