News


ఎఫ్‌పీఐ, డీఐఐలపై అదనపు సర్‌చార్జీ రద్దు!

Saturday 24th August 2019
Markets_main1566622381.png-27981

ఎఫ్‌పీఐ(విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్లు)లపై విధించిన అదనపు సర్‌చార్జీలను ఉపసంహరించుకోడంతోపాటు, ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి ఆటో సెక్టార్‌, మౌలిక రంగ అభివృద్ధి కోసం తీసుకునే చర్యలను శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఎఫ్‌పీఐలకు సర్‌చార్జీ మినహాయింపు ఇవ్వడంతో పాటు, లాంగ్‌, షార్ట్‌ టెర్మ్‌ క్యాపిటల్‌ లాభాలపై విధించే పన్నులను, దేశియ సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐ)లపై విధించిన అదనపు సర్‌చార్జీలను కూడా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ‘క్యాపిటల్‌ మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, సెక్షన్ 111 ఎ, 112 ఎలో సూచించిన ఈక్విటీ షేర్లు / యూనిట్ల బదిలీ వల్ల ఉత్పన్నమయ్యే దీర్ఘకాలిక, షార్ట్‌ టర్మ్ క్యాపిటల్ లాభాలపై, ఫైనాన్స్ (నెం 2) చట్టం, 2019 ద్వారా విధించిన సర్‌చార్జీని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని ఆర్థిక మంత్రి అన్నారు. అంతేకాకుండా వచ్చే కొన్ని వారాల్లో ఇంకో రెండు ప్రెస్‌ కన్ఫ్‌రెన్స్‌లను నిర్వహించి, సంక్షోభంలో చిక్కుకున్న గృహనిర్మాణ రంగానికి సంబంధించి తీసుకోవలసిన చర్యలను ప్రకటిస్తానని, నిర్దిష్ట దశలతో సహా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడానికి మరిన్ని చర్యలను తెలియజేస్తానని ఆమె అన్నారు. కాగా ఈ ఏడాది జులైలో ఎఫ్‌పీఐలపై సర్‌చార్జీని ప్రకటించిన తర్వాత సెన్సెక్స్ 7 శాతానికి పైగా నష్టపోయింది. ఈ పతనం వలన రూ .14 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది.బడ్జెట్ తర్వాత నుంచి మార్కెట్‌లో ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా ఉన్నారు. మొత్తంగా వీరు రూ. 25,000 కోట్ల నిధులను మార్కెట్‌ నుంచి తరలించగా, ఆ సమయంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐ) మార్కెట్‌కు మద్ధతుగా ఉన్నారు.  
   ఎఫ్‌పీఐలు, దేశియ సంస్థాగత ఇన్వెస్టర్లపై విధించిన అదనపు సర్‌చార్జిని తొలగించడం వల్ల సుమారుగా రూ. 1,400 కోట్లను ప్రభుత్వం కోల్పోవలసి ఉంటుందని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే అన్నారు. బడ్జెట్‌కు ముందు ఉన్న పన్నుల స్థాయే, వీటిపై ఉండనుందని ఆయన అన్నారు. ‘ఎఫ్‌పీఐ, డీఐఐలపై విధించిన సర్‌చార్జీల ఉపసంహరణ కార్యనిర్వాహక ఆదేశాల మేర జరుగుతుంది’ అని వివరించారు. ‘ఇది చాలా సానుకూల పరిణామం. దీని వలన క్యాపిటల్‌ మార్కెట్లు పుంజుకుంటాయి. డెరివేటివ్‌ ఆదాయాలను క్యాపిటల్‌ లాభాలుగా పరిగణిస్తే, వీటిపై కూడా ఈ ఉపసంహరణను పెంచుతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంతేకాకుండా విధించిన అదనపు సర్‌చార్జీ, వడ్డీ ఆదాయంపై కొనసాగే అవకాశం ఉంది’ అని డెలాయిట్ ఇండియా భాగస్వామి రాజేష్ హెచ్ గాంధీ అన్నారు.You may be interested

డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు

Saturday 24th August 2019

వివిధ కాలపరిమితులపై అరశాతం వరకూ కోత న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) స్థిర డిపాజిట్లపై వడ్డీరేటును 50 బేసిస్‌ పాయింట్ల వరకూ (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. దీనితో డిపాజిట్‌దారులకు తక్కువ రిటర్న్‌ ‍్స మాత్రమే చేతికి అందుతాయన్నమాట. ఆగస్టు 26వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ ప్రకటన తెలిపింది. ముఖ్యాంశాలు చూస్తే... - వివిధ కాలపరిమితుల డిపాజిట్లపై రేట్లు

ఐపీఓ రూట్లో స్టార్టప్‌లు!

Saturday 24th August 2019

రూ.1,000 కోట్లు సమీకరించనున్న 200 స్టార్టప్‌లు ఐపీవోకి వస్తున్న తొలి స్టార్టప్‌ ‘ఆల్ఫాలాజిక్‌ టెక్‌సైస్‌’ ఇష్యూ ఈ నెలాఖరున ప్రారంభం; రూ.5 కోట్ల సమీకరణ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ స్టార్టప్స్‌ ఐపీవో బాట పట్టాయి. బెంగళూరు, పుణె, ముంబై, హైదరాబాద్‌ తదితర నగరాలకు చెందిన 200కు పైగా స్టార్టప్‌లు ప్రస్తుతం ఐపీఓకి ముస్తాబయ్యాయి. దాదాపు రూ.1,000 కోట్ల నిధుల సమీకరించాలన్నది వీటి లక్ష్యం. వీటిలో భాగంగా అన్ని అనుమతులతో ఈ నెలాఖరులో పుణెకు

Most from this category