STOCKS

News


2020లో మార్కెట్లపై ప్రభావం చూపించే అంశాలు..

Tuesday 24th December 2019
Markets_main1577126333.png-30388

కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. 2019 కంటే 2020లో మార్కెట్‌ మెరుగ్గా ఉండాలన్న ఆకాంక్ష ఇన్వెస్టర్లు అందరిలోనూ ఉంటుంది. కానీ, నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అవసరం. గడిచిన ఏడాది కాలంలో మనం చూసిన ఎన్నో అంశాల్లో కొన్ని వచ్చే ఏడాది కూడా కొనసాగొచ్చని ఎమ్‌కే వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో భవేష్‌ సంఘ్వి అంచనా వేస్తున్నారు. 2020లో ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపించే అంశాలను ఆయన వెల్లడించారు.

 

  • అమెరికా-చైనా మధ్య టారిఫ్‌ల యుద్ధం అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించే అంశం. టారిఫ్‌ల యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. అమెరికా, యూరోపియన్‌ దేశాల ఆ‍ర్థిక వృద్ధి మందగమనానికి ఈ ట్రేడ్‌ వారే కారణం.
  • ఎఫ్‌పీఐలకు, ఎఫ్‌డీఐలకు చైనా చాలా ముఖ్యమైన దేశం. చైనా ప్రయోజనాలు ఇతర ప్రపంచంతో ముడిపడి ఉన్నాయి. చైనాలో జరిగే పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపిస్తాయి. 2018లో ప్రపంచవ్యాప్తంగా చైనా యాజమాన్యం గల ఆస్తుల పరిమాణం 7 ట్రిలియన్‌ డాలర్లు. టారిఫ్‌ల యుద్ధానికి పరిష్కారం లభిస్తే అది ప్రపంచ మార్కెట్లకు మంచి పరిణామం. 
  • భౌగోళిక రాజకీయ అంశాలు నిద్రాణంగా ఉన్న అగ్నిపర్వతాల్లాంటివి. ఎప్పుడైనా పేలిపోవచ్చు. ఇరాన్‌లో పరిస్థితులు, మిగిలిన మధ్య ప్రాచ్యం, కొరియా అంశాలు కొత్త సంవత్సరంలోనూ కొనసాగనున్నాయి.
  • అమెరికా, యూరోప్‌, చైనా, భారత్‌ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మందగనం నెలకొంది. ఫెడ్‌ ఇప్పటికే పలుమార్లు రేట్లను తగ్గించింది. పాలసీ సులభతరం చేయనున్నట్టు ఈసీబీ కూడా సంకేతం ఇచ్చింది. ఆర్‌బీఐ కూడా పలు విడతలుగా రేట్లను తగ్గించింది. వృద్ధి క్షీణతకు బ్రేక్‌ వేసేందుకు తీసుకున్న ఈ చర్యల ఫలితాలు కనిపించడానికి కొంత సమయం పడుతుంది. 
  • చాలా అభివృద్ధి చెందిన మార్కెట్లలో తయారీ రంగంలోని అధిక శాతం కంపెనీల రుణ చెల్లింపులు తగ్గుతూ వస్తున్నాయి. లాభాల వృద్ధి కూడా తగ్గుతోంది. ఇది తక్కువ లాభదాయకతను సూచిస్తోంది. రుణ చెల్లింపులు చేయలేకపోవడం ఆర్థిక మందగమనాన్ని సూచిస్తుంది. దీంతో డెట్‌లో ఇన్వెస్ట్‌ చేసే విషయమై ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. 
  • దేశ జీడీపీ వృద్ధి తగ్గింది. కంపెనీల ఆదాయాలు కూడా దీనికి తగినట్టుగానే ఉంటాయి. ఇది మార్కెట్లపై ప్రభావం చూపిస్తుంది. అయితే, ప్రభుత్వం, ఆర్‌బీఐ ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాయి. పెట్టుబడులు, వినియోగం బలంగా మారనంత వరకు ఆర్థిక వ్యవస్థ పూర్వపు స్థితిని అందుకోలేదు.
  • ఇన్వెస్టర్లు డెట్‌లోనూ, ఈక్విటీల్లోనూ నాణ్యమైన పోర్ట్‌ఫోలియోపై దృష్టి సారించాలి. మంచి పాలనా ‍ప్రమాణాలు, నిరూపితమైన వ్యాపార నమూనాలు, స్థిరమైన నగదు ప్రవాహం, ఆదాయం వంటివి చూడాలి.  You may be interested

యస్‌ బ్యాంకు.. నిధుల సమీకరణతోనే సానుకూలత

Tuesday 24th December 2019

యూరోపియన్‌ సంస్థలు యస్‌ బ్యాంకులో బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు రాగా, ఇది సఫలం అయితే బ్యాంకు ఊపిరి పీల్చుకున్నట్టేనని ఈల్డ్‌ మ్యాగ్జిమైజర్‌ వ్యవస్థాపకుడు యోగేష్‌ మెహతా పేర్కొన్నారు. పలు అంశాలపై ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.   యస్‌ బ్యాంకు యస్‌ బ్యాంకు టైర్‌-1, టైర్‌-2 నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అలాగే, మూలధన నిధులు కూడా బ్యాంకుకు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. నిధుల అవసరం ఎంతో

నిఫ్టీలో కాల్‌ బటర్‌ఫ్లై వ్యూహం బెటర్‌!

Monday 23rd December 2019

శుభమ్‌ అగర్వాల్‌ నిఫ్టీలో ప్రస్తుతం కాల్‌ బటర్‌ఫ్లై వ్యూహం అవలంబించడం మంచిదని ప్రముఖ అనలిస్టు శుభమ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఈ వ్యూహం నాలుగంచెలుగా ఉంటుంది. ఇందులో ప్రస్తుత స్థాయికి దగ్గర్లోని కాల్‌ను ఒకలాట్‌ కొంటారు. అనంతరం దానికి పైన అధిక స్థాయికి చెందిన కాల్‌ రెండు లాట్లు అమ్మాలి. అనంతరం అమ్మిన కాల్‌కు దగ్గర్లోని ఒక కాల్‌ లాట్‌ ఒకటి కొనడం జరుగుతుంది. ఈ వ్యూహంలో లాభాలు స్వల్పమైనా స్థిరంగా ఉంటాయి,

Most from this category