News


ఇన్‌ఫ్రాపై ఫోకస్‌.. ఈ కంపెనీలకు బోలెడు అవకాశాలు

Thursday 6th February 2020
Markets_main1580928293.png-31539

మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. నూతనంగా ఐదు స్మార్ట్‌ సిటీల అభివృద్ధి ప్రతిపాదనలకూ చోటిచ్చింది ప్రభుత్వం. ఈ ప్రతిపాదనలు ఆయా రంగాల్లోని కంపెనీలకు వ్యాపార అవకాశాలను తెచ్చిపెట్టేవే. ఈ నేపథ్యంలో మౌలికరంగం, స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులతో లాభపడే కంపెనీల వివరాలను పలు బ్రోకరేజీ సంస్థలు ప్రకటించాయి.

 

ఎల్‌అండ్‌టీ, అశోక బిల్డ్‌కాన్‌
సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఈ రెండు కంపెనీలకు అధిక వ్యాపార అవకాశాలు వచ్చిపడతాయని అంచనా వేస్తోంది.


రైట్స్‌, సీమెన్స్‌, అపోలోట్యూబ్స్‌
ఈ స్టాక్స్‌కు ఎస్‌ఎంసీ గ్లోబల్‌ ఓటు వేసింది. అటల్‌ మిషన్‌ ఫర్‌ రెజువెనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (అమృత్‌) పథకంకు కేటాయింపులు 40 శాతం పెరగడం, మెట్రో ప్రాజెక్టులకు రూ.17,842 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేసింది. పెరిగిన కేటాయింపులు అర్బన్‌ ఇన్‌ఫ్రా కంపెనీలకు, మెట్రో అర్బన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ కంపెనీలకు అవకాశాలు కల్పిస్తాయని పేర్కొంది.

 

హావెల్స్‌, క్రాంప్టన్‌
యాంటిక్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ వీటిని రికమండ్‌ చేసింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద బడ్జెట్లో కేటాయింపులను గతేడాదితో పోలిస్తే రూ.25,300 కోట్ల నుంచి రూ.27,500 కోట్లకు పెంచినట్టు గుర్తు చేసింది. అలాగే, గ్రామీణ విద్యుదీకరణ పథకానికి రూ.4,500 కోట్లు (11 శాతం అధికం), అమృత్‌ పథకానికి 40 శాతం పెంపు నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ కన్జ్యూమర్‌ ఉత్పత్తుల కంపెనీలైన హావెల్స్‌, క్రాంప్టన్‌గ్రీవ్స్‌ లాభపడతాయని అంచనా వేసింది.

 

పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌, ఎన్‌సీసీ, ఎల్‌అండ్‌టీ
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో హాస్పిటల్స్‌ ఏర్పాటుకు వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ను ప్రతిపాదించడం, నూతనంగా ఐదు స్మార్ట్‌సిటీలను రాష్ట్రాల భాగస్వామ్యంతో పీపీపీ నమూనాలో అభివృద్ధి చేసే ప్రతిపాదనలు.. ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌ ఇన్‌ఫ్రా, సీమెన్స్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌లకు లాభమని ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ తెలిపాయి.

 

ఎల్‌అండ్‌టీ, కేఈసీ ఇంటర్నేషనల్‌, బీఈఎల్‌
స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు ప్రతిపాదనలు వీటికి లాభిస్తాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. బీవోబీ క్యాపిటల్‌.. పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌, హెచ్‌జీ ఇన్‌ఫ్రా, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, అశోక బిల్డ్‌కాన్‌ పట్ల సానుకూలంగా ఉంది. ప్రభుదాస్‌లీలాధర్‌ సంస్థ ఏబీబీ, సీమెన్స్‌, అశోక బిల్డ్‌కాన్‌ను సిఫారసు చేసింది.You may be interested

నేడు నిఫ్టీ రెసిస్టెన్స్‌ @12140?!

Thursday 6th February 2020

నామమాత్ర లాభంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ బుధవారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్స్‌ ఆసియా మార్కెట్లలో జపాన్‌, చైనా జోరు  నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30  ప్రాంతం‍లో 2 పాయింట్ల నామమాత్ర లాభంతో 12,092 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,090 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే.

వొడాఫోన్‌ ఐడియా ఉంటేనే మంచిదంటున్న ఎయిర్‌టెల్‌

Thursday 6th February 2020

వొడాఫోన్‌ ఐడియా పరిస్థితి సంక్లిష్టంగానే ఉందంటూ వొడాఫోన్‌ గ్రూపు సీఈవో నిక్‌రీడ్‌ మరోసారి తాజాగా ప్రకటించగా.. వొడాఫోన్‌ ఐడియా కచ్చితంగా ఉండాల్సిన అవసరాన్ని పోటీ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ బలంగా వ్యక్తీకరించింది. ఎందుకన్నది కూడా ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్‌ విట్టల్‌ తెలిపారు. భారత టెలికం మార్కెట్లో మూడు సంస్థలు (ప్రయివేటు) ఉంటేనే మంచిదన్నది ఆయన విశ్లేషణ. దీనివల్ల పెట్టుబడులకు సానుకూలమని, ఉద్యోగాల నష్టం జరగదని వివరించారు. అలాగే, పరిశ్రమ ప్రతిష్టను

Most from this category