News


ఐఐఎఫ్‌ఎల్‌ నుంచి 3 మల్టీ బ్యాగర్లు

Tuesday 18th June 2019
Markets_main1560848363.png-26385

వచ్చే నెలలో మోదీ 2.0 ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ఈ ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్‌కు కీలకం కానునందని ఐఐఎఫ్‌ఎల్‌ వైస్‌ ఛైర్మన్‌ సంజీవ్‌ భాసిన్‌ అభిప్రాయపడుతున్నారు. కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ వినియమ, అటో రంగాలకు పెద్ద పీట వేసే అవకాశం ఉన్నందున ఈ రంగాలకు చెందిన షేర్లు పోర్ట్‌ఫోలియోలో చేరుకోవచ్చని భాసిన్‌ సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనీకంట్రో‍ల్‌ తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

పలు దేశాలతో అమెరికా వాణిజ్య యుద్ధాలకు కాలు దువ్విన నేపథ్యంలో ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ కుంటుపడటంతో పాటు, ఈ ప్రభావం అంతర్జాతీయ వృద్ధిపై పడింది. ఈ నేపథ్యంలో ఫెడ్‌ రిజర్వ్‌ తప్పనిసరిగా వడ్డీరేట్లపై మెతక వైఖరిని ప్రదర్శించక తప్పదు. ఫెడ్‌ వడ్డీరేట్ల కోతతో డాలర్‌ విలువ తగ్గుముఖం పడుతుంది. ఇది భారత్‌, బ్రెజిల్‌ లాంటి వర్ధమాన దేశ మార్కెట్లకు కలిసొచ్చే అంశం.  ఏడాది కాలంగా అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్న అమెరికా  చైనాల వాణిజ్య యుద్ధం ఇప్పడు చర్చలు దిశగా సాగుతున్నాయి. ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, చైనా అధిపతి జి లింగ్‌ మధ్య చర్చలు జరగనున్నాయి. ప్రపంచదేశాలపై అమెరికా చేస్తున్న వాణిజ్య యుద్ధంపై అమెరికా కంపెనీలతో పాటు వనియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ తరుణంలో ట్రేడ్‌ వార్‌పై ట్రంప్‌ కాస్త వెనకడుగు వేయవచ్చనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. అంతా సవ్యంగా జరిగి చర్చలు ఇరు దేశాల మధ్య చర్చలు సఫలమైతే, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో మరోసారి ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించిన మోదీ 2.0 వచ్చే నెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ మందగించిన ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యంగా వినిమయ, అటోరంగాలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఈ సానుకూలాంశాల నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి సెన్సెక్స్‌ 42,500 స్థాయిని, నిఫ్టీ 13,000 స్థాయిని అందుకోగలదని మేము విశ్వసిస్తున్నాని భాసిన్‌ అభిప్రాయపడ్డారు. 

ద్వి చక్రవాహన రంగంలో గత కొద్ది వారాలుగా రికవరి నెలకొంది. ఇప్పడు ఈ రంగ షేర్లను కొనేందుకు ఇది మంచి తరణం. వచ్చే నెలలో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అందులో నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలోని సమస్యలు పరిష్కరించే అవకాశాలుంచవచ్చు. గ్రామీణ ప్రాంతం ఆదాయాలు పెంచడం కొరకు ప్రభుత్వం పలు రకాల పథకాలను ప్రవేశపెట్టవచ్చు. అలాగే నైబుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో కారణంగా ద్వితీయార్థంలో దేశవ్యాప్తంగా వర్షపాతం ఎక్కువగా నమోదు కావచ్చు.  అలాగే ఇటీవల ఈ రంగంలో ఏర్పడి కరెక్షన్‌ తర్వాత వాల్యూవేషన్‌ ఆకర్షణీయంగా మారాయి. ఈ అంశాలు దృష్ట్యా ద్వి చక్ర వాహన రంగ షేర్ల కొనుగోళ్లకు ఇది సరైన సమయమేనని ఆయన అభిప్రాయపడ్డారు. 

మోదీ 2.0 ప్రభుత్వంలో వినియోగ, అటో రంగాలు కీలకంగా మారున్నాయి. దేశ జీడీపీ వృద్ధి పెరిగేందుకు రోడ్లు, ఓడరేవులు, విమానశ్రయాలు మొదలగు వాటిపై ప్రభుత్వం పెట్టుబడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన 3 షేర్లు రానున్న రోజుల్లో మల్టీ బ్యాగర్లుగా మారే అవకాశం ఉందని సూచించారు. 
1: అశోక్‌ లేలాండ్‌:- లైట్‌ కమర్షియల్‌ వెహికల్‌, ఎంసీవీ, బస్సు విభాగంలో కీలకంగా మారునుంది. అలాగే విమానశ్రయాల్లో, రక్షణ రంగలో ట్రక్కులు, ఈవీ బస్సులు విభాగం నుంచి కంపెనీ భారీ ఆర్డర్లు అందుకుంది. 
2. ఎల్‌ అండ్‌ టీ:- బలమైన ఆర్డర్ బుక్‌తో ఎలక్ట్రానికల్స్‌, హైడ్రో కార్బన్‌, పవర్‌ అండ్‌ ఎనర్జీ రంగాల్లో అగ్రగామిగా కొనసాగుతుంది. 
3. ఎన్‌బీసీసీ:- ప్రభుత్వరంగానికి చెందిన ఈ కంపెనీ ఇప్పటికే టైర్‌-1, టైర్‌-2, టైర్‌-3 పట్టణ నిర్మాణాల్లో విస్తృతంగా ఆర్డర్లను దక్కించుకుంది.You may be interested

జీవిత కనిష్ఠానికి జెట్‌ఎయిర్‌వేస్‌ షేరు

Tuesday 18th June 2019

జెట్‌ ఎయిర్‌ వేస్‌ మంగళవారం తీవ్రంగా నష్టపోయింది. ఇంట్రాడేలో 53 శాతం నష్టపోయి రూ. 32.25 జీవిత కాల కనిష్టానికి పడిపోయింది. ఈ షేరు గత 7రోజుల్లో  73శాతం నష్టపోయింది. అప్పులను రికవరి చేయడానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేషనల్‌ కం‍పెనీ లా ట్రెబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ముంబై బెం‍చ్‌లో దివాలా పిటిషన్‌ వేసిందనే వార్తల నేపథ్యంలో షేరు భారీగా పడిపోయింది.  లెండర్స్‌ కన్సార్టియం తరపున ఎస్‌బీఐ దివాలా పిటిషన్‌ను దాఖాలు

నిఫ్టీలో మరింత పతనానికి ఛాన్స్‌?!

Tuesday 18th June 2019

గత మూడు వారాల కనిష్ఠ స్థాయి 11,769ని బ్రేక్‌ చేస్తూ నిఫ్టీ ఈ వారం 1.25శాతం నష్టంతో 11,672 వద్ద మొదలైంది. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 11,450-11,500 వద్ద మద్దతు లభించనుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే నిఫ్టీ 11,655 వద్ద 20 రోజుల ఎక్స్‌పోనెన్సియల్‌ మూవింగ్‌ ఏవరేజి(ఈఎమ్‌ఏ)ని దాటేసిందని, ఇప్పుడు 50రోజుల ఈఎమ్‌ఏ కి చేరువలో ఉందని నిపుణులంటున్నారు. మే 20న వెలువడిన ఎక్సిట్‌ పోల్స్‌ తరువాత నిఫ్టీ 11,426

Most from this category