News


ఏ రంగానికి మోదం!

Saturday 25th May 2019
Markets_main1558724038.png-25922

ప్రస్తుత ఎన్‌డీయే సర్కారుకే మరింత మెజారిటీతో దేశ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టడం చూశాం. దీంతో విధానాల్లో స్పష్టత, సుస్థిరతకు అవకాశం ఇచ్చినట్టు అయింది. మార్కెట్లకు రాజకీయ పరంగా అస్థిరతకు బ్రేక్‌ పడింది. అయితే, రాజకీయ స్థిరత్వం ఒక్కటే ఈక్విటీ మార్కెట్లు, లేదా కరెన్సీ మార్కెట్‌ను ముందుకు నడిపించే పరిస్థితి లేదు. దేశీయ వినియోగం చల్లబడడం, చమురు ధరలు, వాణిజ్య యుద్ధం వంటి ఇతరత్రా అంశాలు కూడా ఉన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 18.3 పీఈకి చేరింది. ఐదేళ్ల సగటు కంటే ఎక్కువ ఇది. ఈ నేపథ్యంలో తిరిగి మోదీ సర్కారే కొలువు దీరనున్న దృష్ట్యా ఏ రంగాలకు ఏ విధంగా ఉంటుందో నిపుణుల అభిప్రాయాలను పరిశీలిస్తే... 

 

వ్యవసాయరంగం
ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం తీసుకొచ్చిన మధ్యంతర బడ్జెట్‌ రైతుల పట్ల ప్రభుత్వ ప్రాథన్యాన్ని తెలియజేస్తోంది. గ్రామీణాభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతోపాటు చిన్న రైతులకు ఏటా రూ.6,000 పంట సాయంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇవి కావేరీ సీడ్స్‌, ప్రభాత్‌ డెయిరీ, అవంతి ఫీడ్స్‌కు సానుకూలం.

 

ఇన్‌ఫ్రా, రియల్‌ ఎస్టేట్‌
1.44 ట్రిలియన్‌ డాలర్లను దేశ మౌలిక రంగానికి వెచ్చిస్తామని ప్రచారం సందర్భంగా మోదీ ప్రకటించారు. మరోవైపు కేంద్రం అందుబాటు ధరల ఇళ్లకు ప్రోత్సాహం ఇస్తోంది. ఇందుకోసం కొనుగోలుదారులకు పన్ను ప్రయోజనాలను కూడా ప్రకటించింది. సిమెంట్‌ కంపెనీలు, పైపులు, టైల్స్‌, శానిటరీవేర్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలకు సానుకూలం. ఎల్‌అండ్‌టీ, సద్బావ్‌ ఇంజనీరింగ్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, థర్మాక్స్‌, బీహెచ్‌ఈఎల్‌, సీమెన్స్‌, గోద్రేజ్ ప్రాపర్టీస్‌, శోభా తదితర కంపెనీలను పరిశీలించొచ్చు. రవాణా సదుపాయాలు, అందుబాటు ధరల ఇళ్ల రంగాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధుల సాయాన్ని కొనసాగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

ఫైనాన్షియల్స్‌
ఎన్‌పీఏలు భారీగా పెరిగిపోవడంతో ప్రక్షాళన అవసరమైంది. అలాగే, ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ సంక్షోభం ఇళ్లు, వాహనాలు, కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌కు కొత్త రుణాలపై ప్రభావం చూపించింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయాన్ని అందించడం, స్థిరీకరణ అన్నది పరిశీలించాల్సిన కీలకమైన అంశం. ఈ విభాగంలో ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్‌బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకులకు ప్రయోజనం. మూడు, ఐదేళ్ల కోసం బ్యాంకింగ్‌ రంగం మంచి వృద్ధికి అవకాశం ఉన్న విభాగంగా బీఎన్‌పీ పారిబాస్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ మేనేజర్‌ కార్తీక్‌రాజ్‌ లక్ష్మణన్‌ పేర్కొన్నారు. 

 

వినియోగం
వినియోగ రంగంలో డిమాండ్‌ నిదానించడం, ఇదే సమయంలో మోదీ సర్కారు పూర్తి మెజారిటీ కొలువు తీరనుండడం, రైతుల ఆదాయం పెంచే దిశగా ప్రభుత్వ కార్యక్రమాలు, ఆర్‌బీఐ విధానం సులభతరం వంటి చర్యలు కన్జ్యూమర్‌ స్టాపుల్స్‌, డ్యురబుల్స్‌, మోటార్‌బైక్‌ల డిమాండ్‌ పెంచుతుందని అంచనా. హీరోమోటో, బజాజ్‌ఆటో, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, మారుతి సుజుకీ, హెచ్‌యూఎల్‌, నెస్లే, ఐటీసీలను పరిశీలించొచ్చు. You may be interested

ఫండ్‌ సైజు అంత కీలకమా?

Saturday 25th May 2019

ఓ మ్యూచువల్‌ ఫం‍డ్స్‌ పథకం నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏయూఎం) కీలకమైన అంశమా...? చాలా మంది ఇన్వెస్టర్లకు ఎదురయ్యే ప్రశ్న ఇది. చాలా మంది భారీ ఏయూఎం కలిగిన పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మిగిలిన పథకాలతో పోలిస్తే భారీ పెట్టుబడులు కలిగిన పథకాలు మెరుగైన పనితీరు చూపిస్తాయన్న అభిప్రాయం వల్లే. కానీ, ఇందులో వాస్తవం ఉందా..? దీనిపై వ్యాల్యూ రీసెర్చ్‌సంస్థ విశ్లేషణ ఇలా ఉంది.    ఈక్విటీ ఫండ్స్‌లో అస్సెట్స్‌

సెన్సెక్స్‌ 623 పాయింట్లు జంప్‌

Friday 24th May 2019

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తిరిగి అధికారం చేపట్టడంతో జూన్‌ తొలివారంలో జరిగే రిజర్వుబ్యాంక్‌ సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలకు అనుగుణంగా సూచీలు శుక్రవారం భారీ లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 623 పాయింట్లు పెరిగి 39,434.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 187 పాయింట్లు లాభపడి 11,844.10 వద్ద స్థిరపడింది. అన్ని రంగాల్లో చెప్పుకోదగిన కొనుగోళ్లతో ట్రేడింగ్‌ ఆద్యంతం ఆయా ఆయా రంగాల షేర్ల ర్యాలీ కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు

Most from this category