News


సెన్సెక్స్‌ను బీట్‌ చేస్తున్న షేర్లివే

Monday 2nd September 2019
Markets_main1567418804.png-28151

మార్కెట్‌లలో కొనసాగుతున్న ప్రతికూలతను ఎదుర్కొని పుంజుకునేందుకు అనేక దేశియ స్టాకులు ప్రయత్నిస్తున్నాయి. కానీ కొన్ని స్టాకులు మాత్రమే అద్భుత ప్రదర్శనను చేస్తున్నాయి. బీఎస్‌ఈ 500 స్టాకులలో 26 స్టాకులు మాత్రమే గత మూడేళ్ల నుంచి సెన్సెక్స్‌ కంటే మంచి ప్రదర్శనను చేశాయి. పీ అండ్‌ జీ, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, వినాటి ఆర్గానిక్స్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, బాటా ఇండియా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హనీవెల్ ఆటోమేషన్ వంటి స్టాక్స్ 2017, 2018 లలో, 2019లో ఇప్పటి వరకు సెన్సెక్స్ కంటే అధిక రిటర్న్‌లను ఇచ్చాయి. వినాటి ఆర్గానిక్స్‌ 2017, 2018 లో 66 శాతం ర్యాలీ చేయగా, ఈ ఏడాది ఇప్పటి వరకు గల కాలంలో 34 శాతం లాభపడింది. ఐసోబుటిల్‌బెంజీన్ (ఐబీబీ), 2-యాక్రిలామిడో 2-మిథైల్‌ప్రోపేన్ సల్ఫోనిక్ యాసిడ్ (ఏటీబీఎస్‌)లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటీబీఎస్‌ కొరత కారణంగా ఈ కంపెనీకి అంతర్జాతీయంగా మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉంది.  దీనితో పాటు ప్రీమియమైజేషన్ డ్రైవ్ వరుసగా 13 వ త్రైమాసికంలో కూడా మార్జిన్‌లను పెంచడంతో బాటా ఇండియా గత మూడేళ్ళలో వరుసగా 34 శాతం, 50 శాతం, 68 శాతం రిటర్న్‌లను ఇచ్చింది.  ప్రస్తుతం బేరిష్‌ మార్కెట్‌ను తట్టుకునేందుకు మధ్యస్థకాలానికి గాను వృద్ధి చెందుతున్న ఈ కౌంటర్లను గమనించవచ్చు.
గత మూడేళ్ల కాలంలో బీఎస్‌ఈసెన్సెక్స్‌ను మించి అధిక రిటర్న్‌నిచ్చిన స్టాకులు:
పీ అండ్‌ జీ, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, వినాటి ఆర్గానిక్స్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, బాటా ఇండియా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హనీవెల్ ఆటోమేషన్, ప్రోక్టార్‌ అండ్‌ గ్యాంబల్‌ హెల్త్‌, ట్రెంట్‌, పిడిలిటీ ఇండస్ట్రీస్‌, రిలాక్సో పుట్‌వేర్స్‌, ముత్తుట్‌ ఫైనాన్స్‌, టైటాన్‌ కంపెనీ, మహారాష్ట్ర స్కూటర్స్‌, జేఎస్‌డబ్యూ హోల్డింగ్స్‌, కోటక్‌ మహింద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా, ఆస్ట్రాల్‌ పాలీ టెక్నిక్‌, అదాని పవర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, దివిస్‌ ల్యాబ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సొనాటా సాఫ్ట్‌వేర్‌, జీఎస్‌కే కన్జ్యూమర్‌, హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్‌ You may be interested

తగ్గిన జీడీపీ...పెట్టుబడులకు ఇది మంచి అవకాశం

Monday 2nd September 2019

-విశ్లేషకులు  ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికానికి సంబంధించి దేశ జీడీపి 5 శాతంగా నమోదైంది. కాగా ఇది ఆరేళ్ల కనిష్టం కావడం గమనార్హం. మార్కెట్‌ సెంటిమెంట్‌ దేశ జీడీపీతో ముడిపడి ఉండడం వలన మార్కెట్‌ మరింత పతనమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. అయినప్పటికి ఈ పరిస్థితిని ఇన్వెస్ట్‌ చేయడానికి ఉపయోగించుకోవాలని సలహాయిస్తున్నారు. ‘జూన్‌ త్రైమాసికపు జీడీజీ వృద్ధి రేటు మా అంచనా కంటే తక్కువగా ఉంది. దీని ఫలితంగా

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నిలువునా పతనం

Monday 2nd September 2019

సోమవారంనాటి సెలవు అనంతరం మంగళవారం భారత్‌ సూచీలు భారీ గ్యాప్‌డౌన్‌తో ఆరంభమయ్యే సంకేతాల్ని తాజాగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సోమవారం మధ్యాహ్న సమయంలో 150 పాయింట్లకుపైగా పతనమయ్యింది. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండడంతో పాటు, ఈ జూన్‌ త్రైమాసికంలో  దేశ జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడం, అలాగే ఆగస్టులో వాహన విక్రయాలు భారీగా తగ్గినట్లు ఆదివారం గణాంకాలు వెలువడటం,

Most from this category