News


ఈ రంగాలకు ‘వైరస్‌’ ఇబ్బందేమీ లేదు: 

Sunday 16th February 2020
Markets_main1581874418.png-31831

ఫలితాల సీజన్‌ ముగిసిందని, మార్కెట్లు ఇకపై కరోనా వైరస్‌ ప్రభావంపై దృష్టి సారిస్తాయని సార్థి గ్రూపు సీఐవో కుంజ్‌ భన్సాల్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ ప్రభావం పడని ఏడు రంగాల గురించి ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

 

మార్కెట్లపై..
జనవరి మధ్యలో నిఫ్టీ ఆల్‌టైమ్‌ గరిష్టాలకు వెళ్లింది. అప్పటి నుంచి నెల పాటు మార్కెట్‌ ఓ శ్రేణికే పరిమితమైంది. ఈ మధ్యలో బడ్జెట్‌, ఫలితాల సీజన్‌ను మార్కెట్లు సర్దుబాటు చేసుకున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్‌ ప్రభావం గత రెండు రోజులుగా మార్కెట్ల నష్టాలకు కారణమైంది. మార్కెట్లు ఎప్పుడూ ఎగువ వైపునే ప్రయాణం చేయలేవు. వ్యాల్యూషన్లు సైతం కొనుగోళ్ల శ్రేణిని దాటిపోయాయి. 

 

ఫార్మా స్టాక్స్‌..
లార్జ్‌క్యాప్‌ పార్మా స్టాక్స్‌ ర్యాలీకి దూరంగా ఉన్నాయి. సన్‌ ఫార్మా ఐదేళ్ల కాలంలో ప్రతికూల రాబడులను ఇచ్చింది. అదే విధంగా లుపిన్‌, వొకార్డ్‌ కంపెనీలు కూడా. డాక్టర్‌ రెడ్డీస్‌ను చూసినా ఐదేళ్ల కాలంలో చెప్పుకోతగ్గంత రాబడులను ఇవ్వలేదు. ఏడాది కాలానికి చూస్తే 52 వారాల గరిష్ట స్థాయికి చేరింది. అదే సమయంలో మిడ్‌క్యాప్‌ ఫార్మా విభాగం పూర్తి భిన్నంగా ఉంది. దివిస్‌ల్యాబ్స్‌, టోరంట్‌ ఫార్మా, నాట్కో, ఆల్కెమ్‌ ల్యాబ్‌ మంచి పనితీరు చూపిస్తున్నాయి. అలాగే, ఎంఎన్‌సీ ఫార్మా కంపెనీలు కూడా మంచి ర్యాలీ చేస్తున్నాయి. లార్జ్‌క్యాప్‌ కంపెనీలు నిజానికి ఆయా రంగాలకు మద్దతుగా నిలిచేవి. కానీ, దేశీయంగా, ఎగుమతి మార్కెట్లలో ఇవి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కనుక సాధారణ దృష్టితో కాకుండా ఈ రంగంలో విడిగా స్టాక్స్‌ వారీగా విధానం అనుసరించడం మంచిది.

 

ఈ రంగాలు సానుకూలం..
ఫలితాల సీజన్‌ ముగిసినందున తదుపరి మార్కెట్‌ ర్యాలీ కరోనా వైరస్‌ ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్యం, చైనా నుంచి దిగుమతులపై ఆధారపడని రంగాలైన బీఎఫ్‌ఎస్‌ఐ, ప్రైవేటు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, సిమెంట్‌, కన్జ్యూమర్‌ గూడ్స్‌తోపాటు ఆయిల్‌ ధరలు తగ్గినందున పెయింట్స్‌ కంపెనీలు మంచి పనితీరు చూపించగలవు. కనుక ఇన్వెస్టర్లు వీటి పట్ల దృష్టి సారించొచ్చు. 



You may be interested

ఎల్‌ఐసీలో ఇన్వెస్ట్‌ చేయను..: శంకర్‌శర్మ

Sunday 16th February 2020

ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీవోకు రానుండగా, ఓ ఇన్వెస్టర్‌గా తాను అయితే ఎల్‌ఐసీలో ఇన్వెస్ట్‌ చేయనని ఫస్ట్‌ గ్లోబల్‌ సంస్థ వ్యవస్థాపకుడు శంకర్‌ శర్మ స్పష్టం చేశారు. ప్రభుత్వరంగంలో అమ్ముడుపోని సంస్థల వాటాలను కొనుగోలు చేసే సంస్థగా ఎల్‌ఐసీని ప్రభుత్వం వాడుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ‘‘ఓ ఇన్వెస్టర్‌గా ఎల్‌ఐసీని అస్సలు టచ్‌ చేయను. ప్రభుత్వం అమ్ముడుపోని వాటిని ఎల్‌ఐసీకి విక్రయిస్తోంది. ఆ అమ్ముడుపోని వస్తువుల

కొద్ది రోజుల్లో కొంత చెల్లిస్తాం: వొడాఫోన్‌ ఐడియా

Sunday 16th February 2020

వ్యాపార మనుగడపై ఇంకా అనిశ్చితి కొద్ది నెలలుగా టెలికాం రంగాన్ని కుదిపేస్తున్న ఏజీఆర్‌ బకాయిల్లో ప్రస్తుతానికి ఎంతమేరకు చెల్లించగలమో లెక్కవేస్తున్నామని వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. అయితే కంపెనీ మనుగడసాగించడంపై మాత్రం ఆందోళన వ్యక్తంచేసింది. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల గడువు పెంపును కోరుతూ సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌పై వచ్చే తీర్పు ఆధారంగా తమ వ్యాపార మనుగడ ఆధారపడివుంటుందని వొడాఫోన్‌ ఐడియా శనివారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో వివరించింది. కంపెనీ రూ. 52,000

Most from this category