News


ఎన్‌టీపీసీపై మోర్గాన్‌స్టాన్లీ, సిటి బుల్లిష్‌

Friday 22nd November 2019
Markets_main1574414623.png-29789

అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ, ప్రభుత్వరంగ పవర్‌ దిగ్గజమైన ఎన్‌టీపీసీ షేర్లపై రేటింగ్‌ను ‘ఈక్వల్‌ వెయిట్‌’ నుంచి ‘ఓవర్‌ వెయిట్‌’కు నవీకరించింది. అంతేకాకుండా ఈ కంపెనీ షేరు టార్గెట్‌ ధరను రూ. 147 నుంచి రూ. 152కు పెంచింది. ఫలితంగా ఈ కంపెనీ షేరు విలువ శుక్రవారం సెషన్‌లో 2 శాతానికి పైగా లాభపడి ట్రేడవుతోంది. కాగా మోర్గాన్‌ స్టాన్లీ ఇచ్చిన ఈ టార్గెట్‌ ధర, ప్రస్తుత మార్కెట్‌ ధర నుంచి 30 అధికం కావడం గమనార్హం. ‘ఎన్‌టీపీసీపై రిస్క్‌ రివార్డ్‌ ఆకర్షిణియంగా ఉంది’ అని ఈ బ్రోకరేజి తెలిపింది. మధ్యాహ్నాం 2.35 సమయానికి ఈ కంపెనీ షేరు 2.41 శాతం లాభపడి రూ. 118.15 వద్ద ట్రేడవుతోంది. 
   టీహెచ్‌డీసీ(టెహ్రి హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌), ఎన్‌ఈఈపీసీఓ(నార్త ఈస్ట్రన్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పోరేషన్‌) సంస్థలలోని ప్రభుత్వం షేర్‌హోల్డింగ్‌ను ఎన్‌టీపీసీకి విక్రయించడంతో పాటు, యాజమాన్యం హక్కులను కూడా బదలాయించేందుకు ప్రభుత్వ తీసుకున్న వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికకు అనుగుణంగా కేబినేట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వానికి టీహెచ్‌డీసీలో 74.23 శాతం వాటా, ఎన్‌ఈఈపీసీఓలో 100 శాతం వాటా ఉంది. అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ సిటీ కూడా ఎన్‌టీపీసీపై ‘కొనచ్చు’ రేటింగ్‌ను కొనసాగిస్తు, టార్గెట్‌ ధరను రూ. 142 గా నిర్ణయించింది. ‘టీహెచ్‌డీసీ, ఎన్‌ఈఈపీసీఓ సంస్థల మొత్తం విలువను కలిపిన ఎన్‌టీపీసీ నికర విలువలో 15 శాతానికి సమానంగా ఉంటుంది. ఈ ప్రభావాన్ని ఎన్‌టీపీసీ నిర్వహించగలిగే స్థాయిలోనే ఉంది. అంతేకాకుండా ఆర్థిక సంవత్సరం 2019 నికర రుణం-ఈక్విటీ నిష్పత్తి 1.3 రెట్లు ఉందని, ఎన్‌టీపీసీ నికర విలువ రూ. 1,07,400 కోట్లుగా ఉంది’ అని సిటీ నవంబర్‌ 20న ఓ నివేదికలో ప్రకటించింది. 



You may be interested

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో 10 శాతం అప్‌సైడ్‌కు ఛాన్స్‌

Friday 22nd November 2019

అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజం హెచ్‌ఎస్‌బీసీ సంస్థ రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు కొనుగోలు టార్గెట్‌ను పెంచింది. ‘రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన కన్జూమర్‌, జియో, రిటైల్‌ వ్యాపారాల్లోని వృద్ధి అప్‌సైడ్‌ ట్రెండ్‌ను నడిపిస్తాయి. అలాగే ప్రస్తుత ధర వద్ద షేరు వ్యాల్యూవేషన్‌ ఆకర్షణీయంగా ఉందని’బ్రోకరేజ్‌ పేర్కొంది. ఈ క్రమంలో షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను రూ.1,700 పెంచుతున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది.  వొడాఫోన్‌

నిఫ్టీ టార్గెట్‌13800 !

Friday 22nd November 2019

సీఎల్‌ఎస్‌ఏ అంచనా నిఫ్టీ 12వేల పాయింట్లను దాటేందుకు ఆపసోపాలు పడుతోంది. గత గరిష్ఠం 12100 పాయింట్లను దాటితే అప్‌మూవ్‌ ఉంటుందని నిపుణులు భావిస్తున్నా, నిఫ్టీ ప్రస్తుతానికి 12వేల స్థాయిని విజయవంతంగా అధిగమించలేకపోతోంది. ఇక్కడకు వచ్చినప్పుడల్లా ప్రాఫిట్‌ బుకింగ్‌ను ఎదుర్కొంటోంది. కొన్ని సెషన్లుగా 11850- 12000 పాయింట్ల రేంజ్‌లో కదలాడుతోంది. సెప్టెంబర్‌లో ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్‌ టాక్స్‌ కోతతో నిఫ్టీ ఒక్కమారుగా ర్యాలీ మూడ్‌లోకి వచ్చింది. నెలన్నరకాలంలో నిఫ్టీ 10700- 12000 పాయింట్లను

Most from this category