News


ఆటో, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లో 1000 పాయింట్ల రికవరి!

Wednesday 28th August 2019
Markets_main1566978891.png-28073

-అనిశ్చితిలో బ్యాంకింగ్‌ సెక్టార్‌

-జేఎం ఫైనాన్సియల్‌, గౌతమ్‌ షా
  ‘గత కొన్ని వారాలలో మార్కెట్‌ భారీగా నష్టపోయింది. కానీ ఆల్‌టైం గరిష్ఠం నుంచి మార్కెట్‌ 12 శాతం పడిపోవడం పెద్ద క్షీణతగా అనుకోవడం లేదు’ అని జేఎం ఫైనాన్సియల్‌, గౌతమ్‌ షా ఓ ఇంటర్యూలో తెలిపారు. కాగా ఈ ఏడాది జూన్‌ 3 న నిఫ్టీ 50 ఆల్‌ టైం గరిష్ఠమయిన 12,103 ను తాకింది. అక్కడి నుంచి ప్రస్తుత 11,100 స్థాయికి పడిపోయింది. గత మూడు నెలల కాలంలో నిఫీ సుమారుగా 1000 పాయింట్లను కోల్పోపోవడం గమనార్హం. ‘నిఫ్టీ 10,600 స్థాయి వద్ద ఓవర్‌సోల్డ్‌కు చేరింది, అంతేకాకుండా గత కొన్ని సెషన్‌ల నుంచి బేరిష్‌ కదలికలు ఈ స్థాయి వద్ద నిలచిపోవడం చూశాం’ అని గౌతమ్‌ షా అన్నారు. నిఫ్టీకి 11,150 స్థాయి ముఖ్యమైనదని, ఒక వేళ నిఫ్టీ 11,150 స్థాయిని అధిగమిస్తే, తర్వాత 11,450 స్థాయిని చేరుకుంటుందని అంచనా వేశారు.  అంతేకాకుండా మార్కెట్‌ కదిలికల నిర్ధిష్ఠ శ్రేణి విస్తరించిందని, మార్కెట్‌లో చాలా భాగం బాటమ్‌ ఔట్‌ అయ్యిందని షా అభిప్రాయపడ్డారు. వచ్చే కొన్ని వారాల పాటు మార్కెట్‌ ఏదొ ఒక స్టాక్‌, నిర్థిష్ట రంగాల వారిగా కదిలే అవకాశం ఉందని తెలిపారు. అమెరికా మార్కె‍ట్స్‌ గురించి మాట్లాడుతూ..యుఎస్‌ మార్కెట్‌లు ఇంకా బేరిష్‌ దృక్పథం నుంచి బయటపడలేదని, వచ్చే కొన్ని నెలల వరకు ఈ మార్కెట్లు అదే దోరణితో కదిలే అవకాశం ఉందని వివరించారు.  

సెక్టార్‌ల పరంగా ...
‘ముందుకు వెళ్లే కొద్ది బ్యాంకింగ్‌ సెక్టార్‌లో అనిశ్చితి ఉండే అవకాశం ఉంది. అయినప్పటికి ఇప్పటి వరకు పతనంలో కొనసాగిన స్టాకులు మంచి ప్రదర్శన చేసే అవకాశం ఉంది’ అని షా అన్నారు. ఒకవేళ నిఫ్టీ బ్యాంక్‌ 28,200 స్థాయిని అధిగమిస్తే, నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 29,000 వైపు కదలగలదని అభిప్రాయపడ్డారు. ‘మార్కెట్‌లో జరిగిన దిద్దుబాటు వలన అనేక సెక్టార్‌ సూచీలు వాటి మిడ్‌టర్మ్‌ మద్ధతు స్థాయిల వద్ద ప్రస్తుతం ట్రేడవుతున్నాయి. ఆటో సెక్టార్‌ గురించి మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో ఆటో స్టాకులు 35 శాతం మేర దిద్దుబాటుకు గురయ్యాయి. అందువలన ఈ స్టాకులు బలంగా బౌన్స్‌బ్యాక్‌ అయ్యే అవకాశం ఉంది’ అని షా వివరించారు. ‘ఆటో ఇండెక్స్‌ 1000 పాయింట్ల వరకు తిరిగి రికవరి అవుతుందని అంచనా వేస్తున్నాం. ఒక వేళ ఆటో ఇండెక్స్‌ రికవరి అయితే అది మార్కెట్‌ సానుకూల సెంటిమెంట్‌ను పెంచుతుంది’ అని ఆయన అన్నారు. ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గల కాలంలో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 12 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 15 శాతం నష్టపోవడం గమనార్హం. ఇంత భారీగా ఈ ఇండెక్స్‌లు పడిపోవడంతో మిడ్‌క్యాప్స్‌ను కొనుగోలు చేయడం మంచిదని, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ తిరిగి 1000 పాయింట్ల రికవరి చేయగలదని గౌతమ్‌ షా అభిప్రాయపడ్డారు.



You may be interested

ఈ ఏడాది చివరి నాటికి 10000 స్థాయికి నిఫ్టీ

Wednesday 28th August 2019

ఈ ఏడాది చివరి నాటికి నిఫ్టీ-50 సూచీ 10,000 స్థాయికి దిగి వచ్చే  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జిమిత్‌ మోదీ అంచనా వేస్తున్నారు. నిఫ్టీలో టాప్‌-10 ఆర్థిక రంగ షేర్లలో ఏర్పడబోయే అదనపు దిద్దుబాటు ఇందుకు కారణమవచ్చని జీమీత్ చెప్పుకొచ్చారు. ఇందుకు ఫైనాన్షియల్‌ రంగంలోని టాప్‌ 10 స్టాకులు అధిక వాల్యూషన్ల వద్ద ఉండడమే కారణం కావచ్చన్నారు. ఈ స్థాయిలో వాల్యూషన్లు పెరగడానికి ఈ ఏడాది ఫైనాన్షియల్స్‌ జరిపిన భారీ

బ్యాంకుల మొండిబకాయిలు మరింత పెరుగుతాయా?

Wednesday 28th August 2019

తక్కువ రేటింగ్‌ ఉన్న కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ కంపెనీ)ల్లో ఎగవేతల వలన బ్యాంకింగ్‌ సెక్టార్‌లో మొండి బకాయిల భయాలు తిరిగి ఊపందుకున్నాయని అంతర్జాతీయ బ్రోకరేజి క్రెడిట్‌సూసీ పేర్కొంది. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల పరిష్కారం కోసం ఆర్‌బీఐ జూన్‌ 7 ప్రకటిచిన నిబంధనల కిందకు దాదాపు రూ. 2.4 లక్షల కోట్ల రుణాలు వస్తాయని తెలిపింది. ‘అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ రుణాలలో 70 శాతం రుణాలు తీవ్ర

Most from this category