News


బాగా పడిన ఈ స్టాక్స్‌లో ఏవి నయం?

Tuesday 14th January 2020
Markets_main1579024002.png-30929

గతేడాది మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో చాలా వరకు ఇన్వెస్టర్ల పెట్టుబడులను హరించివేసినవే. గత నెల రోజులుగా ఈ విభాగాల్లోని ‍స్టాక్స్‌లో కదలిక వచ్చింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, ‍స్మాల్‌క్యాప్‌లో 14 స్టాక్స్‌ వాటి ఏడాది గరిష్ట ధరల నుంచి 30-73 శాతం వరకు నష్టపోయాయి. ఆ స్టాక్స్‌ ఏవి, వాటిల్లో పెట్టుబడులను పరిశీలించొచ్చా..? అన్నదానిపై నిపుణుల అభిప్రాయాలను చూద్దాం..

 

52 వారాల గరిష్ట స్థాయిల నుంచి హెచ్‌ఈజీ షేరు 73 శాతం తక్కువలో ట్రేడవుతోంది. నేషనల్‌ పెరాక్సైడ్‌ 60 శాతం, లక్ష్మీ మెషిన్‌ వర్క్స్‌ 48 శాతం, వీమార్ట్‌ రిటైల్‌ 42 శాతం, సుందరం క్లేటన్‌ 42 శాతం, బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ 39 శాతం, వెంకీస్‌ ఇండియా 37 శాతం, ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ 34 శాతం, పిలాని ఇన్వెస్ట్‌మెంట్‌ 34 శాతం, టీవీఎస్‌ శ్రీచక్ర 33 శాతం, జేఎస్‌డబ్ల్యూ హోల్డింగ్స్‌ 32 శాతం వరకు క్షీణించాయి. గడిచిన ఏడాదిన్నర కాలంలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు గణనీయంగా దిద్దుబాటుకు గురైనందున 2020లో ఇవి మంచి ర్యాలీ చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, బాగా దిద్దుబాటుకు గురైన అన్ని స్టాక్స్‌ కొనుగోళ్లకు అనువైనవిగా భావించొద్దని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న, మధ్య స్థాయి కంపెనీలు ఎన్నో కారణాల వల్ల నష్టపోయాయని.. కొన్ని అంతర్జాతీయ మందగమనం, వాణిజ్య ఉద్రిక్తతల వల్ల నష్టపోతే, మరికొన్నింటి క్షీణతకు దేశీయ ఆర్థిక రంగం క్షీణించడం కారణంగా పేర్కొంటున్నారు. 

 

‘‘హెచ్‌ఈజీ, గ్రాఫైట్‌ ఇండియా కంపెనీల వ్యాపారంపై అంతర్జాతీయ మందగమన ప్రభావం ఉంది. అలాగే, గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్‌ ధరలు తగ్గడం, వాటి ముడి సరుకుల ధరలు పెరగడం అనే రెండు రకాల ప్రభావం వాటిపై పడింది. ఆటో పరిశ్రమలో మందగమనం ఆటో విడిభాగాల కంపెనీలైన టీవీఎస్‌ శ్రీచక్ర, సుందరం క్లేటన్‌పై చూపించింది. దేశీయ టెక్స్‌టైల్‌ పరిశ్రమలో నూతన మెషిన్లకు తగినంత డిమాండ్‌ లేకపోవడం లక్ష్మీ మెషిన్‌ వర్క్స్‌పై ప్రభావం చూపించింది’’ అని ఆషికా స్టాక్‌ బ్రోకింగ్‌ ఈక్విటీ రీసెర్చ్‌ ప్రెసిడెంట్‌ పరాస్‌ బోత్రా తెలిపారు. హెచ్‌ఈజీ స్టాక్‌ను ప్రస్తుత ధరలో కొనుగోలు చేసుకోవచ్చని, ఇక్కడి నుంచి 15-20 శాతం పెరిగేందుకు అవకాశం ఉంటుందని క్యాపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ గౌరవ్‌గార్గ్‌ సూచించారు. అలాగే, దిగుమతులపై విధించిన సుంకాలు నేషనల్‌ పెరాక్సైడ్‌ కంపెనీకి చౌక ఉత్పత్తుల నుంచి రక్షణ ఉంటుందని, రూ.2,100 టార్గెట్‌తో కొనుగోలు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే, రూ.3,900 టార్గెట్‌తో లక్ష్మీ మెషిన్‌ వర్క్స్‌ను కూడా సూచించారు. వీమార్ట్‌ రిటైల్‌, బ్లూడార్ట్‌, ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ, పిలాని, టీవీఎస్‌ శ్రీచక్ర, జేఎస్‌డబ్ల్యూ హోల్డింగ్‌, ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను కొనుగోలు చేయకపోవడమే సూచనీయమన్నారు.You may be interested

నేడు ప్రతికూల ఓపెనింగ్‌?

Wednesday 15th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 33 పాయింట్లు మైనస్‌ నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రతికూలం(నెగిటివ్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నేటి ఉదయం 8.30 ప్రాంతం‍లో 33  పాయింట్ల క్షీణించి 12,361 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,394 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. కాగా.. చైనాతో వాణిజ్య వివాద పరిష్కార డీల్‌

‘విస్తృత భాగస్వామ్యంతోనే ర్యాలీ’

Tuesday 14th January 2020

బాగా క్షీణించిన స్టాక్స్‌ మళ్లీ ఈ ధరల్లో లభించవేమోనన్న భయం (ఫోమో)తో వినియోగ రంగంలోని స్టాక్స్‌ కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఆరాట పడుతుండొచ్చని క్యాపిటల్‌మైండ్‌ వ్యవస్థాపకుడు దీపక్‌షెనాయ్‌ అభిప్రాయపడ్డారు. చాలా స్టాక్స్‌ ఇప్పటికీ ర్యాలీ మొదలు పెట్టాల్సి ఉందన్నారు. మార్కెట్‌ ర్యాలీ అర్థవంతంగా ఉండాలంటే అది విస్తృత భాగస్వామ్యంతో ఉండాలన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన అభిప్రాయాలు తెలియజేశారు.    ప్రైవేటు బ్యాంకుల్లో వీటికి ప్రాధాన్యం.. సిటీ యూనియన్‌ బ్యాంకు,

Most from this category