News


బ్యాంక్‌ నిఫ్టీ 9.50శాతం క్రాష్‌..!

Thursday 12th March 2020
Markets_main1584003816.png-32435

మార్కెట్‌ మహాపతనంలో భాగంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో ఏకంగా 9.50శాతం నష్టాన్ని చవిచూసింది. నేడు మార్కెట్‌ భారీ గ్యాప్‌ డౌన్‌లో భాగంగా ఈ ఇండెక్స్‌ మునుపటి ముగింపు(26,487.80)తో పోలిస్తే 5శాతం(1311.9 పాయింట్లు) నష్టంతో 25,175.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌ రంగ షేర్లలో అమ్మకాల కొనసాగుతుండటంతో ఇండెక్స్‌ ఒక దశలో దాదాపు 9.50శాతం(2474 పాయింట్లు) నష్టాన్ని చవిచూసింది. మధ్యాహ్నం గం.లకు 8.29శాతం నష్టంతో 24,291.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 14.50శాతం, యస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 12.50శాతం నష్టాన్ని చవిచూశాయి. ఎస్‌బీఐ 12శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌, 11శాతం, పీఎన్‌బీఐ బ్యాంక్‌ 10.27శాతం పతనమయ్యాయి. ఫెడరల్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్లు 10శాతం నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్ బ్యాంక్‌ షేర్లు 8శాతం పతనమవగా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు 7శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేరు 6.50శాతం క్షీణించాయి. 



You may be interested

కోవిడ్‌-19 కాటుకు గురైన మాంసం ఎగుమతులు!

Thursday 12th March 2020

కోవిడ్‌-19(కరోనా) కారణంగా భారత మాంసం ఎగుమతులు భారీగా పడిపోయాయి. కరోనామహమ్మారీ దాటికి మాంసం ఎగుమతులు 12-15 శాతం పడిపోగా, షిప్‌మెంట్లపై పరిమితులు విధించడం, ఫార్మా ముడిపదార్థాలు కొరత, సోలార్‌, ఎలక్ట్రికల్‌ పరిశ్రమలు విడిభాగాల దిగుమతులు ఆగిపోవడంతో ఈ రంగాలన్నీ కుదేలయ్యాయని ఆర్థిక మంత్రి పియూష్‌ గోయల్‌ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చైన్స్‌ నిలిచిపోవడంతో ఆ ప్రభావం ఇండియాపై ఏ స్థాయిలో ఉందో విశ్లేషించేందుకు వాణిజ్య, పరిశ్రమల మంత్రి  పియూష్‌

బేర్‌ పట్టులో మార్కెట్‌- బ్లూచిప్స్‌ విలవిల

Thursday 12th March 2020

గరిష్టం నుంచి 20 శాతం పతనమైన నిఫ్టీ నిఫ్టీ బ్లూచిప్స్‌లో 43 షేర్లు బేర్‌ ట్రెండ్‌లో కరోనా సునామీకి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లన్నీ ఏకధాటిగా బేర్‌ మంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో చరిత్రాత్మక గరిష్టాలను తాకిన అమెరికా స్టాక్‌ ఇండెక్స్‌ ఎస్‌అండ్‌పీ దగ్గర్నుంచి దేశీయ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ వరకూ అమ్మకాలతో నీరసిస్తూ వస్తున్నాయి. తాజాగా వైరస్‌ భయాలతో యూరోపియన్‌ దేశాల ప్రయాణికులను అమెరికా రాకుండా నిషేధం విధించడంతో మరోసారి మార్కెట్లు

Most from this category