News


నిఫ్టీ విలువ ఇంకా ఎక్కువే: ఎమ్‌కే గ్లోబల్‌

Wednesday 7th August 2019
Markets_main1565160591.png-27604

ఇన్సిస్టీట్యూషనల్‌ క్లయింట్‌ గ్రూప్‌ సీఈఓ సువీర్ చినాని, ఈక్విటీ స్ట్రాటజిస్ట్ హెడ్, ఎమ్‌కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ అండ్ రీసెర్చ్ సునీల్ తిరుమలై ఓ ఆంగ్ల చానెల్‌తో  మార్కెట్‌పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 
  మొత్తం ప్రాతిపదికన, వాల్యుషన్లు ఇప్పటికీ ఆకర్షణీయంగా లేకపోవడంతో ఫండ్స్‌లో నగదు స్థాయిలు పెరుగుతున్నాయని, ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నారని చినాని అన్నారు. తిరుమలై మాట్లాడుతూ..ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే కార్పోరేట్‌ ఆదాయాలలో ఎక్కువ డౌన్‌గ్రేడ్‌లు జరిగిన విషయం అర్థమవుతుందన్నారు. ‘నిఫ్టీ స్టాక్స్ ఆదాయ వృద్ధి 5.5-6 శాతంగా ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. ఆర్థిక సంవత్సరం 19 నుంచి ఆర్థిక సంవత్సరం 20 మధ్య కాలాన్ని గమనిస్తే, నిఫ్టీ ఆదాయవృద్ధిలో టాటా మోటార్స్, ఎస్‌బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్స్‌ మూడింట రెండొంతుల వాటాను కలిగి ఉంటాయని అంచనా’ అని ఆయన వివరించారు. నిఫ్టీ విలువ ఇప్పటికి అధికంగా ఉందని తెలిపారు. 
  తమ ఆల్ఫా పోర్ట్‌ఫోలియోలో ఎస్‌బీఐ లైఫ్‌ను ఐసిఐసిఐ ప్రూ లైఫ్‌తో భర్తీ చేశామని, కానీ ఎస్‌బీఐ లైఫ్‌ను మాత్రం ఇప్పటికీ నిఫ్టీ పోర్ట్‌ఫోలియో సిఫారసుగా ఉంచామని చినాని తెలిపారు. అంతేకాకుండా బజాజ్ ఫైనాన్స్‌పై ‘ఈక్వల్‌ వెయిట్‌’ రేటింగ్‌తో ఉన్నామని వివరించారు. తిరుమలై మాట్లాడుతు..తమ పోర్ట్‌ఫోలియోలో ఆటో స్టాక్సు ‘అతి తక్కువ వెయిటేజి’ తో ఉన్నాయని, అయితే మహీంద్రా అండ్‌ మహీంద్రా స్టాకుపై సానుకూలంగా ఉన్నామని, ఆటో సెక్టార్లో డిమాండ్ వెంటనే పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫార్మా రంగంలో సిప్లా, ఐపీసీఏ, దివిస్‌లపై ‘ఓవర్‌ వెయిట్‌’ కలిగి ఉన్నామని, ఈ రంగంలో డాక్టర్ రెడ్డీస్‌పై ‘టాప్‌ సెల్‌’ కాల్‌ను కలిగి ఉన్నామని తెలిపారు. 



You may be interested

బీమా స్టాకులపై ఎఫ్‌పీఐల మక్కువ

Wednesday 7th August 2019

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గత కొద్దిరోజులుగా దేశీయ ఈక్విటీల్లో అమ్మకాలకు దిగారు. కానీ దీర్ఘకాలిక పెట్టుబడులకు మొగ్గు చూపే ఎఫ్‌పీఐలు మాత్రం ఇదే సమయంలో దేశీయ బీమారంగంపై మక్కువగా ఉన్నారు. ముఖ్యంగా గత ఏడాదిన్నరగా ఎఫ్‌పీఐల నిర్మాణాత్మక ఆలోచనాదోరణిలో మార్పు వచ్చింది. బీమారంగ విస్తరణకు భూరీ అవకాశం ఉన్నట్లు ఎఫ్‌పీఐలు గమనించాయి. మరోవైపు పలు బ్లూచిప్‌కంపెనీల్లో ఎఫ్‌పీఐల వాటాలు కిక్కిరిసినందున కొత్తగా బీమారంగంపై వీటి కన్నుపడింది. ఇప్పటికే దేశీయ బీమా

రెపోరేట్‌ 35 బీపీఎస్‌ తగ్గించిన ఆర్‌బీఐ

Wednesday 7th August 2019

లిక్విడిటీ పెంచడమే లక్ష్యం ద్వైమాసిక సమీక్షా సమావేశంలో భాగంగా రెపోరేట్‌ను 35 బీపీఎస్‌ మేర తగ్గిస్తున్నట్లు రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఆరుగురు సభ్యులతో కూడిన మానిటర్‌ పాలసీ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో రెపోరేట్‌  5.40 శాతానికి దిగివచ్చింది. ఆర్బీఐ పెట్టుకున్న దీర్ఘకాలిక ద్రవ్యోల్బణ టార్గెట్‌కు దిగువనే నిజ ద్రవ్యోల్బణం కదలాడుతుండడంతో రేట్‌కట్‌కు ఆర్‌బీఐకి మార్గం సుగమమైంది. మార్కెట్‌ వర్గాలు 25 బీపీఎస్‌ రేట్‌కట్‌ ఉండొచ్చని అంచనా వేశాయి. గత

Most from this category