మార్కెట్లు ఇంకా నష్టపోవొచ్చు: కునాల్ బోత్రా
By Sakshi

మార్కెట్లో జోరుగా సంస్థాగత విక్రయాలు జరుగుతున్నట్లు అమ్మకాల సరళిని చూస్తే అర్థమవుతోందని ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో మార్కెట్ విశ్లేషకుడు కునాల్ బోత్రా చెప్పారు. ఇంటర్యూలోని ముఖ్యమైన విషయాలు ఆయన మాటల్లోనే.... అంతర్జాతీయ భాగస్వామ్యం మన మార్కెట్లకు ముఖ్యమని గత కొన్ని సెషన్లను గమనిస్తే అర్దమవుతుంది. విదేశి ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపితే దేశియ ఇన్వెస్టర్లు కూడా వారితో జత కట్టారు. ఇలా అయితే మార్కెట్లలో సమతూకం ఎలా వస్తుంది? దీంతోపాటు మార్కెట్లను ఇబ్బందిపెట్టే ఇంకో అంశం అంతర్గతంగా మార్కెట్లు బలహీనంగా ఉండడం. లార్జ్‌క్యాప్స్ పడిపోవడంతో ఇప్పటికీ స్టాక్స్‌లలో సంస్థాగత అమ్మకాలు ఎక్కువగా వున్నట్లు అర్థమవుతోంది. ఇది కేవలం రిటైల్ ఆధారిత అమ్మకం మాత్రమే కాదు, ఎందుకంటే మిడ్‌క్యాప్ స్టాక్స్‌తో పాటు లార్జ్‌క్యాప్‌లు కూడా నష్టాపోయాయి. సాంకేతిక స్థాయిల పరంగా నిఫ్టీ కొన్ని కీలక మద్దతులను కోల్పోయింది. అందువల్ల మార్కెట్ల అంతర్గత అంశాలు కూడా మెరుగుపడలేదని తెలుస్తోంది. ఈ సంకేతాలన్నీ గమనిస్తే మార్కెట్ సూచీలు ఇంకా నష్టపోనున్నాయని అనిపిస్తోంది. స్వల్పకాలిక కదలికలను అంచనా వేసీ ఇన్వెస్ట్ చేయడం కంటే మీడియం-టర్మ్ లో ఉండే డౌన్‌ట్రెండ్‌ను చూసి మార్కెట్లలో పాల్గొనడం ముఖ్యం.
శుక్రవారం మాత్రమే కాకుండా గత వారం మొత్తం మార్కెట్లు అస్థిరంగానే కదిలాయి. అందువలన మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో గ్యాప్ అప్‌తో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇండిగో స్టాక్ బాగా ప్రదర్శన చేసింది. అంతేకాకుండా ఫలితాలు బాగుండడంతో ఈ షేరు విలువ తదుపరి లక్ష్యమైన రూ.1,590-1.600 స్థాయిని చేరుకోవచ్చు. ధరల సరళి, వాల్యూమ్ల పరంగా కొన్ని పీఎస్‌యూలు శుక్రవారం తిరిగి పుంజుకోవడం గమనించాం. పవర్ గ్రిడ్ రికవరి బాటలో ఉండవచ్చు. మార్కెట్ కొంచెం అస్థిరతలో కొనసాగితే పవర్ గ్రిడ్ షేర్లను కొనుగోలు చేయవచ్చు. దీనికి ‘బై’ కాల్నిస్తు దీని టార్గెట్ ధర రూ .212గా, స్టాప్ లాస్ రూ .202 గా నిర్ణయించాం. అపోలో టైర్స్ షేరు విలువ గత రెండు వారాలుగా లేదా నెలలుగా బేరిష్‌లోనే ఉంది. ఇంకా ఈ స్టాక్ నష్టపోయే అవకాశం ఉండడంతో ఈ స్టాకును ‘సెల్’ కాల్నిస్తు టార్గెట్ ధరను రూ.165గా, స్టాప్ లాస్‌ను రూ.180 గా నిర్ణయించాం.
You may be interested
బేరిష్ దశలోకి మార్కెట్లు: ఉమేష్ మెహతా
Sunday 21st July 2019కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎఫ్‌పీఐలకు పన్ను మినహాయింపు లేదంటూ చేసిన ప్రకటన, బలహీన రుతుపవనాలు మార్కెట్ల నష్టాలకు కారణమని, ఈ పరిణామాలతో మార్కెట్లు బేరిష్ దశలోకి అడుగుపెట్టినట్టు శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల్లో బలహీనత, క్షేత్రస్థాయిలో మందగమనం మార్కెట్లను కనిష్టాలకు తీసుకెళ్లాయన్నారు. ఇప్పటికీ స్టాక్స్ విలువలు గరిష్టాల్లోనే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కంపెనీల ఫలితాల సీజన్ తారా స్థాయికి చేరిందని,
ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్ సేవల నిలిపివేత
Saturday 20th July 2019ఆదిత్య బిర్లా పేమెంట్స్ బ్యాంక్ తన సేవలు నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వినియోగదారులు తన ఖాతాల్లో ఏమైనా నగదు నిల్వలున్నట్లైతే, జూలై 26వ తేదిలోగా విత్‌డ్రా చేసుకోవాల్సిందిగా కోరింది. నగదు విత్‌డ్రా, బదిలీలు చేసుకునేందుకు ఆన్లైన్, మొబైల్ బ్యాంక్, లేదా దగ్గరలోని బ్యాంక్ పాయింట్లలో సౌకర్యం కల్పించినట్లు తెలిపింది. ఈ అంశంపై వినియోగదారుల ఏదైనా సమస్యలు, సందేహాల నివృత్తి కొరకు 18002092265 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. వ్యాపార