News


ఏడాది కోసం టాప్‌ సిఫార్సులు

Monday 17th February 2020
Markets_main1581936149.png-31865

వచ్చే సంవత్సర కాలంలో మంచి రాబడినిచ్చే సత్తా ఉన్న షేర్లను అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు.
1. కోల్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 258. థర్మల్‌ కోల్‌ మనుగడపై సందేహాలున్నా, ప్రస్తుతానికి దేశీయ విద్యుదుత్పాదనలో బొగ్గు డామినేషన్‌ కొనసాగుతుందని అంచనా. వచ్చే మూడేళ్లలో వాల్యూంలు 5 శాతం పెరగవచ్చు. దీనికితోడు కంపెనీ తీసుకుంటున్న సామర్ధ్య పెంపు చర్యల కారణంగా ఎబిటా వచ్చే మూడేళ్లు 3 శాతం చక్రీయవార్షిక వృద్ధి నమోదు చేయగలదు.
2. అశోకాబుల్డ్‌కాన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 150. క్యు3 అనంతరం మేనేజ్‌మెంట్‌ రెవెన్యూ గ్రోత్‌గైడెన్స్‌ను తగ్గించింది. కానీ ఇది కేవలం రక్షణాత్మకమేనని, స్థిర రెవెన్యూ వృద్ధి కొనసాగుతుందని బ్రోకరేజ్‌ల అంచనా. కంపెనీ బాలెన్స్‌షీట్‌ బలంగా కనిపిస్తోంది. 
3. ప్రిసమ్‌ జాన్సన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 90. బలమైన పొదుపు చర్యలతో మార్జిన్ల మెరుగుదల కనిపించింది. రాబోయే రోజుల్లో మార్జిన్లు 0.9పీపీ, ఆర్‌ఓఈ 3.5 పీపీ చొప్పున వృద్ధి చెందవచ్ని అంచనా.
4. సీఈఎస్‌సీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 970. కంపెనీ మెరుగైన క్యు3 ఫలితాలు ప్రకటించింది. ధరీవాల్‌, డీఎఫ్‌ వ్యాపారాల్లో మెరుగుదల కొనసాగుతుంది. ప్రస్తుతం ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద షేరు ట్రేడవుతోంది. 
5. ఎంఅండ్‌ఎం: కొనొచ్చు. టార్గెట్‌రూ. 686. యూవీ విభాగంలో కొన్ని సవాళ్లున్నా, ట్రాక్టర్ల విభాగంలో రికవరీ కనిపిస్తోంది. వాల్యూషన్లు కొనుగోళ్లకు సబబుగానే ఉన్నాయి. 
6. డిక్సన్‌టెక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 5899. త్రైమాసిక ఫలితాల్లో మెరుగుదల కొనసాగిస్తోంది. కీలక కస్టమర్ల నుంచి వచ్చే ఇంక్రిమెంటల్‌ వాల్యూంలను రాబోయే త్రైమాసికాల్లో పరిశీలించాలి.
7. నిప్పన్‌ లైఫ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 485. దేశంలోని పెద్ద ఏయూఎంల్లో ఒకటి. కంపెనీలో మాతృసంస్థ వాటా పెంచుకోవడం పాజిటివ్‌ అంశం. బలమైన సిప్‌ బుక్‌ నిర్వహిస్తోంది.
8. యాక్సిస్‌ బ్యాoక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 902. కార్పొరేట్‌ లెండింగ్‌, ట్రేడ్‌ ఫైనాన్స్‌, సిండికేషన్‌ తదితర విభాగాలపై ఎక్కువ ఫోకస్‌ చేయడం కలిసివచ్చే అంశం. ఆస్తుల నాణ్యత మెరుగుపడుతోంది. 
9. టీబీజీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 473. బలమైన పోర్టుఫోలియో, మెరుగైన డిస్ట్రిబ్యూషన్‌, సరికొత్త ప్రణాళికలు.. టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌కు పాజిటివ్‌ అంశాలు. టీసీఎల్‌ విలీనంతో మరింత ప్రయోజనం జరగనుంది.
10. టైటాన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1528. పలు విభాగాల్లో లీడర్‌గా ఉంది. బ్రాండ్‌కు బలమైన గుర్తింపుంది. స్టోర్‌ నెట్‌వర్క్‌ మరింతగా విస్తరిస్తోంది. క్యు4లో రెవెన్యూ వృద్ధి 11-13 శాతం ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. You may be interested

ముకేశ్‌ మీడియా వ్యాపారాలన్నీ నెట్‌వర్క్‌ 18 కిందకు

Tuesday 18th February 2020

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన మీడియా, పంపిణీ వ్యాపారాలను విలీనం చేసి ఒకే సంస్థగా ఏర్పాటు చేయనుంది. టెలివిజన్‌ 18 బ్రాడ్‌కాస్ట్‌, హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌లను నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో విలీనం చేయనుంది. మెత్తం మీడియా వ్యాపారం అంతా  నెట్‌వర్క్‌ 18 కింద కొనసాగనుంది. కేబుల్‌ అండ్‌ ఐఎస్‌పీ వ్యాపారం రెండు సొంత సబ్సిడరీలుగా నెట్‌వర్క్‌ 18 కింద నడుస్తాయి.

మూడీస్‌ దెబ్బ- మూడో రోజూ నేలచూపే

Monday 17th February 2020

సెన్సెక్స్‌ 202 పాయింట్లు మైనస్‌ 2020లో దేశ ఆర్థిక వృద్ధి 5.4 శాతమే మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ తాజా అంచనా పీఎస్‌యూ బ్యాంక్స్‌ పతనం కరోనా వైరస్‌, జీడీపీ అంచనాలలో మూడీస్‌ కోత దేశీ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీశాయి. ఫలితంగా వరుసగా మూడో రోజు నష్టాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 202 పాయింట్లు క్షీణించి 41,056 వద్ద నిలవగా.. నిఫ్టీ 68 పాయింట్లు తక్కువగా 12,046 వద్ద ముగిసింది. దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను తాజాగా

Most from this category