News


వచ్చే వారం కీలకం!

Saturday 22nd June 2019
Markets_main1561217774.png-26504

నిఫ్టీపై నిపుణుల అంచనా
గతంలో భావించినట్లే దేశీయ మార్కెట్లు ఈ వారం కూడా భారీ ర్యాలీకి పెద్దగా మొగ్గు చూపలేదు. పరిమిత శ్రేణిలో కదలాడుతున్న నిఫ్టీ ఎప్పటిలాగే 11840- 11880 పాయింట్ల వద్దకు రాగానే వెనక్కు మరలింది. దీంతో ఈ జోన్‌లో డబుల్‌టాప్‌ ఏర్పడినట్లయింది. నిఫ్టీ వారం మధ్యలో కాస్త కోలుకున్నట్లు కనిపించినా చివరకు నష్టాల్లోనే ముగిసింది. అయితే నిఫ్టీ అటు భారీ నష్టాల్లోకి కానీ, ఇటు భారీ లాభాల్లోకి కానీ పయనించలేదు. రాబోయే వారం నిఫ్టీకి కీలకంగా మారనుంది. నిఫ్టీ సాధారణ శ్రేణిలోనే కదలాడినా, ఒక నిర్ణయాత్మక కదలికకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియా వీఐఎక్స్‌ గతవారం 5.15 శాతం పెరిగింది. దీంతో మార్కెట్లు కొంత బలహీనంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డౌన్‌సైడ్‌ మద్దతును కోల్పోయే ప్రమాదం కొంతవరకు ఉంది. వచ్చే వారానికి నిఫ్టీకి 11845, 11950 పాయింట్లు నిరోధాలుగా పనిచేస్తాయి. దిగువన 11610, 11530 పాయింట్లు మద్దతుగా నిలుస్తాయి. ఆర్‌ఎస్‌ఐ దాదాపు 60 స్థాయిల వద్ద న్యూట్రల్‌గా కనిపిస్తోంది. ఎంఏసీడీ పాజిటివ్‌గానే ఉంది. చార్టుల్లో నిఫ్టీ లోయర్‌టాప్‌, లోయర్‌ బాటమ్‌ ఏర్పరిచింది. గతేడాది చివరిలో నిఫ్టీ మూడేళ్ల అప్‌సైడ్‌ రైజింగ్‌ ఛానెల్‌ దిగువకు వచ్చింది. అప్పటినుంచి ఆ ఛానెల్‌ దిగువ అవధి గట్టి నిరోధంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ నిరోధం, డబుల్‌టాప్‌ నిరోధం కలిసి 11840- 11880 పాయింట్ల వద్ద ఏర్పడింది. దీన్ని ఛేదించడం కష్టంగా కనిపిస్తోంది. అందువల్ల వచ్చేవారం చాలా కీలకంగా మారింది. నిఫ్టీ 11900 పాయింట్ల బలంగా ముగిస్తే మరో అప్‌ర్యాలీ ఉంటుంది. అంతవరకు కన్సాలిడేషన్‌ లేదా కరెక‌్షన్‌కే ఛాన్సులున్నాయని నిపుణులు చెబుతున్నారు. 


 



You may be interested

చమురు ఉత్పత్తి కోతలకే ఒపెక్‌ నిర్ణయం?!

Saturday 22nd June 2019

యూఎస్‌, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. తాజాగా యూఎస్‌ డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేయడం, ప్రతిగా యూఎస్‌ ఒకదశలో వైమానికదాడులకు సిద్ధం కావడం, ఆఖరు నిమిషంలో ట్రంప్‌ యద్ధాన్ని వద్దనుకోవడం.. లాంటి పరిణామాలు మరింత టెన్షన్‌ పెంచుతున్నాయి. ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు సంకేతాలు కూడా క్రూడాయిల్‌ ధరలు పెరిగేందుకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వియన్నాలో జరిగే ఒపెక్‌ సమావేశంపై అందరి దృష్టి

ఆటో యాన్సిలరీ స్టాక్స్‌ కొనొచ్చా?

Saturday 22nd June 2019

 ఇటీవలి కాలంలో ఆటో యాన్సిలరీ(అనుబంధ) రంగ సంస్థల స్టాక్‌లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉం‍డడం ఆటో, దాని అనుబంధ రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో డిమాండ్‌ తగ్గుదల, బీఎస్‌ 4 నిబంధనల నుంచి బీఎస్‌ 6 కు మారుతుండడం, ఎలకి​‍్ట్రక్‌ వాహనాల కోసం ప్రభుత్వం తెస్తున్న పాలసీలు ఆటో రంగానికి సమస్యలుగా మారాయి. భారిగా నష్టపోయిన వాహన అనుబంధ రంగం స్టాక్‌ మార్కెట్లలో వాహన

Most from this category