News


మెటల్‌ స్టాక్స్‌పై బుల్స్‌ పట్టు!

Monday 4th November 2019
Markets_main1572892166.png-29340

నిఫ్టీ మెటల్‌ సూచీ గరిష్ట స్థాయిని చేరొచ్చని, గత గరిష్ట స్థాయి రూ.2,576ను అధిగమించొచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ సీనియర్‌ వీపీ శ్రీకాంత్‌ చౌహాన్‌ అంచనా వేశారు. ‘‘ఆటో సూచీ మార్గంలోనే మెటల్‌ సూచీ కూడా కొనసాగుతుంటుంది. 2018లో గరిష్ట ‍స్థాయి నుంచి ఆటో ఇండెక్స్‌ 50 శాతం పడిపోయింది. అలాగే మెటల్‌ ఇండెక్స్‌ 4,200 నుంచి 2,100 స్థాయికి 50 శాతం పడిపోయింది. ఇటీవలి కనిష్ట స్థాయి నుంచి ఆటో సూచీ 27 శాతం లాభపడింది. కానీ, మెటల్‌ ఇండెక్స్‌ కనిష్ట స్థాయి నుంచి కేవలం 18 శాతమే పెరిగింది. ఫండమెంటల్‌గా, ఆర్థిక కోణంలోనూ ఈ రెండు రంగాలు అనుసంధానమై ఉన్నాయి. ఈ రెండు రంగాలు బోటమ్‌అవుట్‌ అయినట్టు ధృవీకరించడం సానుకూలం’’ అని శ్రీకాంత్‌ చౌహాన్‌ వివరించారు. ఈ నేపథ్యంలో మెటల్‌ ఇండెక్స్‌లో మూడు స్టాక్స్‌ను ఆయన సమీప కాలానికి సూచించారు.

 

టాటా స్టీల్‌
రూ.460 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.370. 2018 జనవరిలో రూ.756 స్థాయి నుంచి 2019 అక్టోబర్‌లో రూ.320 కనిష్ట స్థాయికి పడిపోయింది. మార్కెట్‌ విలువలో 57 శాతం కరిగిపోయింది. వీక్లీచార్ట్‌లో అధిక అమ్మకాల స్థాయికి చేరింది. డైలీ చార్ట్‌లో డబుల్‌బోటమ్‌ను ఏర్పరిచింది. ఇది రూ.450-460 వరకు సమీప కాలంలో ర్యాలీ చేయవచ్చు. ప్రస్తుత ధర వద్ద, రూ.385 వరకు కొనుగోలు చేసుకోవచ్చు. స్టాప్‌లాస్‌గా రూ.370ను పెట్టుకోవాలి.

 

వేదాంత లిమిటెడ్‌
రూ.180 లక్ష్యిత ధరతో కొనుగోలు చేసుకోవచ్చు. స్టాప్‌లాస్‌గా రూ.140ని అమలు చేసుకోవాలి. ఇన్వెస్టర్లను షాక్‌కు గురిచేసే ధోరణి ఈ స్టాక్‌కు ఉంది. ఈ స్టాక్‌ 20 నెలల కాలంలో తన గరిష్ట ధర రూ.355 నుంచి 2018-19లో రూ.125కు పడిపోయింది. అంటే 65 శాతం తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం ఇది స్థిరపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇది సానుకూలం. క్రితం ధోరణి నుంచి బయటపడుతుందనడానికి సంకేతం. ఈ స్టాక్‌ను రూ.155 నుంచి 150 వరకు కొనుగోలు చేసుకోవాలన్నది సూచన. టార్గెట్‌ ధర రూ.180. చివరి స్టాప్‌లాస్‌గా రూ.140 దిగువన పెట్టుకోవాలి. 

 

హిందాల్కో 
రూ.210 టార్గెట్‌తో కొనుగోలు చేసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.182. మెటల్స్‌ విభాగంలో స్థిరమైన స్టాక్‌ ఇది. రూ.284 గరిష్ట ధర నుంచి రూ.177 వరకు దిద్దుబాటుకు గురైంది. అంటే 38 శాతం నష్టపోయింది. డైలీ చార్ట్‌లో హయ్యర్‌ బోటమ్‌ రూ.180ను నమోదు చేసింది. ఇది ఈ స్టాక్‌ను రూ.210-215 వరకు సమీప కాలంలో నడిపించగలదు. చివరి స్టాప్‌లాస్‌గా రూ.180ను పెట్టుకోవాలి. 



You may be interested

హిృతిక్‌ స్టాక్స్‌ నుంచి మిడ్‌క్యాప్స్‌లోకి..

Tuesday 5th November 2019

హిృతిక్‌ స్టాక్స్‌ నుంచి పెట్టుబడులు మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లోకి మళ్లొచ్చని అంచనా వేస్తున్నట్టు ఇండియానివేష్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ హెడ్‌ వినయ్‌ పండిట్‌ తెలిపారు. మార్కెట్లకు సంబంధించి తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో ఆయన పంచుకున్నారు.    దీపావళికి నిఫ్టీ నూతన గరిష్టాలను తాకొచ్చన్న తమ అంచనాలకు అనుగుణంగానే మార్కెట్లు ర్యాలీ చేస్తున్నట్టు పండిట్‌ పేర్కొన్నారు. లార్జ్‌క్యాప్‌ కంపెనీల ఎర్నింగ్స్‌లో 15-18 శాతం వృద్ధి ఉందని, మార్కెట్‌ వ్యాప్త ర్యాలీకి ఇది ప్రేరణనిస్తుందన్నారు. మొదటి

మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ కొంటున్నాం...కొటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌

Monday 4th November 2019

‘సెంటిమెంట్‌, లిక్విడిటీ సానుకూలంగా ఉండడంతో మార్కెట్‌లు కదులుతుంటే, ఇన్వెస్టర్లు కొన్ని స్టాకులకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ప్రాథమిక అంశాలు వీటిపై ఎటువంటి ప్రభావం చూపనప్పటికి, మార్కెట్‌ కదలికల్లో భాగంగా ఇవి కదులుతుంటాయి’ అని కోటక్‌ ఏఎంసీ, సీఐఓ ఈక్విటీ, హర్ష ఉపాధ్యాయ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. స్వల్ప కాలం కోసం వద్దు.. కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గడంతో మార్కెట్‌లో లిక్విడిటీ, సెంటిమెంట్‌ మెరుగుపడింది. ప్రాథమిక అంశాలు

Most from this category