ఉద్దీపనల ప్రభావం స్వల్పకాలికమేనా?!
By Sakshi

ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం కొన్ని ఆర్థిక చర్యలను ప్రకటించారు. కానీ ఈ ఆర్థిక చర్యలు కొద్దికాలానికే మార్కెట్లకు ఉత్సాహాన్నిస్తాయని దీర్ఘకాలానికి మరిన్ని చర్యలు తీసుకోవడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక మంత్రి శుక్రవారం ప్రకటించిన చర్యలలో ముఖ్యమైనది బడ్జెట్లో ఎఫ్‌పీఐ(విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్లు)లపై విధించిన అదనపు సర్‌చార్జీని ఎత్తివేయడం, కానీ దీని ఫలితాన్ని దేశియ హెడ్జ్‌ఫండ్స్ వాడుకోకుండా చేయడంపై ఇన్వెస్టర్లు కొంత నిరాశతో ఉన్నారని పరిశీలకులు తెలిపారు. దీనితో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన్నాన్ని చేకూర్చడం చాలా మంచి చర్యని, వడ్డీ రేట్ల కోత బదిలీ వేగతరం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి బయటపడేయ్యగలదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కానీ ఈ రేట్ల కోత బదిలీ ఇప్పటి వరకు సమర్ధవంతంగా జరగలేదు. రుణవృద్ధి కన్నా డిపాజిట్ వృద్ధి తక్కువగా ఉంటోంది. చిన్న పొదుపు పథకాలు వంటి పొదుపు ప్రత్యామ్నాయ మార్గాలలో అధిక వడ్డీ రేట్ల వలన ఎటువంటి వృద్ధి కనిపించడం లేదు. మొండి బకాయిలకు కేటాయింపులు పెరగడం కూడా రేట్ల బదిలీని బలహీనపరుస్తోంది. కేవలం ద్రవ్య లభ్యతను పెంచడం మాత్రమే మందగమనానికి కారణమైన నిర్మాణాత్మక ఇబ్బందులను తొలగించలేదని నిపుణుల అభిప్రాయం.
ఇంకోవైపు బీఎస్ 4 వాహనాల వాడకాల కాలపరిమితిని పెంచడంతో పాటు, ప్రభుత్వ కార్యలయాలలో కొత్తగా వాహనాల విక్రయాన్ని తిరిగి ప్రారంభించడం, తరుగుదలను పెంచడం వంటి నిర్ణయాలు ఆటో సెక్టార్ మెరుగుపడడానికి ఉపయోగపడతాయి కానీ పూర్తిగా సంక్షోభంలో చిక్కుకున్న ఆటో రంగాన్ని బయటపడేసేందుకు సరిపోవని విశ్లేషకుల అంచనా. దీనితోపాటు రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పైప్‌లైన్‌ను ఖరారు చేయడానికి బాండ్ మార్కెట్‌ను మరింత లోతుగా ఉపయోగించుకోవడం, ఇంటర్ మినిస్టీరియల్ టాస్క్‌ఫోర్స్‌ను రూపొందించడం వంటి కొన్ని దీర్ఘకాలిక చర్యలు వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాలు ఎంత వరకు అమలవుతాయో అనే విషయంపై దీని విజయం ఆధారపడి ఉంటుంది. మార్కెట్ పరంగా చూసుకుంటే..ఆదాయాల వృద్ధి ఆందోళనలు మార్కెట్‌ను ఇంకా వెంటాడుతున్నాయి. ఒక వేళ ప్రభుత్వం చెప్పినట్టు ఇప్పుడు తీసుకున్న చర్యలు కేవలం ప్రారంభం మాత్రమే అయితే ద్వితియార్థానికి సెంటిమెంట్ బలపడుతుంది. గత ఆర్థిక సంవత్సరం ద్వితియార్ధం నుంచి మందకొడిగా ఉన్న వ్యవస్థలో చురుకుదనం తెచ్చేందుకు తక్కువ బేస్ ప్రభావం చూపగలదని అంచనా.
You may be interested
5 శాతం నష్టపోయిన టాటాస్టీల్
Monday 26th August 2019అంతర్జాతీయ పరిణామాలతో పాటు, గత కొన్ని సెషన్ల నుంచి అమ్మకాల ఒత్తిడిలో ఉన్న టాటా స్టీల్ షేరు విలువ సోమవారం ట్రేడింగ్‌లో 5 శాతం మేర పతనమయ్యి రూ. 322.20 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కాగా దేశీయ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి రావడంతో ఈ షేరు రికవరి అయ్యింది. టాటా స్టీల్ మధ్యాహ్నాం 12.53 సమయానికి 2.69 శాతం నష్టపోయి రూ. 335.95 వద్ద ట్రేడవుతోంది. కాగా గత
మళ్లీ ఆరేళ్ల గరిష్టానికి పసిడి ధర
Monday 26th August 2019ప్రపంచమార్కెట్లోని పసిడి ధర సోమవారం మళ్లీ ఆరేళ్ల గరిష్టాన్ని అందుకుంది. వాణిజ్య సుంకాల విధింపు అంశంలో అమెరికా-చైనాలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ధర 27డాలర్లు పెరిగి 1,564.95 స్థాయిని అందుకుంది. పసిడి ధరకు ఇది వరుసగా రెండోరోజూ ర్యాలీ కావడం విశేషం. వాణిజ్య యుద్ధంలో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి కొన్ని ఉత్పత్తులపై డిసెంబర్ 15 నుంచి