News


బడ్జెట్‌ బాగుంటే.. ఈ షేర్లు రయ్‌ రయ్‌!

Friday 24th January 2020
Markets_main1579862457.png-31176

రాబోయే బడ్జెట్లో ఐటీ స్లాబుల తగ్గింపు, ఎల్‌టీసీజీ కోత, డీడీటీ నుంచి ఉపశమనం, ప్రభుత్వ మూలధనవ్యయాల పెరుగుదల, రియల్టీ రంగానికి మరిన్ని ఉద్దీపనల్లాంటి తాయిలాలుంటాయని మార్కెట్‌ వర్గాలు ఆశిస్తున్నాయి. పలు స్టాకులు ఈ ఆశల అంచనాలతో ప్రీ బడ్జెట్‌ ర్యాలీ జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌ వర్గాలు ఆశించిన వరాలన్నీ బడ్జెట్లో ఉంటే కొన్ని షేర్లు బడ్జెట్‌ అనంతరం రయ్‌మని దూసుకుపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
- ఐటీ స్లాబుల తగ్గింపు, 80సీ పరిమితుల మార్పు వంటి మార్పులు బడ్జెట్లో ఉంటే వినిమయ స్టాకులు బాగా లాభపడాయని యాంటిక్‌ బ్రోకింగ్‌ అభిప్రాయపడింది. వినిమయరంగంలోని ఉపవిభాగాలైన ఆటో(ఎంఅండ్‌ఎం, టీవీఎస్‌ మోటర్స్‌, బజాజ్‌ ఆటో), కన్జూమర్‌ డ్యూరబుల్స్‌(క్రాంప్టన్‌, వోల్టాస్‌), పెయింట్స్‌(ఏసియన్‌), గృహసంబంధిత వస్తూత్పత్తి(హెచ్‌యూఎల్‌, కోల్‌గేట్‌, డాబర్‌), రిటైల్(ఎవెన్యూసూపర్‌ మార్కెట్‌) రంగాల షేర్లు లాభపడతాయని అంచనా.
- ఇన్‌ఫ్రాకు చెందిన ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌కు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌ షేర్లపై ఎమ్‌కే గ్లోబల్‌ పాజిటివ్‌గా ఉంది.
- క్యాపిటల్‌ వ్యయంలో పెరుగుదల ఉంటే ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్‌, అదానీ పోర్ట్స్‌, సీమెన్స్‌, కాన్‌కర్‌, బెల్‌, హనీవెల్‌, గుజరాత్‌గ్యాస్‌, సోలార్‌, కేఈసీ, టిమ్‌కెన్‌, ఏపీఎల్‌ అపోలో, బిర్లాకార్‌‍్ప, బీఈఎంఎల్‌, కేఎన్‌ఆర్‌ షేర్లకు లాభమని నిపుణుల అభిప్రాయం.
- రియల్టీ రంగానికి ఉద్దీపనలుంటే అల్ట్రాటెక్‌, కజారియా సిమెంట్స్‌, క్రాంప్టన్‌, వోల్టాస్‌, ఏసియన్‌ పెయింట్స్‌ షేర్లలో ర్యాలీ ఉండొచ్చు.
- డీడీటీలో తగ్గింపు నగదు నిల్వలు దండిగా ఉన్న ఇన్ఫీ, టీసీఎస్‌, ఓఎన్‌జీసీ, ఐఓసీ, బజాజ్‌ఆటో, హీరోమోటో, హెచ్‌యూఎల్‌, కోల్‌గేట్‌, నెస్లె, హిందుస్థాన్‌ జింక్‌, ఎన్‌ఎండీసీ, నాల్కో షేర్లకు పాజిటివ్‌గా ఉంటుంది.
- లేబర్‌ సంస్కరణలు వస్తే స్టాఫింగ్‌ కంపెనీలైన టీమ్‌లీజ్‌ లాంటివాటికి, ఆటో స్క్రాపేజ్‌పాలసీతో ఆటో మొబైల్‌స్టాకులకు జోరు పెరుగుతుంది.
- మహానగర్‌గ్యాస్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐసీఐసీఐ ప్రు, అల్ట్రాటెక్‌, పీఎన్‌సీ ఇన్‌ఫ్రా, సుదర్శన్‌ కెమికల్స్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఎఅండ్‌ఎం, బాటా ఇండియా, జేఎస్‌డబ్ల్యు స్టీల్‌  షేర్లను ప్రీబడ్జెట్‌కు షేర్‌ఖాన్‌ సిఫార్సు చేసింది.
ఒకవేళ బడ్జెట్లో మార్కెట్‌ వర్గాలు ఆశించిన తాయిలాలు, రాయతీలు లేకుంటే మార్కెట్లలో దాదాపు 5- 10 శాతం పతనం వచ్చే అవకాశాలున్నాయని బ్రోకింగ్‌ సంస్థలు అభిప్రాయపడ్డాయి. You may be interested

మెటల్‌ షేర్ల జోరు

Friday 24th January 2020

శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మెటల్‌ షేర్లు జోరుగా పెరిగాయి. దాంతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1 శాతం పెరిగి 2,796.20 వద్ద ముగిసింది. జిందాల్‌ స్టీల్‌ 5 శాతం పెరిగి 189.00వద్ద, హింద్‌ కాపర్‌ 4.11 శాతం పెరిగి 46.90 వద్ద, కోల్‌ఇండియా 2 శాతం పెరిగి 194.40 వద్ద, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 1.73 శాతం పెరిగి 271.25 వద్ద, నేషనల్‌ అల్యూమినియం 1.30 శాతం పెరిగి 46.65

రెండో రోజూ మార్కెట్లు అప్‌

Friday 24th January 2020

సెన్సెక్స్‌ 227 పాయింట్లు ప్లస్‌ 68 పాయింట్లు లాభపడిన నిఫ్టీ బ్రెగ్జిట్‌ డీల్‌తో యూరప్‌ మార్కెట్లకు జోష్‌ కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ఉన్నప్పటికీ వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు బలపడ్డాయి. తొలుత బలహీనంగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే జోరందుకున్నాయి. ఆపై ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో రోజంతా హుషారుగా కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 227 పాయింట్లు ఎగిసి 41,613 వద్ద నిలవగా.. నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి

Most from this category