News


ముగిసిన ఇన్ఫోసిస్‌ ‘బై బ్యాక్‌’

Tuesday 27th August 2019
Markets_main1566885549.png-28045

ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైన రూ. 8,260 కోట్ల బైబ్యాక్ ఆఫర్ ద్వారా 11.05 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేశామని దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సోమవారం పేర్కొంది. అగష్టు 26 వరకు, 11,05,19,266 ఈక్విటీ షేర్లను, షేరు రూ. 747.38 చొప్పున బై బ్యాక్‌ చేశామని, రూ. 82,59,99,99,430.03 నగదును ఉపయోగించి గరిష్ఠంగా 99.999999 శాతం షేర్లను తిరిగి కొనుగోలు చేయగలిగామని కంపెనీ తెలిపింది. ప్రారంభ తేదీ నుంచి ఆరు నెలల గడువుకు ముందే, ఆగస్టు 26, 2019 నుంచి బై బ్యాక్‌ను నిలిపివేయడానికి బైబ్యాక్ కమిటీ ఆమోదం తెలిపింది. కంపెనీ ఈక్విటీ షేర్లను రూ. 8,260 కోట్ల వరకు, ఈక్విటీ షేరు రూ. 800 మించని ధర వద్ద బై బ్యాక్‌ చేయనున్నామని ఇన్ఫోసిస్‌ జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ బైబ్యాక్ పక్రియ 2019 మార్చి 20 న ప్రారంభమైంది. 



You may be interested

ఆరేళ్ల గరిష్టం నుంచి దిగొచ్చిన పసిడి ధర

Tuesday 27th August 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర ఆరేళ్ల గరిష్టం నుంచి దిగివచ్చింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య పరిష్కార చర్చలు తెరపైకి రావడం ఇందుకు తోడ్పడింది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1.25డాలరుతో 1,538.45డాలర్ల వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. అయితే.., మంగళవారం వాణిజ్య చర్చలపై చైనా  అమెరికాకు గందరగోళ సంకేతాలను పంపడంతో పాటు అమెరికా చేసే డిమాండ్లకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని చైనా స్పష్టత చేసింది. ఈ వివాస్పద

లాభాల్లో బ్యాంక్‌ ఇండెక్స్‌..నెగిటివ్‌లో కోటక్‌

Tuesday 27th August 2019

ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్ధీపన చర్యలతో పాటు, ఆర్‌బీఐ తన మిగులు నిధులను ప్రభుత్వానికి అందించడానికి ఆమోదముద్ర వేయడంతో దేశియ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 10.43 సమయానికి 260.40 పాయింట్లు లాభపడి 28217.65 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.32 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.50 శాతం లాభపడి ట్రేడవుతుండగా, కోటక్‌ బ్యాంక్‌ మాత్రం

Most from this category