News


ఆగని పసిడి పరుగు

Tuesday 25th June 2019
news_main1561437770.png-26544

ప్రపంచమార్కెట్లో పసిడి పరుగు ఆగడం లేదు. ఆసియాలో ట్రేడింగ్‌లో మంగళవారం పసిడి మరో 24డాలర్లు ర్యాలీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పరిస్థితులు, కీలక వడ్డీరేట్లపై పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు మెతక వైఖరి ఇందుకు తోడ్పాటును అందిస్తున్నాయి. ఈ వారంతాన జరిగే జీ-20 సదస్సులో అగ్రరాజ్యాలైన అమెరికా - చైనా దేశాధ్యక్షులైన ట్రంప్‌-జింగ్‌పిన్‌ల మధ్య ట్రేడ్‌ వార్‌ చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కూడా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఫలితంగా చివరి ఐదు ట్రేడింగ్‌ సెషన్స్‌లో పసిడి ధర 70డాలర్లు పెరగ్గా, నెలరోజుల్లో ఏకంగా 8శాతం ర్యాలీ చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా ఇరాన్‌పై ఆంక్షలు విధించడంతో, ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో డాలర్‌ ఇండెక్స్‌ క్షీణిస్తుంది. వరుసగా 5వరోజూ పతనమై 95.943 స్థాయికి చేరుకుంది. వారంతాన జరిగే జీ-20 సదస్సులో అగ్రరాజ్యాలైన అమెరికా - చైనా దేశాధ్యక్షులైన ట్రంప్‌-జింగ్‌పిన్‌ల మధ్య ట్రేడ్‌ వార్‌ చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కూడా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. నేడు న్యూయార్క్‌లో అమెరికా ఫెడ్‌రిజర్వ్‌  ఛైర్మన్‌ పావెల్‌ ప్రసంగించనున్నారు. అందులో రానున్న రోజుల్లో ద్రవ్యపరపతి విధానంపై ఫెడ్‌ రిజర్వ్‌ వైఖరి వెల్లడి కానున్నది. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో 6నెలల కాలానికి పసిడిలో పెట్టుబడి చేయడం ఉత్తమమని మోర్గాన్ స్టాన్లీ సిఫార్సు చేస్తుంది. ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 22.30డాలర్ల లాభంతో 1,440.50డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
దేశీయంగానూ అదే దూకుడు:- 
అంతర్జాతీ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయ పసిడి ఫ్యూచర్లు దూకుడు కొనసాగిస్తున్నాయి. నేటి ఉదయం ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఆగస్ట్‌ ఫ్యూచర్ల కాంట్రాక్టు 10గ్రాములు పసిడి ధర రూ.392లు పెరిగి 34835.00 ట్రేడ్‌ అవుతోంది. గత వారం రోజులుగా ప్రపంచ మార్కెట్లో పసిడి ర్యాలీ, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనత, దేశీయ ఈక్విటీ మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌ తదితర ప్రతికూలాంశాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పసిడి ఫ్యూచర్ల వైపు మళ్లిస్తున్నారు.

 



You may be interested

ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లను విక్రయించనున్న బీఎన్‌పీ పారిబా

Tuesday 25th June 2019

ఫ్రాన్స్‌ మల్టినేషనల్‌ బ్యాంక్‌ బీఎన్‌పీ పారిబా కార్డిఫ్‌ 2.5 కోట్ల ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్య్సూరెన్స్‌  షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా మంగళవారం, బుధవారం విక్రయించనుంది. గత సెషన్‌ ధరతో పోలిస్తే 8.5 శాతం రాయితీతో షేర్‌ను రూ.650 వద్ద విక్రయించనున్నారు. ఈ ఆఫర్‌ను జూన్‌ 25న నాన్‌ రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉంచగా, జూన్‌ 26న రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం

స్థిరంగా చమురు

Tuesday 25th June 2019

అమెరికా- ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతల వాతవరణం చమురు ధరల పెరుగుదలకు  సహకరించిన క్రూడ్‌ ఆయిల్‌ డిమాండ్‌ తగ్గుదల ఒత్తిడి కారణంగా మంగళవారం(జూన్‌ 25) చమురు ధరలు స్థిరంగా ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 0.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 64.89 డాలర్ల వద్ద, అమెరికా క్రూడ్‌ 0.8శాతం నష్టపోయి 57.87 డాలర్ల వద్ద ముగిశాయి. అమెరికా తయారి రంగం మందగించిందని ఫలితంగా క్రూడ్‌ ఆయిల్‌ డిమాండ్‌ తగ్గిందని

Most from this category