News


మార్కెట్‌ మహాపతనంలో 20శాతం ర్యాలీ చేసిన షేర్లు ఇవే..!

Monday 23rd March 2020
Markets_main1584959113.png-32639

స్టాక్‌ మార్కెట్‌ సోమవారం మరోసారి మహా పతనాన్ని చవిచూసింది. ఈ తరుణంలో కొన్ని షేర్లు 20శాతం వరకు లాభాల్ని ఇన్వెస్టర్లకు అందించాయి. నేటి ట్రేడింగ్‌లో మొత్తంగా 1450 షేర్లు నష్టాలను చవిచూడగా,  ఫార్మాస్యూటికల్స్‌, ఇండస్ట్రీయల్‌ రంగాలకు చెందిన  156 షేర్లు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి. 

కరోనా వైరస్ వ్యాధిని నివారణకు ఔషధాన్ని కనుక్కోనేందుకు కేంద్రం పలు ప్రైవేట్ ల్యాబ్‌లకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. దీంతో నేడు అత్యధిక లాభాలను గడించిన షేర్లలో హెల్త్‌కేర్‌ రంగాలకు చెందిన ప్రైవేట్‌ ల్యాబ్స్‌ షేర్లు ఎక్కువగా ఉన్నాయి.  నేడు ఇప్కా ల్యాబ్స్‌ షేరు అత్యధిక 8శాతం లాభపడి రూ.1479లకు చేరుకుంది. ఈ కంపెనీ మలేరియా వ్యాధికి విరుగుడుగా వినియోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధాన్ని తయారు చేస్తుంది. కరోనా వైరస్‌ వ్యాధిపై ఈ ఔషధం ప్రభావాన్ని చూపగలదని పరిశోధనల్లో తేలింది.  కేడిల్లా హెల్త్‌కేర్‌ నేడు 1శాతం ర్యాలీ చేసి రూ.289 స్థాయిని అందుకుంది. థైరోకేర్‌ షేరు 7శాతం, లాల్‌ పాథ్‌ల్యాబ్స్‌ షేరు 3శాతం, మెట్రోపాలీస్‌ హెల్త్‌కేర్‌ షేరు అరశాతం, శక్తి పంప్‌ 4.5శాతం,  సంఘ్వీ మూవర్స్‌ 10శాతం లాభపడ్డాయి.

స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌కు చెందిన ధనుకా ఆగ్రికల్చర్‌ షేరు అత్యధికంగా 20శాతం లాభపడింది. గతవారంలో... మూలధనాన్ని పెంచుకునే ప్రక్రియలో భాగంగా షేర్‌ హోల్డర్లకు ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా 9శాతం వాటాను విక్రయించేందుకు సెబీ అనుమతించడంతో జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌ 3శాతం పెరిగింది.  హాక్విన్స్‌ కూకర్స్‌, హుహ్తమకి పీపీఎల్‌, టీవీ టుడే, జగరణ్‌ ‍ప్రకాషన్‌ షేర్లు సైతం లాభాలను ఆర్జించాయి. 

 You may be interested

4000 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ ముగింపు

Monday 23rd March 2020

పతనంలో సరికొత్త రికార్డ్‌ 1135 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ బ్యాంక్‌ నిఫ్టీ 16 శాతం పతనం నాలుగేళ్ల కనిష్టానికి నిఫ్టీ ప్రపంచ దేశాలను పీడిస్తున్న కరోనా వైరస్‌ దేశీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తుండటంతో ఇన్వెస్టర్లు మళ్లీ భయాందోళలకు లోనయ్యారు. ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే మూకుమ్మడిగా అమ్మకాలకు ఎగబడ్డారు. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీ స్టాక్‌ మార్కెట్లు 10 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో గత రెండు వారాలలో రెండోసారి ట్రేడింగ్ నిలిచిపోయింది. తదుపరి తిరిగి మార్కెట్లు

ఈ చిన్న షేర్లు లబోదిబో

Monday 23rd March 2020

ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మార్కెట్లు 10 శాతం కుప్పకూలినప్పటికీ అమ్మకాలు ఆగలేదు.  సమయం గడిచేకొద్దీ అమ్మకాల తీవ్రత మరింత పెరిగింది. దీంతో సెన్సెక్స్‌ 3700 పాయింట్లకుపైగా కోల్పోగా.. నిఫ్టీ ఏకంగా 1,000 పాయింట్లు పడిపోయింది. దీంతో ఇండెక్స్‌ షేర్లన్నీ భారీగా పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో పలు మధ్య, చిన్నతరహా కౌంటర్లలో అమ్మకాలు ఉధృతమయ్యాయి. అంతా అమ్మేవాళ్లేతప్ప కొనుగోలుదారులు కరవుకావడంతో 20 శాతం లోయర్‌ సర్క్యూట్లను తాకాయి. వివరాలు చూద్దాం.. 20 శాతం డౌన్‌

Most from this category