News


ఎన్‌ఎస్‌ఈ ఎఫ్‌అండ్‌వోలో త్వరలో వీటికి చోటు?

Wednesday 6th November 2019
Markets_main1572981386.png-29374

ఎన్‌ఎస్‌ఈ వచ్చే ఫిబ్రవరిలో చేపట్టే సవరణలో కొత్త వాటికి చోటు కల్పించే అవకాశం ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ అంచనా వేస్తోంది. ఎందుకంటే ఎన్‌ఎస్‌ఈపై సెబీ విధించిన ఆరు నెలల నిషేధం అక్టోబర్‌తో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే సవరణలో సుమారు 10 నుంచి 14 సెక్యూరిటీలను ఎఫ్‌అండ్‌వోలో చేర్చొచ్చని ఎడెల్‌వీజ్‌ రీసెర్చ్‌, ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ అంచనా వేస్తున్నాయి. 

 

వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎఫ్‌అండ్‌వోలో ఎన్‌ఎస్‌ఈ కొత్తగా ఏ సెక్యూరిటీని చేర్చలేదు. పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎంఫసిస్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌లను ఎఫ్‌అండ్‌వోలో చేర్చనున్నట్టు ఈ ఏడాది ఏప్రిల్‌ 30న ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. కానీ, ఈ సర్క్యులర్‌ను తిరిగి మే 29న ఉపసంహరించుకుంది. ‘‘రానున్న నిఫ్టీ సూచీ సవరణ అన్నది ఎఫ్‌అండ్‌వో విభాగంలో కొన్ని స్టాక్స్‌ చేర్చడానికి సంకేతం కానుంది. ఎఫ్‌అండ్‌వోలో లేని స్టాక్స్‌ను నిఫ్టీలో చేర్చడానికి వీలుండకపోవచ్చు. నిఫ్టీ సూచీ పునర్‌వ్యవస్థీకరణ వచ్చే ఫిబ్రవరిలో ఉంటుంది. దీంతో ఎఫ్‌అండ్‌వోలో నూతన స్టాక్స్‌ చేరికపై ప్రకటన ఈ సంవత్సరంలోనే ఉంటుందని అంచనా వేస్తున్నాం’’అని ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ తెలిపింది. 

 

ఎఫ్‌అండ్‌వోలో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌, బంధన్‌ బ్యాంకు, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఇన్ఫో ఎడ్జ్‌, ఒబెరాయ్‌ రియాలిటీ, రిలయన్స్‌ నిప్పన్‌ను చేర్చొచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్‌ అంచనా వేసింది. ఇక ఎడెల్‌వీజ్‌ రీసెర్చ్‌ మాత్రం.. బంధన్‌ బ్యాంకు, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌, ఎడెల్‌వీజ్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ఇన్సూరెన్స్‌, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌, జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌, ఇన్ఫో ఎడ్స్‌, ఒబెరాయ్‌ రియాలిటీ, పీఎన్‌బీ హౌసింగ్‌, రిలయన్స్‌ నిప్పన్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లను ఎఫ్‌అండ్‌వోలో చేర్చే అవకాశం ఉన్నవిగా తెలిపింది. 



You may be interested

అక్టోబర్‌లోనూ ‘సేవలు’ బాగోలేదు!

Wednesday 6th November 2019

న్యూఢిల్లీ: దేశంలో మందగమన పరిస్థితులకు సేవల రంగం అద్దం పడుతోంది. అక్టోబర్‌లో వరుసగా రెండవనెలా ఈ విభాగం క్షీణతను నమోదుచేసుకుందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ పేర్కొంది. 49.2గా సూచీ నమోదయ్యిందని సంబంధిత నివేదిక తెలిపింది. సెప్టెంబర్‌లోనూ సేవల రంగం క్షీణతనే (48.7) నమోదుచేసుకుంది. అయితే సెప్టెంబర్‌కన్నా అక్టోబర్‌లో పరిస్థితి కొంత మెరుగుపడ్డం కొంత సానుకూల అంశం. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ

నిఫ్టీలో తక్కువ వెయిటేజీ ఉ‍న్న వాటిపై ఫోకస్‌

Wednesday 6th November 2019

నిఫ్టీ-50 సూచీలో ఉన్న 50 స్టాక్స్‌లో తక్కువ వెయిటేజీ కలిగిన స్టాక్స్‌పై మ్యూచువల్‌ ఫండ్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో దృష్టి పెట్టినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే నిఫ్టీలోని 17 స్టా‍క్స్‌లో దేశీయ ఇనిస్ట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (డీఐఐలు) సెప్టెంబర్‌ క్వార్టర్లో కనీసం ఒక శాతం అంతకంటే ఎక్కువే తమ వాటాను పెంచుకున్నారు. వీటిల్లో 14 స్టాక్స్‌ నిఫ్టీ రాబడుల కంటే వెనుకబడి ఉండడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే నిఫ్టీలో అధిక వెయిటేజీ  స్టాక్స్‌

Most from this category