STOCKS

News


రెండు రోజుల్లో భారీ ర్యాలీ... ఏమై ఉంటుంది?

Friday 9th August 2019
Markets_main1565374093.png-27674

ఊహించని విధంగా స్టాక్‌ మార్కెట్లు గురు, శుక్రవారాల్లో భారీ ర్యాలీ చేశాయి. కనిష్ట స్థాయిల్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపించడం మంచి లాభాలకు తోడ్పడ్డాయి. దీని వెనుక అంశాలను పరిశీలిస్తే... 

 

ఎఫ్‌ఫీఐలపై సర్‌చార్జీ
బడ్జెట్లో అధిక ఆదాయ వర్గాలపై ఆదాయపన్ను సర్‌చార్జీని ప్రభుత్వం భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది. రూ.2-5 కోట్ల మధ్య ఆదాయం కలిగిన వారిపై 15 శాతం నుంచి 25 శాతానికి, రూ.5 కోట్లకుపైగా ఆదాయం కలిగిన వారిపై 15 శాతం నుంచి 37 శాతానికి పెంచింది. కార్పొరేట్‌ సంస్థలుగా నమోదు చేసుకోకుండా, వ్యక్తులుగా మన మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తున్న ఎఫ్‌పీఐలు కూడా అధిక ఆదాయం పరిధిలోకే వస్తారు. దీంతో తమ ఆదాయంపై వాస్తవంగా చెల్లించాల్సిన పన్ను రూ.2 కోట్లకు పైగా ఉన్న వారికి 39 శాతానికి, రూ.5 కోట్లు దాటిన వారికి 42.7 శాతానికి పెరిగింది. బడ్జెట్‌ నాటి నుంచి ఎఫ్‌పీఐలు మన మార్కెట్లలో అమ్మకాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు రూ.25 వేల కోట్లకు పైగానే అమ్మకాలు చేశారు. దీంతో ఎఫ్‌పీఐలను ఆదాయపన్ను సర్‌చార్జీ పెంపు నుంచి ప్రభుత్వం మినహాయించొచ్చని ఆర్థిక శాఖ వర్గాలు సమాచారం లీక్‌ చేయడం ఒక ప్రధాన కారణం. ఆదాయపన్ను చట్టం ప్రకారం అసోసియేషన్‌ ఆఫ్‌ పర్సన్స్‌/ బాడీ ఆఫ్‌ ఇండివిడ్యువల్‌ వ్యక్తుల విభాగంలోకి వస్తారు. దీంతో అధిక శాతం ఎఫ్‌పీఐలు సర్‌చార్జీ పరిధిలోకి వస్తారు. 

 

ఎన్‌బీఎఫ్‌సీ, ఆటో రంగాలకు ఉద్దీపనలు
ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలకు గతేడాది సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం వెలుగు చూసిన నాటి నుంచి నిధుల కటకట ఏర్పడింది. ఈ రంగానికి ఉపశమన ప్యాకేజీ ఉంటుందని ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి మీడియాకు ఉప్పందించారు. దీనికితోడు ఆర్‌బీఐ తాజా ఎంపీసీ నిర్ణయాల్లో ప్రకటించిన చర్యలు ఈ రంగానికి ఉపశమనం కల్పిస్తాయన్నది అంచనా. ఒక్కో ఎన్‌బీఎఫ్‌సీ పరంగా బ్యాంకుల ఎక్స్‌పోజర్‌ పరిమితిని పెంచిన విషయం తెలిసిందే. వాహన అమ్మకాలు క్షీణిస్తున్న ఆటో రంగానికి కూడా ప్రభుత్వం ఏదైనా పరిష్కారం చూపించనుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 

 

పారిశ్రామిక వేత్తలతో ఆర్థిక మంత్రి భేటీ
ఈ నెల 8న పారిశ్రామికవేత్తలతో ఆర్థిక మంత్రి సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. పడిపోతున్న ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంతోపాటు పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు. రూ.లక్ష కోట్లకుపైగా ఉద్దీపనలు అవసరమని ఈ సందర్భంగా వారు ఆర్థిక మంత్రికి తెలియజేశారు. దీంతో వీలైనంత త్వరలో ప్రభుత్వం నుంచి పరిష్కార చర్యలు ఉంటాయని ఆర్థిక మంత్రి వారికి హామీ ఇచ్చారు. 

 

బడ్జెట్లో ప్రకటించిన మేరకు ప్రభుత్వరంగ బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్‌ను సెప్టెంబర్‌ 1 నుంచి ఇవ్వనున్నట్టు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. రూ.70,000 కోట్లను 2019-20లో ఇవ్వనున్నట్టు ఆర్థిక మంత్రి బడ్జెట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో రానున్న సమావేశాల్లోనూ ఆర్‌బీఐ మరో విడత రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోవచ్చన్న అంచనాలు పెరిగాయి. 

 

వీటికి తోడు నిఫ్టీ-50 సాంకేతికంగా పరిశీలిస్తే కీలక అవరోధాలైన 10,900, 11,000, 11,100ను అధిగమించి క్లోజ్‌ అవడం, రెండు రోజుల్లో 250 పాయింట్లు లాభపడిన నేపథ్యంలో రానున్న సెషన్లలో 200 డీఎంఏ అయిన 11,271 వరకు వెళ్లొచ్చన్నది అంచనా. ఇంట్రాడేలో 10,800 కనిష్ట స్థాయి  తర్వాత గత నాలుగు రోజుల్లో మార్కెట్లు కన్సాలిడేటెడ్‌ అవడం షార్ట్‌ టర్మ్‌ బోటమ్‌ను సూచిస్తున్నట్టు టెక్నికల్‌ అనలిస్ట్‌ మజర్‌ మహమ్మద్‌ పేర్కొన్నారు. You may be interested

మార్కెట్లు ఆక్టోబర్‌ నుంచి తిరిగి పుంజుకుంటాయి

Saturday 10th August 2019

   ‘జీవితంలో కష్టసుఖాలు ఎలానో మార్కెట్లకు లాభ నష్టాలు అలాంటివే’ అని సీనియర్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా అన్నారు. మార్కెట్లు అక్టోబర్‌ నుంచి తిరిగి పుంజుకుంటాయని గత వారం ముంబైలో జరిగిని ఓ ఈవెంట్‌లో ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఆర్థికంగా విపరీత అధ్వాన్న పరిస్థితులన్నింటినీ దాటేశామని, మార్కెట్లు అక్టోబర్‌-నవంబర్‌ నాటికి తిరిగి పుంజుకుంటాయి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. స్టాక్‌ బ్రోకర్లకు ఇచ్చిన లెక్చర్‌లో ఝున్‌ఝున్‌వాలా తన ఇన్వెస్టింగ్‌ కెరీర్‌ను గుర్తుతెచ్చుకున్నారు. తన

ఈ స్టాక్స్‌... మార్కెట్లకు ఎదురీత

Friday 9th August 2019

గత ఏడాదిన్నరగా స్టాక్‌ మార్కెట్లో మిడ్‌క్యాప్‌, ‍స్మాల్‌క్యాప్‌ విభాగాలు ఇన్వెస్టర్లకు నికరంగా నష్టాలనే మిగిల్చాయి. బీఎస్‌ఈలో 90 శాతం నష్టాల పాలైన స్టాక్సే ఉన్నాయి. దీంతో వీటిల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఎక్కువ శాతం తుడిచిపెట్టుకుపోయినట్టుగానే భావించాలి. కానీ, ఓ 26 స్టాక్స్‌కు మాత్రం దీనికి మినహాయింపు. ఇవి సమస్యాత్మక కాలంలోనూ ఏటికి ఎదురీదాయి.    ఇంత క్లిష్ట సమయాల్లోనూ ఇన్వె‍స్టర్లకు మంచి రాబడులు ఇచ్చిన కంపెనీలు కెమికల్స్‌, కన్జ్యూమర్‌ ఫుడ్‌, ఫార్మా, షిప్పింగ్‌, టెలికం,

Most from this category