News


ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్ల భారీ పతనం

Wednesday 25th September 2019
news_main1569397133.png-28543

వరుసగా రెండోరోజూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ బుధవారం ఉదయం సెషన్‌లో 4శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,495.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒకదశలో 4శాతం క్షీణించి 2,421.15 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఈ రంగానికి చెందిన షేర్లలో ఎస్‌బీఐ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. మోర్గాన్‌ స్టాన్లీ షేర్లపై రేటింగ్‌ను ఓవర్‌వెయిట్‌ నుంచి ఈక్వల్‌ వెయిట్‌కు తగ్గించింది. అలాగే షేరు టార్గెట్‌ ధరను రూ.330గా నిర్ణయించింది. బ్రోకరేజ్ సంస్థ ఆర్థిక సంవత్సరం 21, 22 ఈపీఎస్‌ అంచనాలను ఒక్కొక్కటి 5 శాతంగా పెంచింది. పన్ను రేటు తగ్గింపు తక్కువ మార్జిన్లను అధిగమిస్తుంది అంచనా వేసింది. ఆస్తి నాణ్యత, నికర వడ్డీ మార్జిన్‌లపై అనిశ్చితి కారణంగా అప్‌సైడ్‌ ర్యాలీ పరిమితం కానున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. ఫలితంగా ఇంట్రాడేలో ఎస్‌బీఐ షేర్లు 5శాతం క్షీణించాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు 5శాతం క్షీణించాయి. కెనరా బ్యాంక్‌ 4శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.50శాతం, పీఎన్‌బీ, ఇండియన్‌ బ్యాంక్‌ ఓరియంటల్‌ బ్యాంక్‌ 3శాతం నష్టపోయాయి. ఆలహదాబాద్‌ బ్యాంక్‌ 2శాతం, సిండికేట్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నష్టపోయాయి. మరోవైపు జమ్మూకాశ్మీర్‌ బ్యాంక్‌ మాత్రం 3.50శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. మధ్యాహ్నం గం.12:30లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,522.85)తో పోలిస్తే 4శాతం నష్టంతో 2,424.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

నష్టాల బాటలో అటో రంగ షేర్లు

Wednesday 25th September 2019

మార్కెట్లో నెలకొన్న అమ్మకాల్లో భాగంగా అటో రంగ షేర్లు బుధవారం నష్టాల బాట పట్టాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 4.50శాతం క్షీణించింది. కేంద్రం ప్రకటించిన కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వల్ల దేశీయ అటోపరిశ్రమకు పెద్దగా మేలు జరగదని జెఫరీస్‌ లాంటి బ్రోకరేజ్‌ సంస్థలు ప్రకటించాయి. అలాగే మార్కెట్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి కూడా అటో రంగ షేర్లపై ప్రభావాన్ని చూపుతుంది. నేటి

అంతర్జాతీయ బ్రోకరేజిల టాప్‌ సిఫార్సులు!

Wednesday 25th September 2019

వివిధ అంతర్జాతీయ బ్రోకరేజిల టాప్‌ సిఫార్సులు: బ్రోకరేజీ: సీఎల్‌ఎస్‌ఏ సీఎల్‌ఎస్‌ఏ , వరుణ్‌ బెవరేజస్‌ స్టాక్స్‌పై ‘బై’ కాల్‌నిస్తూ, షేరు టార్గెట్‌ ధరను రూ. 860 కి పెంచింది. వరుణ్‌ బెవరేజస్‌, తను విస్తరించిన భూభాగంలో మార్కెట్‌ లాభాలను పొందేందుకు ప్రయత్నిస్తుందని ఈ బ్రోకరేజీ అంచనావేసింది. ఈ కంపెనీ కన్సోలిడేషన్‌ దశ ముగిసిందని, కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌ పారామితులు మెరుగుపడనున్నాయని పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ మేనేజెమెంట్‌ రిటర్న్‌ నిష్పత్తులపై దృష్ఠి పెట్టనుందని ఈ

Most from this category