News


99 స్టాకుల్లో ఎంఏసీడీ బేరిష్‌

Tuesday 18th June 2019
Markets_main1560852640.png-26389

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఇవి బేరిష్‌
దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 99 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో అదానీ పవర్‌, ఆర్‌ఐఎల్‌, ఎయిర్‌టెల్‌, ఐడీబీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, టైటాన్‌, అదానీ పోర్ట్స్‌, జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌, అమర్‌రాజా బ్యాటరీస్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌, వొకార్డ్డ్ట్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు.
ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 10 షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. అపోలోటైర్స్‌, అరబిందో ఫార్మా, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, నవ్‌భారత్‌ వెంచర్స్‌, గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌, సీసీఎల్‌ ప్రొడక్ట్స్, క్రెస్ట్‌ వెంచర్స్‌, మయూర్‌ యూనికోటర్స్‌, సంఘ్వీ ఫోర్జింగ్‌, గ్రాబ్‌ టీ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి.  మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  You may be interested

4రోజుల నష్టాలకు బ్రేక్‌

Tuesday 18th June 2019

39000 పైన ముగిసిన సెన్సెక్స్‌ రాణించిన మెటల్‌, ఐటీ షేర్లు మార్కెట్‌ నాలుగు రోజుల నష్టాల నుంచి తేరుకుంది. మెటల్‌, ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో మంగళవారం సూచీలు లాభాలతో ముగిశాయి. సెనెక్స్‌ 85 పాయింట్లు లాభపడి 39000 మార్కును దాటి 39046 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌ 19 పాయింట్లు పెరిగి 11691 వద్ద ముగిసింది. ఫార్మా, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, అటో రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని లోనయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ

ఆర్‌ఐఎల్‌ ఎర్నింగ్స్‌ వృద్ధిలో క్షీణత!

Tuesday 18th June 2019

జేపీ మోర్గాన్‌ అంచనా రిఫైనింగ్‌, పెట్రోకెమ్‌ మార్జిన్ల బలహీనతతో ఈ ఆర్థిక సంవత్సరం ఆర్‌ఐఎల్‌ ఎర్నింగ్స్‌ గ్రోత్‌ 15 శాతం తగ్గవచ్చని దిగ్గజ బ్రోకరేజ్‌ జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది. మౌలిక వ్యాపారంలో బలహీనతను తట్టుకునేందుకు జియో టారిఫ్‌లను 12- 20 శాతం మేర ఆర్‌ఐఎల్‌ పెంచవచ్చని అభిప్రాయపడింది. ఈ విధమైన పెరుగుదల టెలికం రంగంలో మరింత పోటీని, అసమానతను పెంచవచ్చని తెలిపింది. ఆర్‌ఐఎల్‌ ఎర్నింగ్స్‌ గ్రోత్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు ఆందోళన

Most from this category