News


డిస్కౌంట్‌లో 12 స్టాకులు .. కొనవచ్చా..?

Wednesday 21st August 2019
Markets_main1566385411.png-27925

ఇటీవల బెంచ్‌మార్క్‌ సూచీలు దిద్దుబాటుకు లోనైనప్పటికీ.., వాటి చరిత్రాత్మక యావరేజ్‌ స్థాయిల వద్ద కొద్ది ప్రీమియంతో ట్రేడ్‌ అవుతున్నాయి. అయితే సూచీల చారిత్రాత్మక యావేరేజ్‌లో పోలిస్తే చాలా షేర్లు ఆకర్షణీయమైన వాల్యూవేషన్‌ వద్ద దొరుకుతున్నాయి. నిఫ్టీ-50లోని 12 కంపెనీల షేర్లు వాటి ఐదేళ్ల పీఈ యావరేజ్‌ పోలిస్తే డిస్కౌంట్‌తో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇలా ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉన్న స్టాకుల్లో సన్‌ఫార్మా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా స్టీల్‌, ఐషర్‌ మోటర్స్‌, ఎంఅండ్‌ఎం, గెయిల్‌ షేర్లులున్నాయి.  సాధారణంగా ఇన్వెస్టర్లు  పీఈ విలువ తక్కువ ఉన్న కంపెనీల షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుంటారు. అంతర్గత విలువతో పోలిస్తే ఆకర్షణీయమైన స్థాయిలో ట్రేడయ్యే స్టాక్‌లను కొనుగోలు చేయడం  కొద్దికాలం తరువాత లాభాలను ఆర్జించడటం అనేది ఇన్వెస్ట్‌మెంట్‌ గోల్డెన్‌ నియమాల్లో ఒకటి. ఆకర్షణీయమైన స్టాక్‌లను షార్ట్‌లిస్ట్‌ చేయడానికి ఈ నిబంధన ఉపయోగించమని నిపుణులు సలహా ఇస్తారు. కానీ దీంతోపాటు కంపెనీ ఫండమెంటల్స్‌, డిమాండ్ దృష్టాంతంలో బాహ్య వాతావరణం యొక్క ప్రభావం పరిగణలోకి తీసుకోని స్టాక్స్‌ను ఎన్నుకోవాలి హెచ్చరిస్తున్నారు. ‘‘ఐదేళ్ల చారిత్రాత్మక యావరేజ్‌ పీ/ఈ స్థాయి అనేది చాలా ముఖ్యమైందే. అయితే ప్రమాదకరమైన పరిస్థితులకు దూరంగా ఉండటంతో పాటు, కంపెనీ ఫండమెంటల్స్‌ పరిశీలించి కొనుగోలు చేయలి’’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ ప్రతినిధి అజిత్‌ మిశ్రా తెలిపారు.You may be interested

గురువారం వార్తల్లో షేర్లు

Thursday 22nd August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- ఫిడిలిటి మేనేజ్‌మెంట్‌ కంపెనీలో  వాటాను విక్రయించాలని యోచిస్తోంది.బుక్‌ సైజ్‌ 200 మిలియన్‌ డాలర్లుగా ఉంది.  కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌:- కంపెనీలో వాటా కొనుగోలుకు ఐటీసీ ఆసక్తి చూపుతుందనే వార్తలను ఖండించింది.  ఎన్‌ఎండీసీ:- ప్రతి టన్ను లూప్‌, ఫైన్స్‌ ఐరన్‌ ఓర్‌ ధరలపై రూ.200లను తగ్గించింది. ఆగస్ట్‌ 20 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.  హెచ్‌పీసీఎల్‌:- వ్యాపార విస్తరణలో భాగంగా కంపెనీ

బాటమ్‌ ఔట్‌కు ఇంకో 2-3 నెలలు పడుతుంది

Wednesday 21st August 2019

మార్కెట్‌ బాటమ్‌ ఔట్‌ కావడానికి ఇంకో రెండు,మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని క్వాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సందీప్ టాండన్ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...   అసాధరణంగా పెరిగిన షార్ట్‌ పొజిషన్‌లు.. విస్తృత మార్కెట్ దృక్పథంలో పరిశీలిస్తే..కొంత మొత్తంలో అసాధారణమైన షార్ట్‌పొజిషన్‌లు గమనించవచ్చు. రిలయన్స్‌ ర్యాలీ చేయడం చూశాం. అదేవిధంగా కొన్ని ఆటో షేర్లు కూడా. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్‌లలో ఐదేళ్ళలో

Most from this category