మార్కెట్లు వాస్తవాన్ని మరిచి పెరుగుతున్నాయి: సామ్కో
By Sakshi

‘మార్కెట్ సెంటిమెంట్‌కు, దేశ స్థూల ఆర్థిక డేటాకు మధ్య వ్యత్యాసం అధికంగా ఉండడంతో, స్టాక్‌మార్కెట్లు దీర్ఘకాల దిద్దుబాటు దశను ఎదుర్కొనే అవకాశం ఉంది’ అని సామ్కో సెక్యురిటీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ జిమిత్‌మోదీ వ్యాఖ్యానించారు. మిగిలిన ముఖ్యంశాలు ఆయన మాటల్లో.. సాంకేతిక దృక్పథం: వచ్చే వారం మార్కెట్‌పై అంచనా..
కార్పొరేట్ ఫలితాలు బాగుండడం, అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిళ్లు తగ్గుముఖం పడుతుండడంతో, గత కొన్ని వారాల నుంచి దేశీయ ఈక్విటీ మార్కెట్లను పాజిటివ్ సెంటిమెంట్ నడుపుతోంది. పాజిటివ్ సెంటిమెంట్ ఎక్కువగా ఉండడంతో మార్కెట్లు చాలా వరకు ప్రతికూల వార్తలను పట్టించుకోవడం లేదు. ఇది మార్కెట్లను బుల్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నారనే సంకేతాలనిస్తోంది. కానీ ఈ ఆశావాద దృక్పథం కింది స్థాయిల వద్ద కనిపించడం లేదు. మార్కెట్ విస్తరణ, ఓపెన్ ఇంట్రెస్ట్ స్థాయిలు, ఈ ఆశావాదానికి మద్దతుగా లేకపోవడం గమనార్హం. మొత్తంగా ఆశావాద దృక్పథంతో కదులుతున్నప్పటికి, మార్కెట్లు దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
ఒకవైపు రిటైల్ ద్రవ్యోల్బణం నెలవారి గరిష్ఠానికి చేరుకోగా, మరోవైపు దేశ జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోతుందని అంచనాలు ఉన్నాయి. ఇలా మార్కెట్ సెంటిమెంట్‌కు, దేశ స్థూల ఆర్థిక డేటాకు మధ్య వ్యత్యాసం అధికంగా ఉండడంతో, స్టాక్‌మార్కెట్లు దీర్ఘకాల దిద్దుబాటు దశను ఎదుర్కొనే అవకాశం ఉంది. సుప్రిం కోర్టు తీర్పు వలన టెలికాం కంపెనీలు బిలియన్ రూపాయిల బకాయిలను ప్రభుత్వానికి చెల్లించవలసి వచ్చింది. ఫలితంగా ఈ కంపెనీల మనుగడపై అనేక అనుమానాలొస్తున్నాయి. కానీ మార్కెట్లు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి అధ్వాన్న పరిస్థితులను, స్టాక్ ధరలు ప్రతిబింబించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో కూడా మార్కెట్, ఆశావాద దృక్పథంతో అందరిని ఆశ్చర్యపరుస్తోంది. కానీ వాస్తవం, మార్కెట్ ఊహించినదాని కంటే చాలా దూరంగా ఉందనేది గమనించాలి.
దీర్ఘకాలంగా కొనసాగిన ఎస్సార్ స్టీల్ దివాలా కేసుకు సంబంధించి సుప్రిం కోర్టు శుక్రవారం తీర్పిచ్చింది. బాకీలు రాబట్టడంలో మొదటి ప్రాధాన్యత రుణదాతల కమిటీకే ఉందని తేల్చింది. దీంతో ఈ రుణదాతల కమిటీలో అధికంగా ఉన్న పీఎస్‌యూ బ్యాంకులు లాభపడనున్నాయి. ఈ బ్యాంకుల లిక్విడిటీ పెరగనుంది. ఈ చర్య మొత్తంగా ఆర్థిక వ్యవస్థపై పాజిటివ్ ప్రభావం పడనుంది. అంతేకాకుండా పీఎస్‌యూ బ్యాంకులకు ప్రభుత్వం మూలధనాన్ని సమకూర్చడంపై ఒత్తిడి తగ్గనుంది.
నిఫ్టీ 50 తక్కువ పరిధిలో కదలాడనుంది. ఇంట్రాడేలు ధరలలో అనిశ్చితి కొనసాగే అవకాశం ఉన్నప్పటికి, తక్కువ పరిధిలోనే ముగింపును అంచనావేయోచ్చు. దిద్దుబాటు దశలలో బ్రెక్ఔట్లు విఫలమవుతుంటాయి. అందువలన ట్రేడర్లు జాగ్రత్తవహించాలని సలహాయిస్తున్నాం. దిద్దుబాటు దశలో నిర్ధిష్ట స్టాకులపై ఇన్వెస్టర్లు అధికంగా దృష్ఠి సారిస్తారు. ట్రేడర్లు స్టాకుల పడిపోయినప్పుడు, స్టాప్‌లాస్‌లను ఉపయోగిస్తు కొనుగోలు చేయడం ఉత్తమం.
ఫలితాల సీజన్ పూర్తవ్వడంతో యుఎస్-చైనా వాణిజ్య ఒప్పందం, ట్రంప్ అభిశంసన, చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న సౌదీ ఆరామ్కో ఐపీఓ వంటి అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే కీలక పరిణామాలు వచ్చే వారం లేకపోవడంతో, మార్కెట్ స్తబ్దుగా, ఒక పరిధిలో కదలాడుతుంది. విస్తృత మార్కెట్ కదలిక కంటే, నిర్ధిష్టమైన స్టాకుల కదలిక ఎక్కువగా ఉంటుంది. కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికి, మార్కెట్ దిద్దుబాటు అయ్యేంత వరకు ఇన్వెస్టర్లు వేచి చూడడం మంచిది. ‘ఓపిక లేని వారి నుంచి ఓపిక ఉన్న వారికి డబ్బును బదిలీ చేసే సాధనమే స్టాక్ మార్కెట్’ అని చెప్పిన వారెన్ బఫెట్ మాటలను గుర్తుపెట్టుకోవడం మంచిది. విలువ భారీగా పెరిగిన కొన్ని రంగాలలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంటుంది. కాగా ఈ వారం నిఫ్టీ 0.10 శాతం నష్టపోయి 11,895 వద్ద ముగిసింది.
You may be interested
అధిక వాల్యూషన్లతో ఆటు పోట్లు!
Saturday 16th November 2019జియోజిత్ ఫైనాన్షియల్స్ రిసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ దేశీయ బ్లూచిప్ స్టాకుల్లో ప్రీమియం వాల్యూషన్లున్నాయని, ఇందువల్ల షార్ట్‌టర్మ్‌కు మార్కెట్లో ఆటుపోట్లు తప్పకపోవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్స్ రిసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. వాల్యూషన్లకు ఎర్నింగ్స్‌కు మధ్య వ్యత్యాసం తాజా ర్యాలీ అనంతరం పెరగడంతో స్వల్పకాలానికి మార్కెట్ ట్రెండ్ ఒడిదుడుకులతో ఉండొచ్చని చెప్పారు. అంతర్జాతీయ దేశీయ సానుకూల వార్తలు ఈక్విటీల్లో ర్యాలీ తెచ్చాయన్నారు. వారాంతానికి ఇండియా రేటింగ్ డౌన్‌గ్రేడ్ వార్తలో ప్రాఫిట్‌బుకింగ్ వచ్చిందన్నారు.
అన్ని టెల్కోలు కొనసాగాలి.. అదే నా కోరిక!
Saturday 16th November 2019ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ టెలికం కంపెనీ కూడా మూతపడాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని, రుణభారంతో కుదేలైన టెలికం రంగాన్ని ఆదుకోవాలనే యోచిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఏ టెల్కో మూసేయాలని తాను కోరడం లేదని, అన్ని టెల్కోలు కొనసాగాలని, కస్టమర్లకు సేవలందించాలనే తాను ఆశిస్తున్నానని ఆమె చెప్పారు. ధరల యుద్ధంతో సతమతమవుతున్న టెలికం రంగానికి తాజాఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అశనిపాతంలా తగిలింది. ఏజీఆర్ బకాయిలు