News


ఎల్‌ఐసీ పోర్టుపోలియోలో రాణించిన స్టాకులివే!

Wednesday 4th September 2019
Markets_main1567594627.png-28192

గత కొన్ని సెషన్‌ల నుంచి దేశియ మార్కెట్లో పెరుగుతున్న అమ్మకాల ఒత్తిడి వలన దేశియంగా అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్‌యిన లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) పోర్టుపోలియోలోని 80 శాతానికి పైగా స్టాకులు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. కానీ ప్రస్తుత బేరిష్‌  మార్కెట్‌ దృక్పథాన్ని తట్టుకొని కూడా ఎల్‌ఐసీ పోర్టుపోలియోలో కొన్ని స్టాకులు అద్భుత పదర్శనను చేశాయి. 
   ఈ పోర్టుపోలియోలో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ) అయిన షిప్‌బిల్డింగ్‌ సంస్థ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డింగ్‌ అండ్‌ ఇంజనీర్స్‌ అత్యధిక లాభం పొందిన స్టాకులలో ముందుంది. ఈ కంపెనీ స్టాకు ఇప్పటివరకు 46 శాతం రిటర్నులను ఇవ్వడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 1 న రూ .91.40 నుంచి దగ్గరున్న ఈ కంపెనీ స్టాకు విలువ ఆగస్టు 30 నాటికి రూ .133.30 కు పెరిగింది. కాగా ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 0.85 శాతం మాత్రమే పెరగగా, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ 14 శాతం, మిడ్‌ క్యాప్‌ 16 శాతం పడిపోవడం గమనార్హం. ప్రధానంగా ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకానిర్మాణ అవసరాలను తీర్చే ఈ సంస్థ, జూన్‌ త్రైమాసికానికి సంబంధించి ఏడాది ప్రాతిపదికన 223 శాతం నికర లాభాన్ని(రూ. 25.30 కోట్లను) నమోదుచేసింది. ఎల్‌ఐసీతో పాటు సీనియర్‌ ఇన్వెస్టర్‌ రమేష్ దమాని, మ్యూచువల్ ఫండ్ హౌస్‌లయిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్లు జూన్ 30 నాటికి  గార్డెన్‌ రీచ్‌లో వాటాలను కలిగి ఉన్నాయి. ఈ కంపెనీలో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్‌కు 6.56 శాతం వాటా ఉండగా, రిలయన్స్ క్యాపిటల్ ట్రస్టీకి 4.11 శాతం, రిలయన్స్ స్మాల్‌క్యాప్ ఫండ్ 1.87 శాతం వాటాలున్నాయి. 
   ఎల్ఐసీ పోర్ట్‌ఫోలియోలో బాటా ఇండియా (37 శాతం), ప్రొక్టర్ అండ్‌ గ్యాంబుల్ హెల్త్ (30 శాతం), హైడెల్బర్గ్ సిమెంట్ (29 శాతం), గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ (25 శాతం) షేర్లుకూడా మంచి ప్రదర్శన చేసిన షేర్లలో ఉన్నాయి. ఐసీఐసీఐ డైరక్ట్‌ బ్రోకరేజీ ఆగస్టులో బాటా ఇండియా స్టాకుపై రూ. 1,585 టార్గెట్‌ ధరను నిర్ణయించి. ‘కొనుగోలు’ రేటింగ్‌ను ఇచ్చింది. కాగా ఈ స్టాకుల సెప్టెంబర్ 3 సెషన్‌లో రూ. 1,539 వద్ద ట్రేడయిన విషయం గమనార్హం. పిడిలైట్ ఇండస్ట్రీస్ (25 శాతం), ఇంద్రప్రస్థ గ్యాస్ (24 శాతం), రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌ (23 శాతం), ఇన్ఫోసిస్ (23 శాతం), జైడస్ వెల్నెస్ (21 శాతం)  షేర్లు కూడా ఎల్‌ఐసీ పోర్ట్‌ఫోలియోలో టాప్ 10 లాభాలిచ్చిన స్టాకులలో ఉన్నాయి. 
ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పిడిలైట్ ఇండస్ట్రీస్‌ స్టాకుకు ‘అమ్మకం’ రేటింగ్‌ను ఇవ్వగా, ఇది ఆగస్టు 27 న 52 వారాల గరిష్ట స్థాయి రూ. 1,399.80 చేరుకోవడం గమనార్హం. 2019 జూన్ నాటికి ఎల్ఐసీ తన పోర్ట్‌ఫోలియోలో 350 కి పైగా కంపెనీలను కలిగి ఉంది. 
    ఈ ఈ పోర్ట్‌ఫోలియోలో కాక్స్‌ అండ్‌ కింగ్స్ (97 శాతం), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (94 శాతం), రిలయన్స్ నావల్ (93 శాతం), రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (88 శాతం), బల్లార్పూర్ ఇండస్ట్రీస్ (87 శాతం), రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (86 శాతం), జెట్ ఎయిర్‌వేస్ (86 శాతం) షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్లలో ముందున్నాయి. You may be interested

సగం మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు బాలేదు...!

Wednesday 4th September 2019

యాక్టివ్‌ నిర్వహణతో కూడిన 228 ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో 45 శాతం పథకాల రాబడులు... వాటి బెంచ్‌ మార్క్‌తో పోలిస్తే ఐదేళ్ల కాలానికి తక్కువగా ఉండడం ఇన్వెస్టర్లను హతాశులను చేసేదే. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్‌లో ఇలా పేలవ పనితీరు చూపించిన వాటిల్లో వ్యాల్యూ ఫండ్స్‌ విభాగం అత్యంత చెత్తగా ఉంది. ఎందుకంటే వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌తో కూడిన పథకాల్లో 67 శాతం పనితీరు ఐదేళ్ల కాలానికి బెంచ్‌ మార్క్‌ సూచీ

ఇండియా వెయిట్‌ను తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ

Wednesday 4th September 2019

దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడంతో మోర్గాన్‌ స్టాన్లీ ఆసియా బ్యాంకుల పోర్టుపోలియోలో ఇండియా వెయిట్‌ను 8 పాయింట్ల తగ్గించినట్టు మోర్గాన్‌ స్టాన్లీ ఓ నివేదికలో పేర్కొంది. గతంలో ఈ పోర్టుపోలియోలో ఇండియా వెయిట్‌ 25 శాతం ఉం‍డగా తాజా కోతతో అది 17.5 శాతానికి పడిపోయింది. ఇండియాకు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు మోర్గాన్‌ స్టాన్లీ ఆసియా బ్యాంక్స్‌ పోర్టుపోలియోలో ఉండగా, దీని నుంచి

Most from this category