News


వ్యాపార విస్తరణపై భారీ ప్రణాళికలు

Saturday 12th October 2019
Markets_main1570820099.png-28833

వ్యాపార విస్తరణపై మూలధ వ్యయానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. కొన్ని కంపెనీలు తమ వ్యాపార విస్తరణ ప్రణాళికల వివరాలను వార్షిక నివేదికల్లో పేర్కొన్నాయి. వాటిల్లో ఏసీసీ, అంబుజా, ఏషియన్‌ పెయింట్స్‌, ఆస్ట్రల్‌ పాలీ, భారత్‌ ఫోర్జ్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, డీఎల్‌ఎఫ్‌, ఐచర్‌ మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, హీరో మోటోకార్ప్‌, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎంఅండ్‌ఎం, హావెల్స్‌, సుప్రీమ్‌ ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌, వోల్టాస్‌ ఇండియా ఉన్నాయి.  

 

వీటిని కొనుగోలు చేయవచ్చా..?
మూలధన వ్యయ ప్రణాళికలు లేదా ఓ కంపెనీ సామర్థ్య వినియోగం అన్నవి ఆ కంపెనీ వృద్ధి అవకాశాలను తెలియజేస్తాయి. భవిష్యత్తు వృద్ధి అవకాశాల దృష్ట్యా మూలధన వ్యయ ప్రణాళికలతో ఉన్న కంపెనీలపై దృష్టి సారించొచ్చని ఆనంద్‌రాఠి షేర్స్‌ అండ్‌ బ్రోకర్స్‌ ఈక్విటీ రీసెర్చ్‌ ఏవీపీ నరేంద్ర సోలంకి తెలిపారు. ‘‘ఎంఅంఎం, ఐచర్‌, హీరో మోటోకార్ప్‌ అన్నవి ప్రభుత్వ ఎలక్ట్రిక్‌ వాహన ప్రోత్సాహక విధానాల నేపథ్యంలో మూలధన వ్యయ ప్రణాళికలను ప్రకటించాయి. అలాగే, అంబుజా సిమెంట్‌, ఐటీసీ, బ్రిటానియా, ఏసీసీ కూడా సామర్థ్య విస్తరణపై ప్రణాళికలతో ఉన్నాయి. కానీ వీటి ఉత్పత్తులకు డిమాండ్‌ అంతగా లేనందున లాభదాయక పెరిగేందుకు అవకాశం లేదు’’ అని ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ ఫండమెంటల్‌ అనలిస్ట్‌ ఫోరమ్‌ పారిఖ్‌ పేర్కొన్నారు. ఈ జాబితాలోని ఏషియన్‌ పెయింట్స్‌ పెట్టుబడులకు విలువైనదిగా పారిఖ్‌ అభిప్రాయపడ్డారు.  

 

ఇతర అంశాలు..
మూలధన వ్యయాలన్నవి కంపెనీ వృద్ధి ప్రణాళికలను తెలియజేస్తాయి. అయితే, అదే సమయంలో ఆ కంపెనీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను కూడా చూడాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఉత్పత్తులకు తగినంత డిమాండ్‌ లేకుండా, నిధులు ఉన్నాయని విస్తరణకు వెళితే అది కంపెనీ లాభాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ‘‘ఇన్వెస్టర్లు ఓ కంపెనీ గత ఐదేళ్ల కాల పనితీరును పరిశీలించాలి. మందగమనంలో యాజమాన్యం ఎంత సమర్థవంతంగా వ్యవహరించిందీ చూడాలి’’ అని పారిఖ్‌ సూచించారు. ఆర్‌వోఈ, ఆర్‌వోసీఈ వంటి ఇతర అంశాలను కూడా చూసిన తర్వాత పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. You may be interested

మెప్పించిన ఇన్ఫీ!

Saturday 12th October 2019

- క్యూ2లో లాభం రూ. 4,019 కోట్లు, 2.2 శాతం తగ్గుదల - సీక్వెన్షియల్‌గా మాత్రం 6 శాతం అప్‌... - ఆదాయం గైడెన్స్‌ పెంపు - రూ. 8 మధ్యంతర డివిడెండు - షేరు 4 శాతం జంప్‌... న్యూఢిల్లీ/బెంగళూరు: దేశీయంగా రెండో అతి పెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌.. మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం వెల్లడైన గణాంకాల ప్రకారం నికర లాభం స్వల్పంగా 2.2 శాతం

మధ్య స్థాయి వినియోగ స్టాక్స్‌ ర్యాలీ!

Saturday 12th October 2019

పండుగల డిమాండ్‌ నేపథ్యంలో మధ్య స్థాయి వినియోగ కంపెనీల షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. గత నెల రోజుల కాలంలో 11 మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ నూతన గరిష్టాలను నమోదు చేయగా, ఇందులో ఆరు స్టాక్స్‌ వినియోగ రంగాలకు చెందినవే కావడం గమనార్హం. అవి వర్ల్‌పూల్‌ ఇండియా, బెర్జర్‌ పెయింట్స్‌, వోల్టాస్‌, పీఅండ్‌జీ హైజీన్‌, కోల్గేట్‌ పామోలివ్‌, గ్లాక్సోస్మిత్‌ క్లెయిన్‌ కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌.    ఈ ఏడాది వర్ల్‌పూల్‌ ఇండియా షేరు ఇప్పటి వరకు 47

Most from this category